చైనాలో భూకంపం: ముగ్గురికి గాయాలు | 3 injured as moderate quake jolts southwestern China | Sakshi
Sakshi News home page

చైనాలో భూకంపం: ముగ్గురికి గాయాలు

Published Sat, Apr 5 2014 10:49 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM

3 injured as moderate quake jolts southwestern China

ఆగ్నేయ చైనా యునన్లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. ఆ ఘటనలో ముగ్గురు గాయపడగా, పలు నివాసాలు ధ్వంసమైనాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 5.3గా నమోదు అయిందని తెలిపారు. భూకంపం వల్ల పర్వతాలపైన ఉన్న బండరాళ్లు, పరిసరాలలోని నివాసాలు,రహదారులపైకి దొర్లాయని చెప్పారు.

 

ఇళ్లు కోల్పోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. అయితే భూకంపం వల్ల  దేశంలో రెండో అతి పెద్ద హైడ్రో పవర్ స్టేషన్కి కొద్దిగా దెబ్బతిందన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement