Chinese smartphones
-
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు హెచ్‌టీసీ గుడ్‌బై!?
కోల్‌కతా : చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీల తాకిడిని తట్టుకోలేక భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ నుంచి ఓ ప్రముఖ కంపెనీ కనుమరుగు కాబోతుంది. తైవాన్‌కు చెందిన మొబైల్ తయారీ కంపెనీ హెచ్‌టీసీ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. హెచ్‌టీసీ టాప్ మేనేజ్మెంట్ కంట్రీ హెడ్ సిద్ధిఖీ, సేల్స్ హెడ్ విజయ్ బాలచంద్రన్, ప్రొడక్ట్ హెడ్ ఆర్.నయ్యర్ ముగ్గురూ ఒకేసారి రాజీనామా చేసినట్టు తెలిసింది. వీరితోపాటు కంపెనీ చీఫ్ ఫైనాన్షియర్ అయిన రాజీవ్ దయాల్‌ను కూడా వెళ్లిపొమ్మని కంపెనీ ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక మరో 70 నుంచి 80 మంది ఉద్యోగులకు కూడా కంపెనీ సెటిల్మెంట్ చేస్తుందని వెల్లడైంది. గత మూడు, నాలుగేళ్లుగా నష్టాల్లో ఉన్న కంపెనీని ఇక గట్టెక్కించలేమని నిర్ణయానికి వచ్చిన తర్వాత.. మొత్తం కంపెనీని మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించిందట. ఇందులో భాగంగానే ప్రస్తుతానికి సేల్స్ కూడా నిలిపివేస్తుందని తెలిసింది. అయితే భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఆన్లైన్ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ ద్వారా రీ-ఎంట్రీ ఇవ్వాలని కూడా కంపెనీ యోచిస్తోందని ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. కానీ పూర్తిగా అమ్మకాలను నిలిపివేసిన తర్వాతే, ఆన్లైన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తుందని తెలిపారు. అది కూడా తైవాన్ నుంచే ఆపరేట్ చేస్తుందని చెప్పారు. నాణ్యతకు మారుపేరుగా ఉన్న హెచ్‌టీసీ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఇటీవల కాలంలో భారీగా తగ్గాయి. చైనా స్మార్ట్ఫోన్ల నుంచి వస్తున్న పోటీని తట్టుకోలేక హెచ్‌టీసీ అమ్మకాలు భారీగా పడిపోయాయి. చాలా మార్కెట్లలో హెచ్‌టీసీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ తయారీ యూనిట్లను మూసివేస్తూ వస్తోంది. ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు కూడా చేపట్టింది. ఇప్పుడు ఏకంగా భారత్‌లో అమ్మకాలనే బంద్ చేయాలని నిర్ణయించిందని తెలిసింది. అయితే హెచ్‌టీసీ భారత్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను నిలిపివేయబోతుందని వస్తున్న వార్తలపై హెచ్‌టీసీ అధికార ప్రతినిధి స్పందించారు. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను కొనసాగిస్తామని చెప్పారు. హెచ్‌టీసీకి భారత్ చాలా ముఖ్యమైన మార్కెట్ అని అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగిస్తామన్నారు. తాజాగా భారత ఆఫీసులో చేపట్టిన వర్క్‌ఫోర్స్ తగ్గించడం లాంటి వాటితో, కంపెనీని మరింత సమర్థవంతంగా తీర్చుదిద్దుతామని, వృద్ధి, ఆవిష్కరణలో ఇదో కొత్త స్టేజ్ అని చెప్పారు. కాగ, గ్లోబల్‌గా హెచ్‌టీసీ విక్రయాలు ఏడాది ఏడాదికి 68 శాతం మేర తగ్గాయి. రెండున్నర ఏళ్లలో ఇదే భారీ పతనం. గ్లోబల్‌గా 1500 మేర వర్కర్లను తీసేయబోతున్నట్టు కంపెనీ ప్రకటన కూడా చేసింది. భారత్‌లో హెచ్‌టీసీకి కేవలం 1 శాతం కంటే తక్కువ మార్కెట్ షేరే ఉంది. శాంసంగ్,ఆపిల్, చైనా వన్‌ప్లస్, షావోమిలు భారత మార్కెట్లో అగ్రగామిగా ఉన్నాయి. -
చైనా ఫోన్లు వాడితే.. కళ్లు పోతాయ్..!?
