Chhavi Mittal
-
క్యాన్సర్‌తో నటి పోరాటం.. అమ్మతనాన్ని కాపాడుకున్నా.. ఇప్పుడు..!
మానవత్వం చచ్చిపోయిందంటోంది బుల్లితెర నటి చవీ మిట్టల్ (Chhavi Mittal). క్యాన్సర్ చికిత్స వల్ల జుట్టు కోల్పోతున్న తనపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన పరిస్థితిని అర్థం చేసుకోకుండా ట్రోల్ చేయడం బాధగా ఉందని పేర్కొంది. తనపై వచ్చిన అసభ్య కామెంట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.మానవత్వం చచ్చిపోయిందిమానవత్వం చచ్చిపోతే ఎలా ఉంటుందో ఈ రోజు మరోసారి చూశాను. క్యాన్సర్ చికిత్స వల్ల నేను జుట్టు కోల్పోతుంటే మీరేమో ట్రోల్ చేస్తున్నారు. 2022 నుంచి రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నాను. దీనికి పదేళ్లపాటు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌తో నా హార్మోన్ చికిత్సకు మూడేళ్లవుతాయి. ఈ ట్రీట్మెంట్ వల్ల ఎన్నో దుష్ప్రభావాలున్నాయి. చర్మం పొడిబారడం, డీహైడ్రేషన్, బరువు సరిగా లేకపోవడం, మూడ్ స్వింగ్స్, తిమ్మిర్లు.. ఇలా వీటన్నింటితోపాటు జుట్టు కూడా ఊడిపోతుంది. ట్రోల్ చేయడానికే ఫాలో అవుతున్నారుఅమ్మాయిలకు జుట్టు అంటే ఎంతిష్టమో నేను మాటల్లో చెప్పలేను. మొదటగా అమ్మతనానికి అవసరమైన రొమ్ము నిలుపుకోవడానికి పోరాడాను. ఇప్పుడు జుట్టు కోసం! ఇలాంటి సమయంలో మీరు చేసే నెగెటివ్ కామెంట్లు నన్ను మరింత కుంగదీస్తున్నాయి. ఇప్పుడీ పోస్ట్ పెట్టడానికి ప్రధాన కారణం.. కొందరు నన్ను ఇష్టపడి నా అకౌంట్ ఫాలో అవడం లేదు. కేవలం ట్రోల్ చేయడానికే ఫాలో అవుతున్నారు. జుట్టు రాలిపోతున్న క్యాన్సర్ వారియర్‌ను ట్రోల్ చేయడానికి మీ మనసెలా అంగీకరించిందో అర్థం కావట్లేదు.నా ఆత్మస్థైర్యాన్ని చూడుమీకు తలనిండా వెంట్రుకలు, క్యాన్సర్ లేని జీవితం, నీచమైన విమర్శలు లేని జీవితం ఉండాలని ఆశిస్తున్నాను. అలాగే నేను నా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా, కష్టపడి నా శరీరాన్ని ఫిట్‌గా ఎలా ఉంచుకున్నానో చూడు అని రాసుకొచ్చింది. కాగా చవీ మిట్టల్.. తుమ్హారీ దిశ, ట్వింకిల్ బ్యూటీ పార్లర్, ఘర్ కీ లక్ష్మీ బేటియాన్, నాగిన్, బందిని, ఏక్ చుట్కి ఆస్మాన్, కృష్ణదాసి వంటి సీరియల్స్‌లో మెరిసింది. ఏక్ వివాహ్.. ఐసా భీ, పాల్ పాల్ దిల్కే సాత్ చిత్రాలు చేసింది. View this post on Instagram A post shared by Chhavi Mittal (@chhavihussein) చదవండి: అక్కాచెల్లెళ్ల మధ్య దూరం..? శిల్ప శిరోద్కర్ పోస్ట్‌తో క్లారిటీ.. -
చేయి ఆడించడం, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా: నటి
కష్టాలు ముగిసిపోయాయనుకోలేపే బుల్లితెర నటి చవీ మిట్టల్‌కు మరో పెద్ద కష్టం వచ్చిపడింది. ప్రాణాంతక మహమ్మారి క్యాన్సర్‌ను జయించిన ఆమె ప్రస్తుతం కాస్టోక్రాన్టిడిస్ (పక్కటెముకలను, రొమ్మును కలుపే మృదులాస్థికి వాపు రావడం) అనే వ్యాధితో పోరాడుతోంది. తాజాగా తన సమస్యను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. 'రొమ్ము క్యాన్సర్‌తో పోరాడి ఇటీవలే దాని నుంచి బయటపడ్డాను. కానీ అప్పటినుంచి నాకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. బహుశా క్యాన్సర్ కోసం తీసుకున్న చికిత్స వల్ల సైడ్ ఎఫెక్స్ట్ అనుకుంటా.. మొన్న కాలు ఫ్రాక్చర్ అయింది. స్కానింగ్‌లో ఎముకలో ఉండాల్సిన పదార్థాల సాంద్రత (బోన్ మినరల్ డెన్సిటీ) తక్కువగా ఉందని చెప్పారు. అదే కొనసాగితే ఓస్టియోపేనియా వస్తుందని, దీనివల్ల రక్తంలో కాల్షియం తగ్గిపోతుందన్నారు. దానికి ఓ ఇంజక్షన్ తీసుకున్నాను. అప్పటి నుంచి నా పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఛాతీలో నొప్పి మొదలైంది. అది భుజం వరకు పాకింది. నా శరీరం అంతా బిగుసుకుపోయినట్లుగా విపరీతమైన నొప్పి వచ్చింది. నొప్పి తగ్గడానికి టాబ్లెట్లు వాడాను. కానీ ఛాతీలో ఏదో అడ్డుపడినట్లుగా ఉండి ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. ఎడమ చేయి కూడా సరిగా ఆడించలేకపోతున్నాను. బాటిల్లో నీళ్లు నింపుతుంటే కూడా ఎంతో నొప్పి వస్తోంది. చిన్నచిన్న పనుల్లో నా కూతురు నాకు కొంత సాయం చేస్తోంది. నా కొడుకు కూడా సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ ప్రతీది వివరంగా చెప్పి చేయించుకోవడం నాకే కష్టమవుతోంది. ఈ నొప్పి వల్ల అతడిని ఎత్తుకోలేకపోతున్నాను కూడా! అలా అని పూర్తిగా నేను ఎవరిపైనా ఆధారపడలేదు. క్యాన్సర్ చికిత్స తీసుకున్న వెంటనే నా పనులు నేను చేసుకున్నాను. ఇంతలోనే ఈ కొత్త అనారోగ్య సమస్య వచ్చిపడింది.. నాకు చాలా కష్టంగా ఉంది' అని చెప్పుకొచ్చింది. కాగా చవీ మిట్టల్ 'ష్.. ఫిర్ కోయ్ హయ్', 'ఘర్ కీ లక్ష్మి బేటియా', 'బాందిని', 'నాగిన్', 'కృష్ణదాసి' వంటి సీరియల్స్‌లో నటించింది. View this post on Instagram A post shared by Chhavi Mittal (@chhavihussein) చదవండి: థూ.. నా బతుకు అంటూ బేబీ డైరెక్టర్ ట్వీట్ భర్త అనుమానం వల్ల నటి 'సుజాత' ఇన్ని ఇబ్బందులు పడిందా..?