లోర్గాట్ కాంట్రాక్ట్ పొడిగింపు
ముంబై: తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరూన్ లోర్గాట్ పదవి కాలాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) మరో నాలుగేళ్లు పొడిగించింది. దీని ప్రకారం లోర్గాట్ 2019 జూలై 31 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. జొహన్నెస్‌బర్గ్‌లో శుక్రవారం ముగిసిన సీఎస్ఏ సమావేశంలో బోర్డు ప్యానెల్ డెరైక్టర్స్, అధ్యక్షుడు క్రిస్ నెన్‌జాని పై ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు. 2013లో బాధ్యతలు స్వీకరించినప్పట్నించీ లోర్గాట్ అద్భుతమైన పనితీరును చూపెట్టారని, తొలి ఏడాదిలోనే అంచనాలకు మించి పని చేయడంతో కాంట్రాక్ట్‌ను పొడిగించినట్లు తెలిపింది. వాణిజ్య, ప్రసారకర్తలు లోర్గాట్కు గురించి మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారని సీఎస్ఏ తెలిపింది.