చైనా ఫోన్లు వాడిదే ప్రమాదమా? చైనా మొబైల్ ఫోన్లలో రేడియేషన్ అధికంగా ఉంటుందా? టచ్ స్క్రీన్లు.. కంటిచూపును దెబ్బతీస్తాయా? చౌక ధరకు అధిక ఫీచర్లతో లభించే ఈ ఫోన్లు వాడితే.. ఆరోగ్యానికి ప్రమాదమా? చైనా ఫోన్లు వాడితే రెటీనా దెబ్బంతింటుందనే వాదనలు.. వార్తలు కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాయి.. ఇవి నిజమేనా? ఇటువంటి వివరాలను తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ స్టోరీ చదవండి. చైనా స్మార్ట్ ఫోన్లు దాదాపు దేశాన్ని ముంచేస్తున్నాయి. పదిమందిలో ఆరుగురి చేతుల్లో కనిపించేవి చైనా ఫోన్లే. తక్కువ ధరతో మ్యాగ్జిమమ్ ఫీచర్లతో వినియోగదారులను ఈ ఫోన్లు కట్టిపడేశాయి. ఈ ఫోన్లను అధికంగా వాడితే ఆరోగ్యానికి, కంటికి ప్రమాదమనే సంకేతాలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. చైనా ఫోన్లవల్ల మన దేశంలో చాలా కాలంగా ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయినా మనవాళ్లు వాటిని వినియోగిస్తూనేఉన్నారు. తాజాగా చైనా రాజధాని బీజింగ్‌లో 21 ఏళ్ల అమ్మాయి.. 24 గంటల పాటు మొబైల్ ఫొన్లో గేమ్స్ అడుతూ.. కంటి చూపును కోల్పోయింది. ఈ విషయంలో ఇప్పుడు చైనాలో హాట్‌టాపిక్‌గా మారింది. సుదీర్ఘ సమయంపాటు ఆన్లైన్ గేమ్ అయిన ’హానర్ ఆఫ్ కింగ్స్‘ గేమ్‌ను అమ్మాయి ఆడుతూనే ఉంది. ఆట ఆడుతున్న సమయంలో ఉన్నట్టుండి ఆమె. కుడి కన్ను పూర్తిగా మసకబారింది. చూపు కోల్పోయిన కంటిని వైద్యులు పరీక్షలు జరిపి ఆశ్చర్యకర విషయాన్ని తెలిపారు. ఇటువంటి వ్యాధిని రెటినల్ ఆర్టెరీ అక్లూషన్ (ఆర్‌ఏఓ)గా పిలుస్తారని చెప్పారు. ఇటువంటి వ్యాధి సాధారణంగా వయసు మళ్లిన వారికి వస్తుందని.. ఇంత చిన్న వయసులో రావడం అరుదని అన్నారు. ఈ అమ్మాయికి చాలా సమయం స్క్రీన్‌కేసి చూడడం వల్ల ఈ వ్యాధి వచ్చిందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా చైనాలో ’హానర్ ఆఫ్ కింగ్స్‘ గేమ్‌కు ఫాలోవర్లు లక్షల్లో ఉన్నారు. ఇటువంటి గేమ్స్ ఆడే సమయంలో స్క్రీన్ నుంచి తక్కువ రేడియేషన్ వచ్చే ఫోన్లను వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. -
నేటినుంచే ఎంఐ-5 సేల్స్..రేటెంతో తెలుసా?
న్యూఢిల్లీ: తక్కువ ధరలకే హైఎండ్ టెక్నాలజీ స్మార్ట్ఫోన్లను అందించే చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ.. తన ప్రతిష్ఠాత్మక మోడలైన 'ఐఎం-5' అమ్మకాలను బుధవారం నుంచి భారత్ లో ప్రారంభించింది. దీని ధర రూ. 24,999. ఎంఐ.కామ్ వెబ్ సైట్ లో ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ తెలుపు, నలుపు, బంగారం.. ఇలా మూడు రంగులలో లభిస్తుంది. దీనిలో రెండు వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి హైయర్ ఎండ్ 3డీ సెరామిక్ మోడల్.. దీనిపై గీతలు పడే చాన్స్ ఉండదు. మరొకటి కాస్తధరకు లభించే 3డీ గ్లాస్ మోడల్. దీనిపై అంతో ఇంతో గీతలు పడే అవకాశముంటుంది. 'ఎంఐ 5'లో 16 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 4కే వీడియోను అలవోకగా తెరకెక్కించగలిగే సోనీ ఐఎంఎక్స్298 సెన్సర్‌తో రానుంది. బాగా కదులుతూ వీడియో రికార్డ్ చేసినా షేక్ అవ్వకుండా ఇందులో 4 యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ టెక్నాలజీని ఉపయోగించారు. మొత్తంగా ఎంఐ-5 మూడు వెర్షన్లలో లభించనుంది. ఇందులో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, త్రీడీ సెరామిక్ బాడీ గల మోడల్ ధర రూ. 28 వేలు కాగా, 64 జీబీ స్టోరేజ్ గల మోడల్ రూ. 24 వేలకు, 32 జీబీ స్టోరేజి గల మోడల్ రూ. 20వేలకు లభించనున్నాయి. తక్కువ ధర కలిగిన రెండు మోడళ్లలోనూ 3 జీబీ ర్యామ్, త్రీడీ గ్లాస్ బాడీ ఉంటుంది. జియోమీ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఈ మోడల్ లో ఇతర ఫీచర్లు ఇవి: డ్యుయెల్ సిమ్ అత్యంత శక్తిమంతమైన హెచ్డీ డిస్ప్లే, థిన్ సైజ్ ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 820 క్వాల్కామ్ బ్యాటరీ: 3,000 ఎంఏహెచ్ బరువు: 129 గ్రాములు (ఐఫోన్ 6ఎస్ కన్నా 14 గ్రాములు తక్కువ) -
హైఎండ్ 'ఎంఐ-5' వచ్చేసింది.. రేటెంతో తెలుసా?
న్యూఢిల్లీ: తక్కువ ధరలకే హైఎండ్ టెక్నాలజీ స్మార్ట్ఫోన్లను అందించే చైనీస్ మొబైల్ మేకర్ జియోమీ.. ఈ కంపెనీ తాజాగా తన ప్రతిష్టాత్మక మోడలైన 'ఐఎం-5'ని బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) బుధవారం ఆవిష్కరించింది. హై ఎండ్ అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ తెలుపు, నలుపు, బంగారం.. ఇలా మూడు రంగులలో లభిస్తుంది. దీనిలో రెండు వెరియంట్స్ ఉన్నాయి. ఒకటి హైయర్ ఎండ్ 3డీ సెరామిక్ మోడల్.. దీనిపై గీతల పడే చాన్స్ ఉండదు. మరొకటి తక్కువ ధరకు లభించే 3డీ గ్లాస్ మోడల్. దీనిపై అంతో ఇంతో గీతలు పడే అవకాశముంటుంది. 'ఎంఐ 5'లో 16 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 4కే వీడియోను అలవోకగా తెరకెక్కించగలిగే సోనీ ఐఎంఎక్స్298 స్పెన్సర్ తో రానుంది. బాగా కదులుతూ వీడియో రికార్డ్ చేసినా షేక్ అవ్వకుండా ఇందులో 4యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టేబలైజేషన్ టెక్నాలజీని ఉపయోగించారు. మొత్తంగా ఎంఐ-5 మూడు వెర్షన్లలో లభించనుంది. ఇందులో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, త్రీడీ సెరామిక్ బాడీ గల మోడల్ ధర రూ. 28వేలు కాగా, 64 జీబీ స్టోరేజ్ గల మోడల్ రూ. 24వేలకు, 32జీబీ గల మోడల్ రూ. 20వేలకు లభించనున్నాయి. తక్కువ ధర కలిగిన ఈ రెండు మోడళ్లలోనూ త్రీ జీబీ ర్యామ్, త్రీడీ గ్లాస్ బ్యాడీ ఉంటుంది. ఎంఐ 5 మార్చి 1న చైనాలో విడుదల కానుంది. త్వరలోనే భారత్‌లోనూ ఈ మోడల్‌ను విడుదల చేస్తామని జియోమీ కంపెనీ ప్రకటించింది. జియోమీ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఈ మోడల్ లో ఇతర ఫీచర్లు ఇవి: డ్యుయెల్ సిమ్ అత్యంత శక్తిమంతమైన హెచ్డీ డిస్ప్లే, థిన్ సైజ్ ప్రాసెసర్: Snapdragon 820, Qualcomm బ్యాటరీ: 3,000 ఎంఏహెచ్ బరువు: 129 గ్రాములు (ఐఫోన్ 6ఎస్ కన్నా 14 గ్రాములు తక్కువ)