చిల్డ్రన్స్ హోంకు చిన్నారి పెళ్లికూతురు | Child bride sends to children's home | Sakshi
Sakshi News home page

చిల్డ్రన్స్ హోంకు చిన్నారి పెళ్లికూతురు

Published Sun, May 31 2015 8:55 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM

Child bride sends to children's home

పలమనేరు (చిత్తూరు) : బాల్య వివాహం జరిగిన ఓ చిన్నారి పెళ్లి కూతురిని అధికారులు చిల్డ్రన్స్ హోంకు తరలించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో శనివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే..  పలమనేరులోని బోయవీధికి చెందిన 14 ఏళ్ల బాలికకు పెద్దలు శనివారం వివాహం జరిపించారు. అదే రోజున ఆమె అత్తారింట్లో అడుగుపెట్టింది. కాగా మదనపల్లె సబ్ కలెక్టర్‌కు ఈ బాల్య వివాహంపై సమాచారం అందడంతో... ఆయన ఆదేశాల మేరకు ఐసీడీఎస్ అధికారులు శనివారం రాత్రి రంగంలోకి దిగారు. సంబంధిత నవ వధువు ఇంటికి వెళ్లి పెద్దలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ పెళ్లి చెల్లదని,  బాలికకు 18 ఏళ్లు నిండేవరకు బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచి కుట్లు, అల్లికలు నేర్పిస్తామని చెప్పి... అత్తారింటి నుంచి ఆ నవ వధువును చిల్డ్రన్స్ హోంకు తరలించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement