గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్
చెన్నై: భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్(43) ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గూగుల్ ఆల్ఫాబెట్ పేరిట మరో కొత్త కంపెనీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి అనుబంధ సంస్థగా గూగుల్ కొనసాగనుంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో సుందర్ 1972లో జన్మించారు. ఆయన ఐఐటీ- ఖరగ్‌పూర్ నుంచి ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ సంపాదించారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్, వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టాను సుందర్ పొందారు. పిచాయ్ 2004 లో గూగుల్ లో చేరి అంచెలంచెలుగా ఎదిగి సీఈఓ స్థాయికి చేరారు. సుందర్ పిచాయ్ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెళ్ల, ఆంధ్రపదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌లు అభినందించారు.
Congrats @sundarpichai well deserved!
— Satya Nadella (@satyanadella) August 10, 2015
Congratulations @sundarpichai for being named the CEO of Google. Best wishes to you. Proud moment for India.
— N Chandrababu Naidu (@ncbn) August 11, 2015
Congratulations @sundarpichai. Wish @google scales new heights under your leadership.
— Min IT, Telangana (@MinIT_Telangana) August 11, 2015