cherukulapadu
-
ఎద్దుల బండిపై చెర్నాకోలా చేతబట్టి...
సాక్షి, చెరుకులపాడు : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. పాదయాత్రలో భాగంగా పత్తికొండ నియోజకవర్గం చెరుకులపాడు చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రాజన్న తనయుడి రాక సందర్భంగా భారీగా జనం తరలివచ్చారు. అన్న వస్తున్నాడు అంటూ వైఎస్ జగన్‌కు జేజేలు పలికారు. అలాగే టీడీపీ పాలనలో తాము పడుతున్న తమ సమస్యలను వైఎస్ జగన్‌కు వివరించారు. వారి ఇబ్బందులను సావధానంగా విన్న ఆయన....త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. అనంతరం అశేష ప్రజాభిమానం నడుమ అక్కడ పార్టీ జెండా ఆవిష్కరించారు. అలాగే ఎద్దుల బండి ఎక్కి చెర్నాకోలా చేతబట్టిన జగన్‌ను చూసి ప్రజలు పెద్ద పెట్టున నినాదాలు చేయగా, యువత ఉత్సాహంతో ఈలలు వేస్తూ తమ అభిమానం చాటుకున్నారు. అలాగే ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన పార్టీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి సమాధిని వైఎస్ జగన్ సందర్శించి, నివాళులు అర్పించారు. పాదయాత్రలో భాగంగా కృష్ణాగిరి మండలం వైఎస్ జగన్‌ను ....జైపాల్ రెడ్డి అనే దివ్యాంగుడు కలిశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల పెన్షన్లను రూ.1500 నుంచి రూ.3000కి పెంచాలని కోరారు. దాంతో పాటు రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న బియ్యాన్ని 35 కేజీలకు పెంచాలని కోరాడు. జైపాల్ రెడ్డి అభ్యర్థనకు వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. సమస్యలు చెప్పుకున్న మహిళలు అంతకు ముందు వెల్దుర్తిలో వైఎస్ జగన్‌ను... కలిసిన మహిళలు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సహకారం, బ్యాంకు రుణాలు గురించి మహిళలను జగన్ అడిగి తెలుసుకున్నారు. రుణాలు అందుతున్నాయా లేదా అని ప్రశ్నించారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వచ్చిందా లేదా అని అడిగారు. దీనికి రుణాలు అందలేదని..బంగారం బ్యాంకులోనే ఉందని ముక్తకంఠంతో చెప్పారు. చంద్రబాబు నిలువునా ముంచేశారని వాపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సున్నా, పావలా వడ్డీలు ...రావడం లేదని వివరించారు. పార్టీ అధికారంలోకి వస్తే తాము అమలు చేయబోయే పథకాల గురించి జగన్ ఈ సందర్భంగా మహిళలకు హామీ ఇచ్చారు. జగన్‌ను కలిసిన ముస్లిం సోదరులు తమను టీడీపీ ప్రభుత్వం పూర్తిగా దగా చేసిందని మైనార్టీ సోదరులు ప్రతిపక్షనేతకు విన్నవించుకున్నారు. రిజర్వేషన్తొ పాటు మసీదుల్లో పనిచేసే వారికి ఇచ్చే జీతాల విషయంలో కూడా మోసం చేశారని తెలిపారు. దీనిపై స్పందించిన ప్రతిపక్షనేత తమ పార్టీ అధికారంలోకి రాగానే అని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా జగన్‌ను కలిశారు. తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై వైఎస్ జగన్‌కు వినతిపత్రం సమర్పించారు. చెరుకులపాడు, పుట్లూరు, తొగరచేడు క్రాస్ మీదగా మధ్యాహ్నానికి వైఎస్ జగన్ కృష్ణగిరి చేరుకుంటారు. అక్కడే భోజన విరామం తీసుకుంటారు. తిరిగి యాత్రను కృష్ణగిరి మీదుగా రామకృష్ణాపురం వరకూ కొనసాగిస్తారు. పాదయాత్రలో భాగంగా సాయంత్రం కృష్ణగిరి గ్రామస్తులతో ....వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం రామకృష్ణాపురం వరకు నడక సాగించి...రాత్రికి అక్కడే బస చేస్తారు. -
చెరుకులపాడు చేరుకున్న వైఎస్ జగన్ పాదయాత్ర
-
నిష్పక్షపాతంగా విచారణ
– చెరుకుల పాడు గ్రామంలో ఎస్పీ పర్యటన – నారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ – వెల్దుర్తి ఎస్ఐపై శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు వెల్దుర్తి రూరల్: చెరుకులపాడు నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు హత్య కేసును నిష్పక్షపాతంగా విచారిస్తామని ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. ప్రత్యేక విచారణ అధికారిగా డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్‌ను నియమించామన్నారు. ఆదివారం ఆయన చెరుకులపాడు గ్రామంలో పర్యటించారు. హత్య అనంతరం గ్రామ పరిస్థితులపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని హతుడు సాంబశివుడు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం నారాయణరెడ్డి అన్న ప్రదీప్‌కుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లారు.అలాగే నారాయణరెడ్డి సతీమణి కంగాటి శ్రీదేవి, కుమారుడు మోహన్‌రెడ్డిలను వారి స్వగృహానికెళ్లి పరామర్శించారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. హత్యకు సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ స్కెచ్‌లు వేశారు.. ఫోన్లలో ఎవరి ద్వారా సమాచారమందుకున్నారు.. ఎవరికి సమాచారమందించారు..తదితర అన్ని కోణాల్లో విచారణ జరుపుతామన్నారు. నిందితుల విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీ కోరుతూ కోర్టుకు అప్పీలు చేసినట్లు చెప్పారు. హత్యకు సంబంధించి వివరాలు, సమాచారం తెలిపితే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఏ చిన్న సమస్య ఎదురైనా తన నంబరు 9440795500ను సంప్రదించాలన్నారు. జిల్లాలో ఫ్యాక్షన్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. హత్యలతో రక్తం చిందించడం మానవ ధర్మం కాదని, ప్రతీ మనిషి తన రక్తాన్ని ఆపదలో ఉన్న ఇతరులకు దానం చేయడానికి వాడాలని సూచించారు. ఎస్ఐపై శాఖా పరమైన చర్యలు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసుకు సంబంధించి అలసత్యం ప్రదర్శించిన వెల్దుర్తి ఎస్ఐ తులసీనాగప్రసాద్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఎస్ఐపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి విచారణ చేపట్టాలని డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్‌ను ఆదేశించారు. ఇప్పటి వరకు తాను ఐదు మెమోలు ఎస్ఐకు జారీ చేసినట్లు డోన్ డీఎస్పీ.. ఎస్పీకి తెలిపారు. ఫిర్యాదులివీ.. నారాయణరెడ్డి హత్యకు పరోక్ష కారణం ఎస్ఐ తులసీప్రసాదేనని ప్రదీప్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తన భర్త హత్యలో కేఈ శ్యాంబాబుతో పాటు ఎస్ఐ పాత్ర ముఖ్యంగా ఉందంటూ కంగాటి శ్రీదేవి ఎస్పీ ఎదుట వాపోయారు. తాను దళిత మహిళా సర్పంచ్, గర్భవతినని తెలిసినా గ్రామంలో పరిస్థితులపై పిర్యాదుకు వెళితే స్టేషన్లోనే అవమానాలకు గురిచేసి, అసభ్యంగా మాట్లాడాడని సర్పంచ్ అపర్ణ, ఆమె భర్త శివ ఫిర్యాదు చేశారు. సివిల్ పంచాయితీలు చేస్తూ పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు తెచ్చారని వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దిరెడ్డి, అగస్టీన్, ప్రశాంత్ తదితరులు ఎస్ఐపై ఆరోపణలు గుప్పించారు. -
చెరుకులపాడు ఘటనపై కేసులు నమోదు
వెల్దుర్తి రూరల్: చెరుకులపాడు గ్రామంలో శుక్రవారం జరిగిన టీడీపీ దౌర్జన్య కాండపై పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేశారని నారాయణరెడ్డి వర్గీయుడు శేషు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ వర్గీయులు పెద్దయ్య, నాగరాజు, రామనాయుడుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తులసీనాగప్రసాద్ శనివారం తెలిపారు. టీడీపీ వర్గీయుడు వీరాంజనేయులు తనపై దాడి చేశారనే ఫిర్యాదు మేరకు నారాయణరెడ్డి వర్గీయులు శేషు, మల్లయ్య, లింగన్న, కొమ్ము మల్లయ్య, మాదన్న, రత్నంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. -
టీడీపీ దౌర్జన్యకాండ
– చెరుకులపాడులో బరితెగింపు – నారాయణరెడ్డి వర్గీయులపై దాడి – ఇంటి ఆవరణలోని జీపు ధ్వంసం – పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించిన ఇరువర్గాలు వెల్దుర్తి రూరల్: టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. చెరుకులపాడు గ్రామంలో శుక్రవారం సాయంత్రం దౌర్జన్యకాండకు దిగారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ఒక పొలం విషయంలో టీడీపీ వర్గీయులు, వైఎస్ఆర్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి వర్గీయుల మధ్య విభేదాలు ఉన్నాయి. శుక్రవారం నారాయణరెడ్డి వర్గీయులు ట్రాక్టర్లో వెళుతుండగా నలుగురు టీడీపీ కార్యకర్తలు అటకాయించారు. ట్రాక్టర్‌కు ఉన్న రాడ్‌తోనే దాడికి పూనుకున్నారు. హఠాత్పరిమాణానికి హతాశయులైన నారాయణరెడ్డి వర్గీయులు పరుగుతీశారు. గ్రామంలోని నారాయణరెడ్డి ఇంట్లో తలదాచుకున్నారు. టీడీపీ కార్యకర్తలు ఇంటి ఆవరణలో ఉన్న జీపును పాక్షికంగా ధ్వంసం చేశారు. ఇది తెలుసుకున్న గ్రామస్తులు వారిపై తిరుగబడేలోపు రాళ్లదాడి చేస్తూ అక్కడినుంచి తప్పించుకున్నారు. నారాయణరెడ్డి వర్గీయులు వెల్దుర్తి పోలీసులను ఆశ్రయించగా..దాడి చేసిన వారుసైతం ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న డోన్ సీఐ శ్రీనివాసులు, కష్ణగిరి ఎస్ఐ సోమ్లానాయక్ తమ సిబ్బందితో కలిసి గ్రామానికి నారాయణరెడ్డి ఇంటికి వెళ్లి ఆవరణలో ఉన్న ధ్వంసమైన జీపును పరిశీలించి సంఘటన గూర్చి గ్రామస్తులతో విచారించారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు వారు తెలుపుతున్నారు. ఇంత ఘోరమా దాడి విషయంపై నారాయణరెడ్డి ఫోన్లో స్పందిస్తూ ప్రస్తుతం కర్నూలులో తాను ఇంట్లో ఉన్నానన్నారు. ఇది టీడీపీ నాయకుల కుట్ర. తనపై దాడి చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఇదంతా జరుగుతోందన్నారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు గ్రామంలో చిచ్చపెట్టాలని చూస్తున్నారన్నారు. వీటికి పోలీసులు పుల్‌స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. -
టీడీపీ దౌర్జన్యకాండ