దశలవారీగా రైల్వేస్టేషన్ల అభివృద్ధి
దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ
జిల్లావ్యాప్తంగా తనిఖీలు
వరంగల్‌లో ఎస్కలేటర్ ప్రారంభం
జిల్లాలోని రైల్వేస్టేషన్లను దశలవారీగా అభివృద్ధి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాలోని పలు రైల్వేస్టేషన్లను తనిఖీ చేశారు..
మట్టెవాడ :జిల్లాలోని రైల్వే స్టేషన్లను దశల వారీగా అభివృద్ధి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ అన్నారు. జిల్లాలో శుక్రవారం ఆయన పలు రైల్వేస్టేసన్లలో తనిఖీలు నిర్వహించారు.పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నగరంలోని వరంగల్ రైల్వేస్టేషన్‌ను సాయంత్రం సందర్శించిన ఆయన శివనగర్ వైపు ఉన్న కార్‌పార్కింగ్, ప్రయాణికుల షెడ్డును పరిశీలించారు. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన ఎస్కలేటర్తోపాటు స్టేషన్ ఆవరణలోని 108 అంబులెన్స్ సేవల షెడ్డు, అంబులెన్స్‌ను ప్రారంభించారు. అదేవిధంగా ప్లాట్ ఫాం-1 వైపు ఉన్న హై క్లాస్ వేయిటింగ్ హాల్‌ను పరిశీలించారు. అంతేకాకుండా స్టేషన్‌లోని జ్యూస్ పాయింట్స్, టాయిలెట్స్ కూడా పరిశీలించారు. వరంగల్‌లో వాషబుల్ అఫ్రాన్ ఏర్పాటు కావాలంటే సుమారు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వ్యయమవుతుందని, అయినా ఇక్కడ అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని కొందరు ప్రయూణికులు కోరగా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని ఆయన సమాధానమిచ్చారు. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వరంగల్ హాల్టింగ్ కల్పించాలని కోరగా, స్థానిక ప్రజా ప్రతినిధులతో రైల్వే శాఖ మంత్రి, ఉన్నతాధికారులపై ఒత్తితి తేస్తే సాధ్యమవుతుందని చెప్పారు.
అంతకు ముందు స్టేషన్‌లోని ప్లాట్ ఫాం-3లో జీఎం శ్రీవాత్సవకు సౌత్ సెంట్రల్ రైల్వే హమాలీ యూనియన్ ఘన స్వాగతం పలికింది. ఆయన వెంట డీఆర్ఎం ఎస్కే.మిశ్రా, సీనియర్ డీసీఎం రవీందర్ పాడె, సీనియర్ డీఈఈ కోటేశ్వర్రావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, ప్రజాప్రతినిధులు ఎవరూ రాకపోవడం ప్రయూణికులను విస్మయూనికి గురిచేసింది.