chattisghar border
-
రాష్ట్ర సరిహద్దులపై పోలీసుల నిఘా
సాక్షి, హైదరాబాద్/వెంకటాపురం(కె): తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సీపీఐ (మావోయిస్టు) పార్టీ ఈనెల 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నిర్వహించనున్న అమరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు ఆయా ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేశారు. ముఖ్యంగా గోదావరి, ప్రాణహిత నది పరీవాహక ప్రాంతాల మీదుగా మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉండటంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో పోలీసులు అప్రమత్తమయ్యా రు. ఈ ప్రాంతాల్లో సాధారణ తనిఖీలతోపాటు సరిహద్దులు, అడవుల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. కాగా గోదావరి, ప్రాణహితలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున మావోయిస్టులు నదులను దాటే ప్రయత్నం చేయకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ‘మావో’పోస్టర్ల కలకలం ములుగు జిల్లా వెంకటాపురం మండలం విజయపురి కాలనీ పరిసర ప్రాంతాల్లో ఆదివారం మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు జరిగే మావోయిస్టు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను విజయవంతం చేయాలని అందులో పేర్కొన్నారు. ‘గ్రామ గ్రామాన వారోత్సవాలు నిర్వహించి, అమర వీరుల ఆశయాలను కొనసాగించాలి. శత్రు సాయుధ బలగాలు చేస్తున్న సమాధాన్ ప్రహార్ దాడిని ఓడిద్దాం. ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలి’అని చర్ల – శబరి ఏరియా కమిటీ పేరున పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్ల వ్యవహారం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. జిల్లా ఎస్పీ సునీల్ శర్మ కథనం ప్రకారం.. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో చింతగుఫ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల అటవీ ప్రాంతంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు కూం బింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు తారసపడిన మావోయిస్టులు బలగాలపైకి కాల్పులు జరిపారు. పోలీసులు కూడా ఎదురు కాల్పుల కు దిగారు. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందగా, పలువురు తప్పించుకొని పారిపోయారు. -
ఛత్తీస్‌గఢ్‌లో కలకలం: కానిస్టేబుళ్ల దారుణ హత్య
చర్ల: సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో ఇద్దరు అసిస్టెంట్ కానిస్టేబుళ్లు గురువారం హత్యకు గురయ్యారు. జిల్లా ఎస్పీ కేఎల్.ధ్రువ్ తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జి పోలీస్‌స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ కానిస్టేబుళ్లు పూనెం హరీమ్ (29), ధనిరాం కశ్యప్ (31) ద్విచక్ర వాహనంపై సమీపంలోని ఓ గ్రామంలో ఉన్న వైద్యశాలకు పనిపై వెళ్లారు. వారు తిరిగి వస్తుండగా.. మార్గమధ్యలో ద్విచక్ర వాహనాన్ని అటకాయించిన గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పూనెం హరీమ్‌ది దంతెవాడ జిల్లా నేతల్‌నార్ గ్రామం కాగా, కశ్యప్ సుకుమా జిల్లా జేగురుగొండ గ్రామం. అసిస్టెంట్ కానిస్టేబుళ్లను మావోయిస్టులు హతమార్చారా? లేక వ్యక్తిగత కక్షల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారా? అనే కోణాల్లో విచారణ చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. చదవండి: తన దోషం పోతుందని బిడ్డను బలిచ్చింది -
సొంత కమాండర్‌నే హతమార్చిన మావోలు
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు సొంత దళకమాండర్‌నే హతమార్చిన సంఘటన గురువారం జరిగింది. బస్తర్ రేంజ్ ఐజీ ఈ ఘటనను ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. బీజాపూర్ జిల్లా గంగులూరు ఏరియాలో పలువురు ఆదివాసీలను మావోయిస్టులు హత్య చేశారు. అయితే ఈ హత్యల నేపథ్యంలో పలువురు అమాయక ఆదివాసీలు సైతం హత్యకు గురయ్యారు. ఈ క్రమంలో గంగులూరు డీవీసీ ఏరియా కమిటీ కమాండర్ విజా మొడియం అలియాస్ భద్రు (34) కొంతకాలంగా వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ వారిని హత్య చేశారనే సమాచారం మావోయిస్టు పార్టీ ముఖ్య నేతలకు చేరింది. దీంతో గురు వారం గంగులూరు–కిరండోల్ మధ్యలోని ఎటావర్ అటవీ ప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టు ముఖ్య నేతలు సదరు కమాండర్‌ను హతమార్చినట్లు తెలుస్తోంది. (బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఏజెన్సీ) -
సరిహద్దుల్లో ఉద్రిక్తత
సాక్షి, వరంగల్: మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర బోర్డర్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఓవైపు మావోయిస్టుల సంచారం, మరోవైపు పోలీసు, గ్రేహౌండ్స్ బలగాల తనిఖీలు, కూంబింగ్.. అటవీ పల్లెల్లో అలజడి రేపుతోంది. గోదావరి పరిరీవాహక ప్రాంతాతల అడవుల్లో మావోయిస్టులు తలదాచుకుని ఉంటారని భావిస్తూ ప్రత్యేక దళాలతో జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచా రంతో గోదావరి, ప్రాణహిత పరివాహక ప్రాంతాలపై మూడు నెలలుగా దృష్టి సారించిన పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నారు. ఈ ప్రాంతాలను ఇప్పటికే రెండు పర్యాయాలు సందర్శించిన పోలీసు బాస్, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి మరోమారు బుధవారం నుంచి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. ఈ సంద ర్భంగా మూడు రాష్ట్రాల సరిహద్దు, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పోలీసుస్టేషన్లలో పనిచేస్తున్న పలువురు పోలీసు అధికారుల బదిలీలు కూడా జరిగాయి. మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేయడంలో అనుభవం, ఆసక్తి ఉన్న వారికి పోస్టింగ్ ఇచ్చారు. దేవార్లగూడెం ఎన్‌కౌంటర్‌తో రెడ్అలర్ట్ ఓ వైపు పోలీసుబాస్ పర్యటన, మరోవైపు దేవార్లగూడెం ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవార్లగూడెం – దుబ్బగూడెం గ్రామాల మధ్య గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు యాక్షన్ టీం నాయకుడు దూది దేవాల్ అలియాస్ శంకర్ మృతి చెందా డు. దీనిపై స్పందించిన మావోయిస్టులు ఈనెల 6న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, పెద్దపల్లి, తూర్పు గోదావరి జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చారు. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా నల్లకుంట ఏరియా అర్లపల్లికి చెందిన శంకర్ అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లగా పట్టుకున్న పోలీసులు చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని ఆ ప్రకటనలో ఆరోపించారు. ఈ మేరకు బంద్‌కు పిలుపునివ్వగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. అలాగే, గుండాల ఎన్‌కౌంటర్‌తో అప్రమత్తమైన పోలీసులు నక్సల్స్ కోసం వేట మొదలుపెట్టారు. మణుగూరు నుంచి ములుగు జిల్లా మంగపేట, ఏటూరు నాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం, భూపాలపల్లి జిల్లా పలిమెల, మహదేవపూర్, మహముత్తారం అడవుల్లోకి మావోయిస్టులు వచ్చినట్లు నిఘా వర్గాల సమాచారంతో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతీకారంగా మావోయిస్టులు ఏదైనా ఘటనకు పాల్పడుతారేమోననే అనుమానంతో పోలీసులు తనిఖీలు విస్తృతం చేయడంతో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే, నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోని టీఆర్ఎస్, బీజేపీ నేతలను పట్టణ ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ పల్లెలు ఉలిక్కి పడుతున్నాయి. బడే చొక్కారావు, వెంకటేశ్ లక్ష్యంగా కూంబింగ్ మావోయిస్టు నేతలు బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, కంకనాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ లక్ష్యంగా పోలీసుల కూంబింగ్ సాగుతోంది. “ఆపరేషన్ ప్రహార్’ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన మావోయిస్టు దళాలు వీరి నాయకత్వంలోనే గోదావరి పరివాహక ప్రాంతంలో సంచరిస్తున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు. మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా ఉన్న రాష్ట్ర యాక్షన్ టీం కార్యదర్శి దామోదర్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి(జేఎండబ్ల్యూపీ) డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్‌ను టార్గెట్ చేసుకొని పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ ఇద్దరు నేతలు భూపాలపల్లి, ములుగు అడవుల్లో మకాం వేసినట్టు నిఘా వర్గాలు గుర్తించాయని సమాచారం. అయితే కేకేడబ్ల్యూ కార్యదర్శిగా పని చేసిన దామోదర్‌కు పూర్వ వరంగల్, ఖమ్మం, కరీంనగర్ అడవులపై పట్టు ఉండడంతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నట్లు భావిస్తున్నారు. -
భారీ ఎన్కౌంటర్.. నలుగురు జవాన్లు మృతి
సాక్షి, రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర పోరాటంలో నలుగురు జవాన్లు అమరులవ్వగా, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ డీఐజీ పీ సుందరాజ్ మాట్లాడుతూ.. 114వ బెటాలియన్‌కు చెందిన జవాన్లు ఎన్నికల నేపథ్యంలో కాంకేర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారని, దీంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని తెలిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారని ధ్రువీకరించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, కాల్పులకు దిగిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నమని ఆయన తెలిపారు. -
పామేడులో హెలికాప్టర్‌పై మావోల కాల్పులు
చర్ల: ఖమ్మం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఓ హెలికాప్టర్‌పై కాల్పులు జరిపారు. ఆ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఈ నెల 4న పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పోలింగ్‌బాక్సులను పామేడు పోలీస్‌స్టేషన్‌లో అధికారులు భద్రపరిచారు. వాటిని జిల్లా కేంద్రం బీజాపూర్‌కు తరలించేందుకు శుక్రవారం మధ్యాహ్నం హెలికాఫ్టర్ పామేడు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. అక్కడే మాటు వేసి ఉన్న మావోయిస్టు దానిపై కాల్పలు జరిపారు. అప్రమత్తమైన పామేడు పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో హెలికాఫ్టర్‌కు ఎటువంటి నష్టం వాటిల్లలేదు.