చిన్నారికి అంతుచిక్కని వ్యాధి
మిర్యాలగూడ టౌన్ : అది ఓ నిరుపేద కుటుంబం. పిల్లాపాపలతో హాయిగా గడపాలనుకున్న ఆ కుటుంబం ఆశలు అడియాసలయ్యాయి. ఇద్దరు సంతానంలో ఒకరు అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నారు. అందరు పిల్లల్లా తమ కళ్లముందు ఆడుతూ పాడుతూ ఉండాల్సిన కొడుకులో ఎలాంటి ఎదుగుదల లేకపోవడాన్ని చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. అప్పులు చేసి వైద్యం చేయించినా ఎలాంటి ప్రయోజనంలేకుండాపోయింది. దాతలెవరైనా ముందుకువచ్చి ఆపన్నహస్తం అందిస్తారని ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా తెల్కపల్లి మండలం వట్టెపల్లితండాకు చెందిన మూఢావత్ రూప్లానాయక్ వివాహం అదే జిల్లా లింగాల మండలం చిల్కపల్లికి చెందిన తిరుపతమ్మతో 2007లో జరిగింది.
రూప్లానాయక్, తిరుపతమ్మ దంపతులు బతుకుదెరువు కోసం మిర్యాలగూడ పట్టణానికి ఆరే ళ్ల క్రితం వలస వచ్చారు. పట్టణంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లే రోడ్డులో గల అద్దంకి-నార్కట్‌పల్లి రహదారి వద్ద నివాసం ఉంటున్నారు. వీరిది నిరుపేద కుటుంబం. రూప్లా నాయక్ వృత్తి రీత్యా కిరాయి ఆటో డ్రైవరుగా పని చేస్తున్నాడు. 2010లో వీరికి మొదటి సంతానం అయిన శిరీష పుట్టింది. ఆ తరువాత 2011లో మూఢవత్ శివకుమార్ పుట్టాడు. పుట్టిన ఆరు నెలల వరకు మంచి ఆరోగ్యాంగానే ఉన్న శివకుమార్ అనంతరం 7వ మాసం నుంచే శరీరంలో మార్పులు రావడంతో పాటు కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వైపు శరీరంలో కూడా ఎదుగుదలలేకుండా పోయింది. దీంతో పాటు ఆ చిన్నారిలో ఎలాంటి స్పర్శ కనబడటం లేదు.
తమ కొడుకు ఉదయం వేళల్లో మంచిగానే ఉంటా డు కానీ రాత్రి వేళల్లో మాత్రం నిద్రపోకుండా ఎడుస్తూనే ఉంటాడు. ఆ చిన్నారికి ఇప్పటి వరకు మాటలు కుడా రావు. నడవలేడు. తనకు ఇద ్దరు పిల్లలు చాలంటూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేయిం చుకున్నానని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. పట్టణంలోని పిల్లల డాక్టర్లకు చూయించినప్పటికీ వ్యాధి ఏమిటో చెప్పడం లేదు. మహబూబ్‌నగర్, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌లలోని పలు ఆసుపత్రులకు తీసుకువెళ్లినప్పటికీ ఈ వ్యాధి ఎమిటనేది కూడా తెలియడం లేదని డాక్టర్లు అంటున్నారు. డబ్బులు ఖర్చు చేసినా ఫలితం లేకపోవడంతో హైదరాబాద్‌లో కొందరు ఆయుర్వేదిక్ డాక్టర్ల వద్దకు తీసుకెళ్లామని చెప్పారు.
సొమ్ములు అమ్మి..
అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్న కొడుకును రక్షించుకునేందుకు ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. ఆసుపత్రులలో చూపించేందుకు కావాల్సిన డబ్బులు లేకపోవడంతో ఉన్న సొమ్ములను కూడా అమ్ముకోగా సుమారు 3 లక్షల రూపాయల వరకు వచ్చాయి. వివిధ ఆసుపత్రుల్లో చూపించగా ఆ డబ్బులు కూడా అయిపోయాయి. దీంతో రూ.5లక్షల వరకు అప్పులుకూడా చేశారు. ఏ డాక్టర్‌కు చూపించినా వ్యాధిఏమిటో గుర్తించలేపోతున్నారని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.
నా కొడుకును ఆదుకోండి
అంతు చిక్కని వ్యాధి తో బాధపడుతున్న నా కుమారుడిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలి . నా కుమారుడు కేవలం పాలతోనే ఇంత కాలం వరకు గడుపుతున్నాడు. దాతలెవరైనా ఆదు కోవాలనుకుంటే బ్యాంకు అకౌంట్ నంబరు-34597646858 ,ఎస్బీఐ నాగర్ కర్నూల్ బ్రాంచ్‌లో డబ్బులు వేయవచ్చు. పూర్తి స మాచారం కోసం సెల్ నంబర్లు 970 1585842, 9912677530 లలో సంప్రదించవచ్చు. - తిరుపతమ్మ, చిన్నారి తల్లి