![చైనా భూకంప మృతులు 398](/styles/webp/s3/article_images/2017/09/2/41407011910_625x300_0.jpg.webp?itok=d68majCr)
చైనా భూకంప మృతులు 398
బీజింగ్: చైనా భూకంప మృతుల సంఖ్య సోమవారానికి 398కి చేరింది. బాధితుల సహాయార్ధం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది. వేలాదిగా సైనికులను, పారా మిలటరీ బలగాలను, పోలీసులను రంగంలోకి దింపింది.
సహాయ సామగ్రిని రవాణా చేసేందుకు, క్షతగాత్రులను తరలించేందుకు చైనా వైమానిక దళం రెండు రవాణా విమానాలను, చెంగ్దూ మిలటరీ ఏరియా కమాండ్ ఆరు హెలికాప్టర్లను పంపించింది.