China Pakistan nexus
-
పాకిస్థాన్ చింత తీర్చే హామీ ఇచ్చిన జిన్‌పింగ్
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్ చింత తీర్చే హామీ ఇచ్చారు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్. తమ చిరకాల మిత్రదేశం పాకిస్థాన్‌ను ఎప్పటికీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోనివ్వమని, అన్ని విధాలా ఆదుకుని గట్టెకిస్తామని భరోసా కల్పించారు. ఇప్పటికే 9 బిలియన్ డాలర్ల సాయం అందించిన డ్రాగన్.. మరింత సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత శనివారం మీడియాతో మాట్లాడిన పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్.. చైనా నుంచి 9 బిలియన్ డాలర్లు, సౌదీ అరేబియా నుంచి 4 బిలియన్ డాలర్లు రుణం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందన్నారు. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హామీలను గుర్తు చేసుకున్నారు. ‘నవంబర్ 3న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చైనా పర్యటనకు వెళ్లిన క్రమంలో షీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎలాంటి చింత వద్దు.. మేము మిమ్మల్ని సంక్షోభంలో కూరుకుపోనివ్వం అని ఆయన భరోసా కల్పించారు.’ అని వెల్లడించారు పాక్ ఆర్థిక మంత్రి. మరోవైపు.. దార్ చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ను ప్రశ్నించగా.. ‘పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు చైనా అన్ని విధాల ఆదుకుంటుంది. ఇప్పటికే చాలా చేశాం.. భవిష్యత్తులోనూ కొనసాగుతుంది.’ అని తెలిపారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్.. అందులోంచి బయటపడేందుకు తన చిరకాల మిత్రులైన చైనా, సౌదీ అరేబియాకు మరింత దగ్గరవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అవసరమైన 35 బిలియన్ డాలర్లను సేకరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఇరు దేశాలు 13 బిలియన్ డాలర్లకుపైగా రుణాలు అందించేందుకు అంగీకరించాయి. ఇదీ చదవండి: కేజీఎఫ్2 ఎఫెక్ట్.. కాంగ్రెస్ ట్విటర్ అకౌంట్ బ్లాక్! -
‘మాకు నిజమైన మిత్రుడు’.. జిన్‌పింగ్ ఎన్నికపై పాకిస్థాన్ హర్షం
ఇస్లామాబాద్: చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్(69) రికార్డ్ స్థాయిలో మూడోసారి దేశ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మరోమారు అధ్యక్షుడిగా ఎన్నిక కావటంపై హర్షం వ్యక్తం చేశారు పాకిస్థాన్ ప్రధానమంత్రి హెహబాజ్ షరీఫ్. తమ దేశానికి ఆయన నిజమైన స్నేహితుడని అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు ప్రధాని. జిన్‌పింగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘సీపీసీ జనరల్ సెక్రటరీగా మూడోసారి ఎన్నికైనందుకు యావత్ పాకిస్థాన్ తరఫున షీ జిన్‌పింగ్‌కు నా అభినందనలు. తెలివైన సారథ్యం, చైనా ప్రజలకు సేవ చేసేందుకు ఆయనకున్న నిబద్ధతకు ఇది తార్కాణం’ అని ట్వీట్ చేశారు ప్రధాని షెహ్బాజ్. మరోవైపు.. జిన్‌పింగ్ ఎన్నికపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ కూడా స్పందించారు. ‘సీపీసీ జనరల్ సెక్రటరీగా మరోసారి ఎన్నికైన షీ జిన్‌పింగ్‌కు అభినందనలు. పాకిస్థాన్‌కు నిజమైన స్నేహితుడు, పాక్-చైనాల వ్యూహాత్మక బంధానికి బలమైన మద్దతుదారుడు’ అంటూ ట్వీట్ చేశారు. On behalf of the entire Pakistani nation, I congratulate President Xi Jinping on his reelection as CPC General Secretary for the 3rd term. It is a glowing tribute to his sagacious stewardship and unwavering devotion for serving the people of China. 🇵🇰 🇨🇳 — Shehbaz Sharif (@CMShehbaz) October 23, 2022 I extend heartiest congratulations to H.E. Xi Jinping on his reelection as CPC General Secretary, and my best wishes for his health and happiness. He is a true friend of Pakistan and champion for All-Weather Strategic Cooperative Partnership between Pakistan and China. 🇵🇰 🇨🇳 — The President of Pakistan (@PresOfPakistan) October 23, 2022 ఇదీ చదవండి: ‘ప్రపంచానికి చైనా అవసరం’.. మూడోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్ వ్యాఖ్యలు -
'క్రిమినల్ దేశంతో చైనా చేతులు కలపొద్దు'
వాంకోవర్: భారత ప్రధాని నరేంద్రమోదీ ఉద్వేగభరిత ప్రసంగం బలూచిస్థాన్ పౌరులకు గట్టి ధైర్యాన్ని ఇచ్చినట్లుంది. మొన్నటి వరకు స్థానికంగా, ఇటీవల ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ కు వ్యతిరేకంగా తమ గొంతు వినిపించిన ఆ ప్రాంతపౌరులు ఇప్పుడు ఏకంగా పాక్ తో సంబంధంపెట్టుకుంటున్న దేశాల్లో కూడా నిరసనలకు దిగుతున్నారు. తమ పరిస్థితి చూసి కూడా పాక్ తో సంబంధాలు పెట్టుకోవాలనుకోవడం ముమ్మాటికి తమ హక్కులను ఉల్లంఘించడమే అని వారు నినదిస్తున్నారు. త్వరలోనే వరుసగా మూడు రోజులపాటు కెనాడలోని బలూచిస్థాన్ వాసులు చైనా విదేశాంగ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగనున్నారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఆందోళనలో పాక్‌తో చైనా సంబంధం పెట్టుకోవడాన్ని నిలదీయనున్నారు. ఈ ఏడాది జులైలో ప్రధాని మోదీ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ పాక్ లో ఉన్న బలూచ్ వాసులు అష్టకష్టాలుపడుతున్నారని, వారు చిత్ర హింసలకు గురవుతున్నారని, వారికి స్వాతంత్ర్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రకటనతో అప్పటి వరకు పాక్ పై పీకల్లోతూ కోపంగా ఉన్న బలూచ్ వాసులు తమ గొంతును ప్రపంచానికి వినిపించడం మొదలుపెట్టారు. కెనాడాలోని చైనా కాన్సులేట్ ముందు నిర్వహించే ధర్నాలో 'బలూచ్ ప్రాంతంలో నేరాలు చేస్తున్న పాకిస్థాన్ భాగస్వామిగా ఉండటం చైనా మానుకోవాలి' అని తీర్మానం చేయనున్నారు. బలూచ్ ప్రాంతంలో పాక్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, మానవత్వాన్ని హత్య చేస్తుందని, హింసాకాండను కొనసాగిస్తోందని వారంతా ఆందోళన చేస్తున్నారు. 'ది ప్రీ బలూచిస్థాన్ మూమెంట్(ఎఫ్బీఎం) అనే సంస్థ ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తోంది.