ఎల్ఐసీ రెండు కొత్త ప్లాన్లు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) జీవన్ సంగమ్, చిల్డ్రన్స్ మనీబ్యాక్ అనే రెండు సరికొత్త పథకాలను ప్రారంభించింది. జీవన్ సంగమ్.. ఇది ఒక నాన్ లింక్డ్, సింగిల్ ప్రీమియం పథకం.ఈ సింగిల్ ప్రీమియం పథకం 6-50 ఏళ్ల లోపు వారికి కొన్ని నిబంధనలకు లోబడి అందుబాటులో ఉంటుంది. 12 ఏళ్ల లోపు పిల్లలకు చిల్డ్రన్స్ మనీబ్యాక్. పిల్లల విద్య తదితర అవసరాల కోసం ఉద్దేశించబడిన నాన్ లింక్డ్ మనీబ్యాక్ పథకమే ఇది.
ఈ పాలసీ కాలవ్యవధిలో పిల్లల జీవితానికి రిస్క్‌ను కవ ర్ చేస్తుంది. నిర్దేశించిన సమయం పూర్తయిన తర్వాత కాలానుగత చెల్లింపులూ చేయబడతాయి. ఒకవేళ పాలసీ సమయంలో తల్లిదండ్రులు మరణించినట్లయితే ఆ తర్వాత ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం లేదు.