Actress Chhavi Mittal Opens Up About Costochondritis Diagnosis - Sakshi
Sakshi News home page

Chhavi Mittal: క్యాన్సర్‌ నుంచి కోలుకున్న నటి.. అంతలోనే చుట్టుముట్టిన మరిన్ని వ్యాధులు

Published Sun, Aug 6 2023 2:41 PM | Last Updated on Sun, Aug 6 2023 3:14 PM

Chhavi Mittal Battling Costochondritis: Breathing gets Painful at Times - Sakshi

కష్టాలు ముగిసిపోయాయనుకోలేపే బుల్లితెర నటి చవీ మిట్టల్‌కు మరో పెద్ద కష్టం వచ్చిపడింది. ప్రాణాంతక మహమ్మారి క్యాన్సర్‌ను జయించిన ఆమె ప్రస్తుతం కాస్టోక్రాన్‌టిడిస్‌ (పక్కటెముకలను, రొమ్మును కలుపే మృదులాస్థికి వాపు రావడం) అనే వ్యాధితో పోరాడుతోంది. తాజాగా తన సమస్యను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. 'రొమ్ము క్యాన్సర్‌తో పోరాడి ఇటీవలే దాని నుంచి బయటపడ్డాను. కానీ అప్పటినుంచి నాకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. బహుశా క్యాన్సర్‌ కోసం తీసుకున్న చికిత్స వల్ల సైడ్‌ ఎఫెక్స్ట్‌ అనుకుంటా.. మొన్న కాలు ఫ్రాక్చర్‌ అయింది. స్కానింగ్‌లో ఎముకలో ఉండాల్సిన పదార్థాల సాంద్రత (బోన్‌ మినరల్‌ డెన్సిటీ) తక్కువగా ఉందని చెప్పారు.

అదే కొనసాగితే ఓస్టియోపేనియా వస్తుందని, దీనివల్ల రక్తంలో కాల్షియం తగ్గిపోతుందన్నారు. దానికి ఓ ఇంజక్షన్‌ తీసుకున్నాను. అప్పటి నుంచి నా పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఛాతీలో నొప్పి మొదలైంది. అది భుజం వరకు పాకింది. నా శరీరం అంతా బిగుసుకుపోయినట్లుగా విపరీతమైన నొప్పి వచ్చింది. నొప్పి తగ్గడానికి టాబ్లెట్లు వాడాను. కానీ ఛాతీలో ఏదో అడ్డుపడినట్లుగా ఉండి ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. ఎడమ చేయి కూడా సరిగా ఆడించలేకపోతున్నాను. బాటిల్‌లో నీళ్లు నింపుతుంటే కూడా ఎంతో నొప్పి వస్తోంది.

చిన్నచిన్న పనుల్లో నా కూతురు నాకు కొంత సాయం చేస్తోంది. నా కొడుకు కూడా సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ ప్రతీది వివరంగా చెప్పి చేయించుకోవడం  నాకే కష్టమవుతోంది. ఈ నొప్పి వల్ల అతడిని ఎత్తుకోలేకపోతున్నాను కూడా! అలా అని పూర్తిగా నేను ఎవరిపైనా ఆధారపడలేదు. క్యాన్సర్‌ చికిత్స తీసుకున్న వెంటనే నా పనులు నేను చేసుకున్నాను. ఇంతలోనే ఈ కొత్త అనారోగ్య సమస్య వచ్చిపడింది.. నాకు చాలా కష్టంగా ఉంది' అని చెప్పుకొచ్చింది.​ కాగా చవీ మిట్టల్‌ 'ష్‌.. ఫిర్‌ కోయ్‌ హయ్‌', 'ఘర్‌ కీ లక్ష్మి బేటియా', 'బాందిని', 'నాగిన్‌', 'కృష్ణదాసి' వంటి సీరియల్స్‌లో నటించింది.

చదవండి: థూ.. నా బతుకు అంటూ బేబీ డైరెక్టర్‌ ట్వీట్‌
 భర్త అనుమానం వల్ల నటి 'సుజాత' ఇన్ని ఇబ్బందులు పడిందా..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement