Chief Devendra fadnavis
-
‘జలయుక్త' లో అంతా బోగస్సే
షోలాపూర్ జల నిపుణుడు ప్రఫుల్లా పటేల్ షోలాపూర్: షోలాపూర్ జిల్లాలోని చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం (జలయుక్త శివారు) పర్యవేక్షించడానికి వచ్చిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను కలెక్టర్ సహా ఉన్నతాధికారులంతా మోసగించారని సాంగోళాకు చెందిన జల నిపుణుడు ప్రఫుల్లా పటేల్ ఆరోపించారు. శనివారం విలేకరు సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని ఈ విషయంలో పక్కదారి పట్టించారని, దీనికి సంబంధించిన నివేదికను సీఎంవోకు పంపానని చెప్పారు. ‘జిల్లాలో జలశివారు ప్రోగ్రాం ద్వారా చేపట్టిన పనులను సందర్శించేందుకు సీఎం వచ్చారు. సాంగోళా తాలూకా మంగేవాడిలో సిమెంట్తో నిర్మించిన చెరువును ఆయనకు చూపించారు. అందులో 22.06 టీఎంసీల నీటి నిల్వ ఉంటుందని చూపించారు. కానీ ప్రత్యక్షంగా ఇక్కడ ఆ స్థాయిలో నీటి నిల్వ సాధ్యం కాదు. ఈ విషయాన్ని గ్రామస్తులు, జల నిపుణుల సమక్షంలో కొలతలు నిర్వహించడంతో వెలుగులోకి వచ్చింది. అత్యధికంగా నాలుగు నుంచి ఆరు టీఎంసీల నీటి నిల్వకు మాత్రమే వీలుంటుంది’ అని ప్రఫుల్లా వివరించారు. కేవలం ప్రచారం కోసం అధికారులు పాకులాడుతున్నారని ఆయన విమర్శించారు. దీని వల్ల నీటి సమస్య తీరకపోగా, వ్యయం తడిసి మోపెడవుతుందన్నారు. జిల్లాకు చెందిన శాసనసభ్యులతో సహా ముఖ్యమంత్రిని కలుసుకొని జలయుక్త శివారులోని బోగస్ ఉదంతాలపై పూర్తి స్థాయిలో నివేదిక అందజేస్తానని ప్రఫుల్ల తెలిపారు. -
అరుణకు ఘన నివాళి
- ఓ కళాశాలకు పేరు పెడుతున్నట్లు సీఎం ప్రకటన - అవార్డు నెలకొల్పుతున్నట్లు ప్రకటించిన ఎంపీ సీఎం ముంబై: 42 ఏళ్లపాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయిన అరుణా శానబాగ్ జ్ఞాపకార్థం థాణేలోని ప్రముఖ నర్సింగ్ కళాశాలకు ఆమె పెరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం తెలిపారు. ఆమె స్ఫూర్తికి సెల్యూట్ చేస్తున్నానని ట్వీట్ చేశారు. కేఈఎమ్ ఆస్పత్రిలోని నాలుగో వార్డుకు అరుణ పేరు పెట్టాలని ఆస్పత్రి అధికారులు బీఎంసీని కోరారు. చికిత్స చేసిన గదిలో ఆమె ప్రతిమను ఉంచారు. ఆ గదికి ఆమె పేరు పెట్టి ఆ గదిని ఆస్పత్రి పనులకు, చికిత్సలకు వాడుకోవాలని నిర్ణయించారు. అరుణ పేరుతో అవా ర్డు నెలకొల్పుతున్న ట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మహిళలపై జరుగుతు న్న అన్యాయాలకు వ్య తిరేకంగా పోరాడుతు న్న స్వచ్ఛంద సంస్థకు ఇవ్వాలని నిర్ణయిం చారు. ఈ అవార్డు కింది రూ. ఒక లక్ష బహుమతిగా ఇవ్వనుంది. అరుణకు జరిగిన అన్యాయానికి మధ్యప్రదేశ్ సీఎం చింతిస్తూ...ఆమె గౌరవానికి చిహ్నంగా పేర్కొన్నారు. దేశానికి దక్కిన బహుమతి అరుణ దేశానికి దక్కిన గొప్ప బహుమతి అని రచయిత పింకి విరానీ అన్నారు. 1973 నవంబర్ 27 ఘటన అరుణ జీవితాన్ని మార్చి వేసిందని విచారం వ్యక్తం చేశారు. ఆమె చనిపోయినా ఎప్పటికీ తన గుండెలో బతికే ఉందని అన్నారు.