Chief Justice of the High Court
-
ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌ను నియమించాలన్న సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని జూలై 5న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసిన విషయం విదితమే. జస్టిస్ ఠాకూర్ ప్రస్తుతం బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. -
పెండింగ్ కేసుల్ని పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. బుధవారం హైకోర్టు నుంచి ఆయన అన్ని జిల్లాల జడ్జిలు, పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటెరోపేరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్) సర్వీసులను ప్రారంభించారు. ఐసీజేఎస్ సర్వీసులను దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ప్రారంభించినట్లు తెలిపారు. ఆ విధానం ద్వారా క్రిమినల్ కేసుల విచారణ కూడా పూర్తి చేసి పెండింగ్ కేసుల్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
‘సుప్రీం’కు ఐదుగురు సిట్టింగ్ హైకోర్టు జడ్జీలు!
న్యూఢిల్లీ: నలుగురు హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు సహా మొత్తం ఐదుగురు సిట్టింగ్ హైకోర్టు జడ్జీల పేర్లను ఉన్నత న్యాయస్థానానికి సుప్రీంకోర్టు కొలీజియం ఖరారుచేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్ నేతృత్వంలోని కొలీజియం ఈ జాబితాకు ఆమోదం తెలిపింది. ఇందులో మద్రాస్, రాజస్థాన్ , కేరళ, ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ మోహన్ , జస్టిస్ దీపక్ గుప్తలతోపాటుగా కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌లు ఈ జాబితాలో ఉన్నారు.