కస్టమర్‌పై చికెన్ వ్యాపారి కత్తితో దాడి
హైదరాబాద్: ఓ కస్టమర్‌పై చికెన్ వ్యాపారి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఎల్బీనగర్ మండలం అనాజ్‌పూర్‌లో ఆదివారం వెలుగుచూసింది. చికెన్ వ్యాపారికి కస్టమర్‌కి మధ్య గొడవ చోటుచేసుకుంది. చికెన్ వ్యాపారి ఆగ్రహంతో కస్టమర్‌ను కత్తితో నరికాడు.
ఈ ఘటనలో కస్టమర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.