చేవెళ్ల రూరల్: చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఆలూరు జట్టు, పోలీస్ జట్టు మధ్య జరిగిన ఈ పోటీలను సీఐ ఉపేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు, పోలీసుల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొనాలని చెప్పారు. ప్రజలతో కలిసి పనిచేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పోలీసులు అంటే ప్రజల్లో ఉన్న భయం పోవాలన్నారు. ప్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా మండలంలోని పలు గ్రామాల యువతలోని క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి వారితో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బెస్ట్ ఆఫ్ త్రీ మ్యాచ్‌లో ఆలూరు జట్టుపై పోలీసుల జట్టు 1-2 తేడాతో విజయం సాధించింది. కార్యక్రమంలో ఎస్‌ఐలు రాజశేఖర్, ఖలీల్, గొల్లపల్లి సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు రాములు, శివలింగం, రమేశ్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది పెంటయ్య, పాండు, శ్రీను, ఫరూక్, అంజయ్య, ప్రవీణ్, నాగరాజు, ఆలూరు యూత్‌సభ్యులు పాల్గొన్నారు.
పోలీసులంటే ప్రజల్లో భయం పోవాలి
Published Thu, Dec 25 2014 11:47 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement