జపాన్లోని పుకోషిమాలో ఈ రోజు తెల్లవారుజామున 2.25 గంటలకు భూకంపం సంభవించిందని స్థానిక మీడియా శుక్రవారం ఇక్కడ వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్పై 5.8గా నమోదు అయిందని తెలిపింది. అయితే ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించలేదని పేర్కొంది. అయితే 2011లో పుకోషిమాలోని తీవ్ర భూకంపం సంభవించింది. ఆ ఘటనలో వేలాది మంది మరణించారు. అలాగే అనేక వేల మంది జాడ తెలియరాలేదన్న విషయాన్ని ఆ మీడియా సంస్థ ఈ సందర్బంగా గుర్తు చేసింది.
అలాగే చైనాలో ఈ రోజు తెల్లవారుజామున 5.37 గంటలకు భూకంపం సంభవించిందని ఆ దేశ భూకంప కేంద్రం శుక్రవారం బీజింగ్లో తెలిపింది. రిక్టార్ స్కేల్పై 5.1గా నమోదు అయినట్లు వెల్లడించింది. సుసాన్ కైంటీ, గన్స్ ప్రావెన్స్, మెన్యన్ కౌంటీ, క్వింగ్హై ప్రావెన్స్లోలలో ఆ భూమి కంపించిందని వివరించింది.
జపాన్, చైనాలల్లో భూకంపం
Published Fri, Sep 20 2013 10:07 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM
Advertisement