chevella police station
-
పొట్టకూటి కోసం వచ్చి.. మృత్యుఒడికి
చేవెళ్ల : పొట్టకూటి కోసం వచ్చిన ఓ యువకుడు కరెంట్‌షాక్‌కు గురై మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని న్యాలట గ్రామ శివారులోని పొలాల్లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసు లు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. మండల పరిధిలోనపలు గ్రామాల వ్యవసాయ పొలాలకు ఇప్పటికే ఉన్న 100 కేవీ, 63 కేవీ ట్రాన్స్ఫార్మర్లను తొలగించి వాటి స్థానంలో 25 కేవీ ట్రాన్స్ఫార్మర్లను ట్రాన్స్‌కో అధికారులు ఏర్పాటుచేస్తున్నారు. ఈ పనులను ఐదారు నెలలుగా కాంట్రాక్టర్ పశ్చిమబంగ, బిహార్ రాష్ట్రాల నుంచి కార్మికులను (స్కిల్డ్ లేబర్)ను తీసుకొచ్చి పనులు చేయిస్తున్నాడు. ఈక్రమంలో బుధవారం ఓ సూపర్వైజర్, లైన్మెన్ ఎల్సీ తీసుకొని కార్మికులు షఫీక్(20), సయ్యద్, ఆఫ్రిదీ, అక్తర్‌తో మండల పరిధిలోని న్యాలట శివారులో పనులు చేయిస్తున్నారు. కార్మికులు స్తంభాలు ఎక్కి ఏబీ స్విచ్‌లు బిగించడం, మరమ్మతులు చేస్తుం డగా అకస్మాత్తుగా విద్యుదాఘాతానికి గురైన షఫీక్ స్తంభంపైనే మృతిచెం దాడు. స్థంభంపైన ఉన్న మరో కార్మికుడు సయ్యద్ కిందికి దూకగా అతనికి గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. కరెంట్ షాక్ తగలగానే షఫీక్ కిందికి దూకే యత్నం చేశాడు. అతడు స్తంభానికి ఉన్న రాడ్ల మధ్య ఇరుక్కుపోవడంతో తీవ్రషాక్ గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కొద్దిసేపటి తర్వాత విద్యుత్ కాంట్రాక్టర్ అక్కడికి చేరుకొని స్తంభంపై వేలాడుతున్న మృతదేహాన్ని కిందికి దించారు. మృతుడు పశ్చిమబంగ రాష్ట్రంలోని మోల్దా జిల్లాలోని కుమినరా గ్రామానికి చెందిన వాడు. కార్మికుడి మృతి విషయం తెలుసుకున్న ఎస్ఐ విజయకుమార్, ఏఎస్ఐ హన్మంత్‌రెడ్డిలు వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబీకులకు సమాచారం అప్పగించారు. కాగా, తీవ్రమైన మేఘాలు కమ్ముకోవడం, వాతావరణం మబ్బుగా ఉండడంతో సమీపంలో ఉన్న 220 కేవీ విద్యుత్ లైను క్రాసింగ్‌ల నుంచి వచ్చే ఇండక్షన్స్తో మరమ్మతులు చేస్తున్న లైను కు విద్యుత్ సరఫరా జరిగి షఫీక్‌కు షాక్ తగిలి ఉండొ చ్చని కాంట్రాక్టరు తెలిపాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
పోలీసులంటే ప్రజల్లో భయం పోవాలి
చేవెళ్ల రూరల్: చేవెళ్ల పోలీస్ స్టేషన్లో గురువారం ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఆలూరు జట్టు, పోలీస్ జట్టు మధ్య జరిగిన ఈ పోటీలను సీఐ ఉపేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు, పోలీసుల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొనాలని చెప్పారు. ప్రజలతో కలిసి పనిచేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పోలీసులు అంటే ప్రజల్లో ఉన్న భయం పోవాలన్నారు. ప్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మండలంలోని పలు గ్రామాల యువతలోని క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి వారితో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బెస్ట్ ఆఫ్ త్రీ మ్యాచ్‌లో ఆలూరు జట్టుపై పోలీసుల జట్టు 1-2 తేడాతో విజయం సాధించింది. కార్యక్రమంలో ఎస్ఐలు రాజశేఖర్, ఖలీల్, గొల్లపల్లి సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు రాములు, శివలింగం, రమేశ్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది పెంటయ్య, పాండు, శ్రీను, ఫరూక్, అంజయ్య, ప్రవీణ్, నాగరాజు, ఆలూరు యూత్‌సభ్యులు పాల్గొన్నారు.