chilled
-
కరోనాను జయించిన బామ్మ : బీర్‌తో సెలబ్రేషన్
వాషింగ్టన్ : చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ కరోనా కబళిస్తుంటే 103 ఏళ్ల బామ్మ మాత్రం మృత్యువు అంచుల దాకా వెళ్లి పూర్తిగా కోలుకుంది. కోలుకున్న శుభ సందర్భంగా ఆసుపత్రిలోనే చిల్డ్ బీర్స్‌తో సెలబ్రేట్ కూడా చేసుకుంది. అమెరికాలోని మసాచూసెట్స్ నగరానికి చెందిన స్టెజ్నా మే నెలలో కరోనా బారిన పడింది. అందులోనూ వృద్ధురాలు కావడంతో అప్పటికే ఆమె పరిస్థితి విషమించింది. దీంతో స్టెజ్నాపై కుటుంబ సభ్యులు ఆశలు వదులుకున్నారు. దీంతో ఆమె చివరి కోరికలు ఏమైనా ఉంటే తీర్చేద్దాం అనుకున్నారు. కానీ అనూహ్యంగా స్టెజ్నా కరోనా నుంచి కోలుకుంది. చావు వరకూ వెళ్లిన బామ్మ తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడంతో వారి కుటుంబంలో ఆనందానికి అవధుల్లేవు. కోలుకున్న బామ్మ కూడా చిల్డ్ బీర్‌తో సెలబ్రేట్ చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె మనువరాలు షెల్లీ గన్ సోషల మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది. దీంతో పలు పత్రికలు ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ ప్రచురించాయి. (ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్ ) ఈ సందర్భంగా షెల్లీ మట్లాడుతూ, ‘మా బామ్మ తన జీవిత కాలంలో మా కోసం చాలా కష్టపడింది. ఈ వయసులో ఆమె కరోనాకు గురి కావడంతో మేం చాలా ఆందోళనకు గురయ్యాం. అంతేకాకుండా ఆమె పరిస్థితి కూడా విషమించడంతో ఆశలు వదులుకున్నాం. చివరి కోరికలు ఏమైనా ఉంటే తీర్చేద్దాం అనుకున్నాం. కానీ బామ్మ కోవిడ్‌ను జయించింది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. ఈ విషయాన్ని మేమే నమ్మలేకపోతున్నాం. అంటూ ఆనందం వ్యక్తం చేసింది'’ అంతేకాకుండా 103 ఏళ్ల వయసులోనూ కరోనా వైరస్‌ను తట్టుకుని కోలుకోవడంతో ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఆస్పత్రి సిబ్బందే ఆమెకు చిల్డ్ బీర్ అందించారు. అది చూడగానే బామ్మ మరింత సంతోషంతో బీర్‌ను ఎంజాయ్ చేసింది అంటూ షెల్లీ పేర్కొంది. (ఎన్ 95 మాస్క్‌ల పేరుతో భారీ మోసం ) -
చర్మం – లావణ్యం
బ్యూటిప్స్ ⇔ వేడినీటిలో కప్పు పాలను కలిపి స్నానం చేస్తే చర్మలావణ్యం పెరుగుతుంది. చలికి పొడిబారిన చర్మానికి మాయిశ్చరైజింగ్ ట్రీట్మెంట్లు చేయడం సాధ్యం కానప్పుడు ఇలా చేయవచ్చు. ఇది అన్ని రకాల చర్మతత్త్వాలకు చక్కగా పనిచేస్తుంది. ⇔పొడిచర్మానికి ఈ కాలంలో సబ్బు కూడా శత్రువుగా మారుతుంది కాబట్టి సున్నిపిండి వాడకం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు సున్నిపిండిలో పాలు పోసి పేస్టులా చేసుకుని ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమను కోల్పోదు. అంతేకాకుండా సహజమైన నూనె అందడం వల్ల మృదువుగా మారుతుంది. ⇔కోడిగుడ్డు తెల్లసొనను బాగా చిలికి ముఖానికి ప్యాక్ వేసి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. ఇది జిడ్డు, సాధారణ చర్మాలకు బాగా పని చేస్తుంది. పొడిచర్మానికి మంచి ఫలితాలనివ్వదు. కోడిగుడ్డు తెల్లసొన నాచురల్ బ్లీచ్‌గా పనిచేసి చర్మాన్ని తెల్లబరుస్తుంది కాని జిడ్డును తొలగించడం ద్వారా చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తుంది. ⇔ తేనె, చక్కెర సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి ముఖానికి, మెడకు అప్లయ్ చేసి వలయాకారంగా మర్దన చేయాలి (కళ్ల చుట్టూ మినహాయించాలి). ఇది నాచురల్ స్క్రబ్. చర్మానికి నునుపుదనం తీసుకురావడంతోపాటు మృతకణాలను తొలగిస్తుంది. మొటిమలతో గుంతలు పడిన చర్మానికి తరచుగా ఈ ట్రీట్మెంట్ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. -
సిటీ గజగజ
చలి నగరవాసులను భయపెడుతోంది. వృద్ధులు వాకింగ్‌కి వెళ్లాలంటే జంకుతున్నారు. భానుడి కిరణాలు సైతం శీతల గాలుల గిలిగింతలను అడ్డుకోలేకపోతున్నాయి. స్కూలుకి వెళ్లే విద్యార్థులు.. కొలువుకి వెళ్లే ఉద్యోగులు.. పనులకు వెళ్లే కూలీలు తప్పదంటూ ఇంటి నుంచి బయటకు అడుగులు వేస్తున్నారు. సోమవారం మంచుకురిసే వేళలో నగరంలో కనిపించిన దృశ్యాలు.మంచుదుప్పటి కప్పుకున్న బీహెచ్ఈఎల్ ప్రాంతంకండువాలు కప్పుకుని పనికెళ్తూ...కొలిమి పక్కన వెచ్చగా కాసేపు నిద్రపోని...పాఠాలు చదివేముందు కాసేపు పరుగుఇంటి ముందు కల్లాపు చల్లుతూ..ఎండ పడే ప్రాంతంలో నిలబడి ఉన్న అయ్యప్ప స్వాములుభానుడి కిరణాల తోడుగా బడికిస్వేదం చిందిస్తే చలి ఇంకెక్కడ?నగరంలో చలి తీవ్రతను తెలుపుతున్న సూచిక బోర్డు ఫొటోలు : మోర్లా అనిల్‌కుమార్