సమైక్య పోరుకు 90 రోజులు
జిల్లాలో సమైక్య ఉద్యమం ప్రారంభమై 90 రోజులైంది. వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఎన్జీవోలు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు, విద్యార్థులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. సమైక్యాంధ్ర మా ఊపిరి అంటూ నినదిస్తున్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరు ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు.
తిరుపతి, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్య ఉద్యమం పురుడు పోసుకుని 90 రోజులైంది. ఎన్జీవోలు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికు లు సమ్మె విరమించినప్పటికీ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు సమైక్య శంఖారావం నింపిన నూతనోత్తేజంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రిలే దీక్షలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమైక్యాంధ్ర మా ఊపిరి అంటూ నినదిస్తున్నారు.
తిరుపతి తుడా సర్కిల్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షల్లో సోమవారం చెన్నారెడ్డికాలనీ (అం బేద్కర్ కాలనీ)కి చెందిన మహిళలు పాల్గొన్నారు. ఎమ్మె ల్యే కరుణాకరరెడ్డి దీక్ష శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన కార్యకర్తలతో కలసి ఇంది రా మైదానంలో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమకు సాగునీటి కష్టాలు మొదలవుతాయని, రైతులు వ్యవసాయాన్ని మానుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ రైతు వేషంలో నాగళ్లు తగులబెటి ్ట నిరసన తెలి పారు. పలమనేరులో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రిలే దీక్షలు కొనసాగించా రు. సమైక్యానికి మద్దతుగా ఎన్జీవోలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. చిత్తూరులో ఎన్జీవో హోం వద్ద ఎన్జీవోలు రిలే దీక్షలు ప్రారంభించారు. తిరుపతిలో రెవెన్యూ ఉద్యోగులు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
మదనపల్లెలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. జేఏసీ, మిట్స్ కళాశాల ఆధ్వర్యంలో సమైక్యవాదులు మల్లికార్జున సర్కిల్ లో మానవహారం నిర్వహించారు. సమైక్య ఉద్యమం ప్రారంభమై 90 రోజులైన సందర్భంగా 90 సంఖ్య ఆకారంలో కూర్చొని నిరసన తెలిపారు. పుంగనూరులో ఉద్యోగ జేఏసీ చైర్మన్ వరదారెడ్డి ఆధ్వర్యంలో ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు, వీఆర్వోలు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
రాష్ర్ట విభజన జరిగి తే యువత ఉద్యోగాలపై ఆశ వదులుకొని పనులు చేసుకుని బతకాల్సిందేనంటూ చేపలు, పాలు అమ్మి నిరసన తెలిపారు. శ్రీకాళహస్తిలో స్కిట్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి పెండ్లిమండపం వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. బి,కొత్తకోటలో ప్రభు త్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేశారు.