Chess competion
-
సముద్రంలో చదరంగం.. 60 అడుగుల లోతుకు డైవ్ చేసి
కొరుక్కుపేట: చెన్నైలో 44వ చెస్ ఒలంపియాడ్ జరుగుతున్న నేపథ్యంలో ఆరుగురు స్థానిక ఆటగాళ్లు వినూత్నంగా ఇలా సముద్రం లోపల చెస్ ఆడారు. అరవింద్ తరుణ్ శ్రీ అనే టెంపుల్ అడ్వెంచర్స్ డైవింగ్ సెంటర్ల వ్యవస్థాపకుని నేతృత్వంలో ఆదివారం ఈ ఘనత సాధించారు. స్థానిక నీలంకరై తీరం నుంచి పడవలో సముద్ర తీరం నుంచి ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్లారు. అక్కడి నుంచి 60 అడుగుల లోతుకు డైవ్ చేశారు. పావు గంటకు ఓ గేమ్ చొప్పున రెండు గంటల పాటు చెస్ ఆడారు. ఇందుకోసం ప్రత్యేకమైన చెస్ బోర్డులు, పావులు రూపొందించారు. ఇందులో పాల్గొన్న ఆటగాళ్లంతా శిక్షణ పొందిన స్కూబా డైవర్లు కావడం విశేషం. 20 నిమిషాలకోసారి నీళ్లలో నుంచి పైకి వచ్చిపోయారట. -
జాతీయ చెస్ పోటీలకు జిల్లా విద్యార్థులు
గుంటూరు స్పోర్ట్స్: జిల్లా చెస్ క్రీడాకారులు బొమ్మిని మౌనిక అక్షయ, హరి సూర్య భరద్వాజ్ జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు విజయనగరంలో జరిగిన అండర్–19 రాష్ట్ర స్థాయి చెస్ పోటీలలో వీరు ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అక్టోబర్ 8 నుంచి 16 వరకు రాజమండ్రిలో జరిగే అండర్–19 జాతీయ చెస్ పోటీల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా వీరిని సోమవారం చంద్రమౌళినగర్లోని అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ కార్యదర్శి చల్లా రవీంద్ర రాజు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శిక్షకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.