నల్గొండ : నల్గొండ జిల్లా ఎస్పీగా వెంకట రంగనాథ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. నేరుగా కలుసుకోవడం ద్వారా ప్రజలకు సేవలందిస్తానని చెప్పారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, ఎఫెక్టివ్ పోలీసింగ్ ఇవ్వడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీస్ ఉక్కు పాదం మోపుతుందన్నారు. అక్రమ భూ దందాలకు, సెటిల్‌మెంట్‌లకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రత్యేక సోషల్ కార్యక్రమాలు కొనసాగుతాయని నూతన ఎస్పీ వెంకట రంగనాథ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment