ఇద్దరు పిల్లలకు నిప్పుపెట్టిన కసాయి తల్లి | Two children die after set on fire by mother | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలకు నిప్పుపెట్టిన కసాయి తల్లి

Published Thu, May 15 2014 6:05 PM | Last Updated on Sat, Aug 25 2018 5:41 PM

Two children die after set on fire by mother

మధుబాణి: పేగు బంధాన్ని మరచి ఇద్దరు పిల్లలకు ఓ తల్లి నిప్పుపెట్టిన ఘటన బీహార్ రాష్ట్రంలోని బాత్ గావన్ గ్రామంలో గురువారం కలకలం రేపింది. భర్తతో  స్వల్ప ఘర్షణ పడిన ఓ మహిళ.. ఆ కోపాన్ని పిల్లలపై చూపి వారి చావుకు కారణమైంది. సులేఖా దేవీ అనే మహిళకు ఆయోధ్య సింగ్ అనే కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరు పెళ్లినాటి నుంచి ఇప్పటి వరకూ కుటుంబ పరమైన అంశాపై తరుచు గొడవపడుతూ ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య తిరిగి చోటు చేసుకున్న వివాదం కాస్తా పెద్దది అయ్యింది.

 

ఇక ఆ కోపాన్ని తన పిల్లలపై చూపించింది. కాజల్ కుమరి(4), కృష్ణ కుమార్(2)  అనే ఇద్దరు చిన్నారులు ఇంట్లో నిద్దురు పోతున్న సమయంలో అతి కిరాతకంగా కిరోసిన్ పోసి నిప్పటించి వారి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కసాయి తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఆ చిన్నారుల మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించామని పోలీస్ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement