చికాగో విమానం దారి మళ్లింపు
టోక్యో: అమెరికాలోని చికాగో నుంచి చైనా బయల్దేరిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానాన్ని ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన కారణంగా దారి మళ్లించారు. జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని నరిటా విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశారు. విమానంలో 241 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్లైన్స్ ప్రతినిధి చెప్పారు.
చికాగోకు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం చైనాలోని ఓ హరె అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాల్సివుంది. అయితే విమానంలో ఓ ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన వల్ల దారి మళ్లించాల్సి వచ్చింది. 12 గంటల తర్వాత విమానం జపాన్ నుంచి చైనాకు బయల్దేరింది.