Child bride
-
అక్కడి అమ్మాయిలందరూ.. ఆమె దారిలోనే
మాల్దా: పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లాకు చెందిన 16 ఏళ్ల శాంతన మండల్ వద్ద ఇప్పట్లో ఎవరూ పెళ్లి ప్రతిపాదన చేసే సాహసం చేయబోరు. అంతేకాదు మాల్దా జిల్లాలో ఎంతో అమ్మాయిలు ఆమె బాటలోనే నడుస్తున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తానని చెబుతున్న ఈ సరస్వతి పుత్రిక బాల్యవివాహాన్ని వ్యతిరేకిస్తూ చేసిన పోరాటం.. ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. శాంతనది పేద కుటుంబం. తల్లి ఓ ఇంట్లో పనిమనిషిగా, తండ్రి దినకూలీగా పనిచేస్తున్నారు. గత జనవరిలో శాంతన తల్లిదండ్రులు ఓ దినకూలితో ఆమెకు పెళ్లి నిర్ణయించారు. ఆ సమయంలో ఆమె మాధ్యమిక్ పరీక్షకు కష్టపడి చదువుతోంది. పెళ్లి విషయం తెలియగానే శాంతన తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడే పెళ్లి వద్దు, చదువుకుంటానని ఎంత చెప్పినా కుటుంబ సభ్యులు ఆమె మాట వినలేదు. దీంతో చైల్డ్ లైన్‌కు ఫోన్ చేసి తన సమస్యను ఏకరువు పెట్టింది. సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి సాయం చేయాల్సిందిగా అభ్యర్థించింది. వెంటనే అధికారులు జోక్యం చేసుకుని కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి పెళ్లిని రద్దు చేయించారు. శాంతన చదువుకునేందుకు ఏర్పాట్లు చేశారు. నాలుగు నెలలు తిరిగే సరికి శాంతన జీవితంలో వెలుగు వచ్చింది. ఆమె మాధ్యమిక్ పరీక్ష పాసయ్యింది. మాధ్యమిక్ సర్టిఫికెట్ చూసి గర్విస్తోంది. పెళ్లి చేసుకోవాలన్న ఒత్తిడి లేకుంటే మరింత మెరుగైన మార్కులు తెచ్చుకునేదాన్ననని చెబుతోంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తానని తన భవిష్యత్ ప్రణాళికను వెల్లడించింది. కూతురి విజయాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. మైనర్ కుమార్తెకు పెళ్లి చేయాలని భావించిన తమకు జిల్లా అధికారులు అవగాహన కల్పించారని, పెద్దలయిన తమకు తెలియని విషయాన్ని కుమార్తె నేర్పించిందని అన్నారు. శాంతన తమకు స్ఫూర్తిగా నిలిచిందని, ఎలా పోరాడాలో నేర్పిందని, బాల్యవివాహాలు చేసుకోబోమని అమ్మాయిలు చెబుతున్నారు. -
ఆమె నిజంగా ఒక హీరో
జైపూర్: బాల్య వివాహాలతో బతుకు వెల్లమారిన పిల్లలకు, అనాథలకు, అభాగ్యులకు, ఇంట్లో ఆశ్రయం దొరక్క రోడ్డునపడ్డ మహిళలకు ఆమె నిజంగా ఓ హీరో. ముఖ్యంగా దేశంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు ఆమె తన జీవితాన్ని అంకితం చేశారు. అందుకోసం క్షణం తీరికలేకుండా అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు. అందుకనే ఆమెకు ఎన్నో అవార్డులు లభించాయి. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన ఆమె పేరు కృతీ భారతి. 29 ఏళ్లు. గడచిన నాలుగేళ్ల కాలంలో 29 బాల్య వివాహాలను కోర్టుల ద్వారా రద్దు చేయించారు. ఏకంగా 900 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. బాల్య వివాహాలకు బద్దులైన పెద్దల నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చినా ఆమె భయపడడం లేదు. తన జీవితం బాల్య వివాహాలను అరికట్టేందుకే అంకితమని చెబుతున్నారు. ఆమె ఇటీవల రాజస్థాన్‌లోని పాచిపడ్రా గ్రామానికి చెందిన ఓ 17 ఏళ్ల బాల్య వివాహ బాధితురాలిని రక్షించడంతో మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఆ 17 ఏళ్ల బాలిక భాండియావాస్ కమ్యూనిటీకి చెందినది. వారి కమ్యూనిటీలో బాల్య వివాహాలు సర్వసాధారణమే. అందుకనే ఆ అమ్మాయికి 12 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేశారు. 21 ఏళ్ల నిరుద్యోగి, తాగుబోతు అయిన భర్త వద్దకు ఆ అమ్మాయిని కాపురానికి పంపేందుకు తల్లిదండ్రులు ఇటీవల ఒత్తిడి చేశారు. తాను కాపురానికి వెళ్లనని, చదుకుంటానని ఆ అమ్మాయి ఎంత మొత్తుకున్నా తల్లిదండ్రులు వినిపించుకోకుండా రోజూ చిత్ర హింసలకు గురి చేయడం ప్రారంభించారు. దాంతో ఆ అమ్మాయి ఒకరోజు ఇంటి నుంచి సమీపంలో ఉన్న ఎడారిలోకి తెల్లవారు జామున పారిపోయింది. ఈ విషయం తెలిసిన కృతి భారతి ఆమెను వెతుక్కుంటూ వెళ్లారు. ఎడారి మొదట్లోనున్న చెట్టువెనక దాక్కొని విలపిస్తున్న ఆ అమ్మాయిని కృతి కష్టపడి కనుక్కున్నారు. ఆమెకేమీ భయంలేదని, అన్ని విధాల ఆదుకుంటానని నచ్చ చెప్పి ఆ అమ్మాయిని బర్మర్ తీసుకెళ్లి అక్కడి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చ చెప్పేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. వారితో ఓ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మంచి మాటలతో తల్లిదండ్రులను ఒప్పించి, ఆ తర్వాత అత్తా మామలను ఒప్పించి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునేల చేస్తానని కృతీ భారతి మీడియాకు తెలిపారు. సాధ్యంకాని పక్షంలో కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. కృతీ చేస్తున్న కృషికిగాను ఆమెను ‘ఫాస్టెస్ట్ లీగల్లీ అనల్డ్ మ్యారేజెస్’, ‘ఫస్ట్ ఎవర్ చైల్డ్ మ్యారేజ్ అనల్మెంట్’ అనే టైటిళ్లు వరించాయి. ప్రపంచంలో జరుగుతున్న బాల్య వివాహాల్లో 40 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి లెక్కలు తెలియజేస్తున్నాయి. -
చిల్డ్రన్స్ హోంకు చిన్నారి పెళ్లికూతురు
పలమనేరు (చిత్తూరు) : బాల్య వివాహం జరిగిన ఓ చిన్నారి పెళ్లి కూతురిని అధికారులు చిల్డ్రన్స్ హోంకు తరలించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో శనివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పలమనేరులోని బోయవీధికి చెందిన 14 ఏళ్ల బాలికకు పెద్దలు శనివారం వివాహం జరిపించారు. అదే రోజున ఆమె అత్తారింట్లో అడుగుపెట్టింది. కాగా మదనపల్లె సబ్ కలెక్టర్‌కు ఈ బాల్య వివాహంపై సమాచారం అందడంతో... ఆయన ఆదేశాల మేరకు ఐసీడీఎస్ అధికారులు శనివారం రాత్రి రంగంలోకి దిగారు. సంబంధిత నవ వధువు ఇంటికి వెళ్లి పెద్దలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ పెళ్లి చెల్లదని, బాలికకు 18 ఏళ్లు నిండేవరకు బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచి కుట్లు, అల్లికలు నేర్పిస్తామని చెప్పి... అత్తారింటి నుంచి ఆ నవ వధువును చిల్డ్రన్స్ హోంకు తరలించారు. -
ఇదా ఓ 12 ఏళ్ల చిన్నారికి మనమిచ్చే జీవితం?