ఇద్దరు పిల్లలకు నిప్పుపెట్టిన కసాయి తల్లి
మధుబాణి: పేగు బంధాన్ని మరచి ఇద్దరు పిల్లలకు ఓ తల్లి నిప్పుపెట్టిన ఘటన బీహార్ రాష్ట్రంలోని బాత్ గావన్ గ్రామంలో గురువారం కలకలం రేపింది. భర్తతో స్వల్ప ఘర్షణ పడిన ఓ మహిళ.. ఆ కోపాన్ని పిల్లలపై చూపి వారి చావుకు కారణమైంది. సులేఖా దేవీ అనే మహిళకు ఆయోధ్య సింగ్ అనే కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరు పెళ్లినాటి నుంచి ఇప్పటి వరకూ కుటుంబ పరమైన అంశాపై తరుచు గొడవపడుతూ ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య తిరిగి చోటు చేసుకున్న వివాదం కాస్తా పెద్దది అయ్యింది.
ఇక ఆ కోపాన్ని తన పిల్లలపై చూపించింది. కాజల్ కుమరి(4), కృష్ణ కుమార్(2) అనే ఇద్దరు చిన్నారులు ఇంట్లో నిద్దురు పోతున్న సమయంలో అతి కిరాతకంగా కిరోసిన్ పోసి నిప్పటించి వారి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కసాయి తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఆ చిన్నారుల మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించామని పోలీస్ అధికారులు తెలిపారు.