chiken price
-
కొండెక్కిన కోడి కూర.. వారంలోనే రూ.100 పెరిగింది
సాక్షి,శ్రీకాకుళం: చికెన్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేనంతగా పెరిగిపోయాయి. కరోనా నేపథ్యంలో పౌష్టికాహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో చాలామంది చికెన్ తినేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో దీని ధర అమాంతం పెరిగిపోయింది. వారం రోజుల వ్యవధిలో కిలోపై వంద రూపాయలకు పైగా పెరిగింది. ఈ పరిస్థితి చూసి చాలామంది చికెన్ కొనేందుకు భయపడుతున్నారు. ఈ నెల నాలుగో తేదీ ఆదివారం కిలో రూ.285 ఉండగా.. తాజాగా మంగళవారం మరో రూ. 15 పెరిగి రూ. 300 చేరింది. నిత్యావసరాల సరుకుల ధరలు నియంత్రించే అధికారం మార్కెటింగ్ శాఖ అధికారులకు ఉండగా.. చికెన్, గుడ్లు ధరలు కట్టడి చేసే అధికారం మాత్రం వీరి చేతుల్లో లేదు. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది వ్యాప్యారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచుతున్నారనే ఆరోపణలు వినియోగదారుల నుంచి వినిపిస్తున్నాయి. డిమాండ్ బట్టి ధరల పెంపు మార్కెట్లో చికెన్కు డిమాండ్ అధికంగా ఉన్న సమయంలో బ్రాయిలర్ అసోసియేషన్ ధర నిర్ణయిస్తోంది. గుడ్ల ధరలను నేషనల్ ఎగ్ కో–ఆర్డినేషన్ కమిటీ సభ్యులు నిర్ణయిస్తారు. వీరంతా ప్రైవేటు వ్యక్తులు కావడంతో తమకునచ్చినప్పుడు ధరలు ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోతున్నారు. ఇటీవల కాలంలో మాంసం ప్రియులు పెరగడంతో దాన్ని అదునుగా చేసుకొని ధరలు పెంచేస్తున్నారు. కోళ్లు అందుబాటులో ఉన్నా కావాలనే కొరత సృష్టించి డిమాండ్ పెంచి అధిక ధరలకు అమ్ముతున్నారనే విమర్శలు వస్తున్నాయి. హోల్సేల్ వ్యాపారులకు బాగానే ఉన్నా రిటైల్ అమ్మకందారులు మాత్రం కస్టమర్లకు సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. ధరలు పెంచడంతో కిలో కొనుగోలు చేసేవారు అర కేజీతో సరిపెట్టుకుంటున్నారు. జిల్లాలో రోజుకి లక్ష కేజీల చికెన్ అవసరం ఉంటుంది. సుమారు ప్రస్తుతమున్న ధర ప్రకారం రూ.3 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది. జిల్లా వాసులకు రోజుకి ఎనిమిది లక్షల గుడ్లు అవసరం. అయితే జిల్లాలో సుమారు ఆరు లక్షల వరకు ఉత్పత్తి జరుగుతోంది. మిగిలిన వాటిని ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. -
కొండెక్కుతున్న కోడికూర ధరలు
తాండూరు : కోడి కొండెక్కి కూర్చుంది. ఎంతకీ దిగిరానంటోంది. మండుతున్న ఎండలకు పోటీగా చికెన్ ధరలు పెరుగుతున్నాయి. ఎండ దెబ్బకు చికెన్ ధరలు దిగిరావాల్సింది పోయి భారీగా పెరుగుతున్నాయి. వేసవి కాలంలో కావడంతో కోళ్ల ఫారాల్లో ఉత్పత్తి భారీగా తగ్గిపోతోంది. ఎండల తీవ్రతకు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఫారాల్లో ఉత్పత్తి క్రమంగా తగ్గిపోతోంది. దీంతో మరో నెలరోజుల వరకు కోడి కూర ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. చికెన్ కిలో రూ.170 తాండూరులో నెలరోజుల కిందట లైవ్ కోడి రూ.63, డ్రెస్సుడ్ చికెన్ రూ.130, స్కిన్ లేకుండా రూ.140 వరకు విక్రయించారు. వారం రోజులుగా చికెన్ ధర కిలోకు రూ.170 అమ్ముతున్నారు. తాండూరులో కిలో చికెన్ ధర (స్నేహ ఫ్రెష్ చికెన్ సెంటర్లో) లైవ్ రూ.101, డ్రెస్సుడ్ రూ.150, స్కిన్లెస్ రూ.170 అమ్ముతున్నారు. ఈ నెలలో ధరలు రోజురోజుకి పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని చికెన్ దుకాణాల నిర్వాహకులు చెబుతున్నారు. గతేడాది గరిష్టంగా కిలోకు రూ.260 గతేడాది ఏప్రిల్, మే నెలల్లో కిలో కోడి కూరకు రూ.250 నుంచి రూ.260 వరకు ధర పలికింది. ఈ ఏడాది కూడా చికెన్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్ది చికెన్ ధరలపై ప్రభావం ఉంటుందని కోళ్లఫారాల నిర్వాహకులు చెబుతున్నారు. పెళ్లీళ్లు, శుభకార్యాలు ఉండడంతో ఒక్కసారిగా చికెన్ ధరలు తాండూరులో ఆకాశాన్నంటాయి. వేసవి కావడంతో పౌల్ట్రీఫారాల నుంచి కోళ్ల పంపిణీ సంఖ్య బాగా తగ్గింది. పౌల్ట్రీఫారాల్లో బాయిలర్ కోళ్ల కొరత ఉండడంతో కోడికూర ధరలు పెరుగుతున్నాయని చికెన్ దుకాణాల నిర్వాహకులు చెబుతున్నారు. శుభకార్యాలతో ధరలపై ప్రభావం వేసవి కాలంలో ఏప్రిల్, మే రెండు నెలల పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలు వందల సంఖ్యలో జరుగుతుండడంతో చికెన్ వాడకం అధికంగా ఉంటోంది. దీంతో చికెన్ ధరలపై ప్రభావం చూపుతోంది. కోళ్ల ఫారాల్లో ఉత్పత్తులు తగ్గిపోవడంతో కోడి కూర ప్రియులపై ధర ప్రభావం చూపుతుంది. -
చికెన్ ధరలు తగ్గెన్
హైదరాబాద్ : నిన్న మొన్నటి వరకూ చుక్కలు చూపించిన చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గత నెలలో పోలిస్తే చికెన్ ధరల్లో తగ్గుదల గణనీయంగా ఉంది. గడిచిన పన్నెండు రోజుల్లోనే కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.40 మేర తగ్గింది. గత నెల 20న స్కిన్ లెస్ చికెన్ దర కిలో రూ.192 ఉండగా, 25వ తేదీ నాటికి రూ.174 చేరింది. 27వ తేదీన రూ.166 ఉండగా, నెలాఖరు నాటికి మరో 6 రూపాయలు తగ్గి రూ.160కి చేరింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ రూ.152కి అందుబాటులోకి వచ్చింది.