యువశాస్త్రవేత్త చేతన్‌శెట్టి
చేతన్‌కుమార్ జి. శెట్టి 20 ఫిబ్రవరి 1991న కర్ణాటకలోని సిద్ధాపూర్లో మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. అతనికి ఆస్ట్రోఫిజిక్స్, జనరల్ సైన్స్ మొదలైన విషయాల పట్ల చాలా ఆసక్తి. అతను ఎప్పుడూ ్ఖఊై (గుర్తింపబడని ఎగిరే వస్తువులు), పాలపుంతలు, విశ్వం గురించి సమాచారం సేకరించేవాడు.
చేతన్ దాదాపు 14 పరిశోధన పత్రాలను తయారుచేశాడు. వాటిలో 9 యుఎస్ఏ, కెనడా, పాకిస్థాన్, ఇటలీ, నైజీరియా ఇంకా భారతదేశంలో అంతర్జాతీయ కార్యక్రమాల జర్నల్స్‌లో, వార్తాపత్రికల్లో ముద్రించారు. 17అంతర్జాతీయ జాతీయ వార్తాపత్రికలు చేతన్ గురించి వ్యాసాలు రాశాయి. అతని పరిశోధన పత్రాలు బ్యాంకాక్, హాంగ్‌కాంగ్, చైనా, స్కాట్లాండ్, నైజీరియా దేశాలోల జరిగిన పది అంతర్జాతీయ సమావేశాలకు ఎంపిక చేశారు. 25కి పైగా జాతీయ, అంతర్జాతీయ పరిశోధన సంస్థలు, పరిశోధన సంఘాలతో అతనికి అనుబంధం ఉంది.
మైక్రోసాఫ్ట్ చేతన్ని మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్, మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ టెక్నాలజీ స్పెషలిస్ట్‌గా గుర్తించింది. మైక్రోసాఫ్ట్ నిర్వహించిన పరీక్షలో చేతన్ 98 శాతం మార్కులు సాధించాడు.
తన రెండు పరిశోధనలకు పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. చేతన్ అనేక అంతర్జాతీయ సంస్థల్లో గౌరవ హోదా పొందాడు. ‘ఎక్స్పర్ఇన్’ అనే సంస్థను స్థాపించాడు. ఎన్నో శాస్త్రీయ పరిశోధన సంస్థల నుండి ప్రశంసలు, ఉచిత సభ్యత్వం పొందాడు.
ప్రస్తుతం చేతన్ న్యూఢిల్లీలో కర్ణాటకకు సంబంధించిన సైంటిఫిక్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ శాఖలో గ్రామీణ ప్రాంతాల్లో జరిగే కొత్త ఆవిష్కరణలను సమీక్షించే అధికారిగా పని చేస్తున్నారు.