China earthquake
-
చైనా భూకంప మృతులు 398
బీజింగ్: చైనా భూకంప మృతుల సంఖ్య సోమవారానికి 398కి చేరింది. బాధితుల సహాయార్ధం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది. వేలాదిగా సైనికులను, పారా మిలటరీ బలగాలను, పోలీసులను రంగంలోకి దింపింది. సహాయ సామగ్రిని రవాణా చేసేందుకు, క్షతగాత్రులను తరలించేందుకు చైనా వైమానిక దళం రెండు రవాణా విమానాలను, చెంగ్దూ మిలటరీ ఏరియా కమాండ్ ఆరు హెలికాప్టర్లను పంపించింది. -
చైనాలో భూకంపం: ముగ్గురికి గాయాలు
ఆగ్నేయ చైనా యునన్లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. ఆ ఘటనలో ముగ్గురు గాయపడగా, పలు నివాసాలు ధ్వంసమైనాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదు అయిందని తెలిపారు. భూకంపం వల్ల పర్వతాలపైన ఉన్న బండరాళ్లు, పరిసరాలలోని నివాసాలు,రహదారులపైకి దొర్లాయని చెప్పారు. ఇళ్లు కోల్పోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. అయితే భూకంపం వల్ల దేశంలో రెండో అతి పెద్ద హైడ్రో పవర్ స్టేషన్‌కి కొద్దిగా దెబ్బతిందన్నారు. -
జపాన్, చైనాలల్లో భూకంపం
జపాన్‌లోని పుకోషిమాలో ఈ రోజు తెల్లవారుజామున 2.25 గంటలకు భూకంపం సంభవించిందని స్థానిక మీడియా శుక్రవారం ఇక్కడ వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 5.8గా నమోదు అయిందని తెలిపింది. అయితే ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించలేదని పేర్కొంది. అయితే 2011లో పుకోషిమాలోని తీవ్ర భూకంపం సంభవించింది. ఆ ఘటనలో వేలాది మంది మరణించారు. అలాగే అనేక వేల మంది జాడ తెలియరాలేదన్న విషయాన్ని ఆ మీడియా సంస్థ ఈ సందర్బంగా గుర్తు చేసింది. అలాగే చైనాలో ఈ రోజు తెల్లవారుజామున 5.37 గంటలకు భూకంపం సంభవించిందని ఆ దేశ భూకంప కేంద్రం శుక్రవారం బీజింగ్‌లో తెలిపింది. రిక్టార్ స్కేల్‌పై 5.1గా నమోదు అయినట్లు వెల్లడించింది. సుసాన్ కైంటీ, గన్స్ ప్రావెన్స్, మెన్యన్ కౌంటీ, క్వింగ్హై ప్రావెన్స్లోలలో ఆ భూమి కంపించిందని వివరించింది.