chintala pudi
-
చింతలపూడి.. మరో సింగరేణి
–అన్వేషణ ఫలించింది –అపార బొగ్గు నిల్వలు ఉన్నట్టు నిర్ధారణ చింతలపూడి: ఆంధ్రా సింగరేణిగా చింతపూడి ప్రాంతం నిలవనుంది. రాష్ట్రంలో బొగ్గు నిల్వలను వెలికితీసేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలో బొగ్గు నిల్వల అన్వేషణకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్), నేషనల్ మైనింగ్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ (ఎన్ఎంఈటీ)తో ఎంవోయూ కుదుర్చుకుంది. దీనిలో భాగంగా ఈ ఏడాది చివరినాటికి అన్వేషణ పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే బొగ్గు వెలికితీసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సింగరేణి కన్నా నాణ్యమైన నిల్వలు జిల్లాలోని చింతలపూడి మండలం వెంకటాపురం, నామవరం గ్రామాలు, కష్ణా జిల్లా సోమవరం ప్రాంతాల్లో జీఎస్ఐ ఇంజినీర్లు చేపట్టిన తొలిదశ బొగ్గు అన్వేషణ పనులు పూర్తయ్యాయి. సుమారు 700 మీటర్లకుపైగా లోతులో డ్రిల్లింగ్ చేసి నివేదికను ప్రభుత్వానికి పంపారు. జీఎస్ఐ చేపట్టిన అన్వేషణలో ఈ ప్రాంతంలో 200 మీటర్ల నుంచి నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నట్టు తేల్చారు. ఆరు నెలల పాటు జరిపిన సర్వేలో ఇక్కడ సింగరేణి కన్నా నాణ్యమైన బొగ్గు ఉందని తేలిందని జీఎస్ఐ డ్రిల్లింగ్ ఆపరేటర్లు మోతీలాల్దె, బ్రహ్మలింగం తెలిపారు. 2 వేల మిలియన్ టన్నులు కృష్ణా జిల్లా చాట్రాయి మండలం, సోమవరం గ్రామం నుంచి జిల్లాలోని చింతలపూడి వరకు సుమారు 2 వేల మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు తాజా సర్వేల ద్వారా వెల్లడయ్యింది. భూ ఉపరితలానికి 200 నుంచి 500 మీటర్ల లోతులో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు నివేదికలో గుర్తించారు. చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మూడేళ్ల క్రితమే గుర్తించారు లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ 2013లో కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో చేపట్టిన అధ్యయనంలో కృష్ణా జిల్లా సోమవరం నుంచి జిల్లాలోని చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల మీదుగా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు కనుగొంది. భూ ఉపరితలానికి 500 మీటర్ల లోతులోనే బొగ్గు నిల్వలు ఉన్నాయని నివేదికలో కూడా పేర్కొన్నారు. ఇక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారం¿¶ మైతే ఏడాదికి 8 వేల మెగావాట్ల చొప్పున 60 ఏళ్లపాటు విద్యుత్ కొరత ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
సమైక్యాంధ్ర కోరితే సంకెళ్లు వే స్తారా!
చింతలపూడి, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సమైక్య రాష్ర్టం సాధిస్తామని మాజీ ఎమ్మెల్యే, పార్టీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్‌కుమార్ అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాలను నుంచి సస్పెండ్ చేయడం, అరెస్ట్‌ను నిరసిస్తూ చింతలపూడి పాత బస్టాండ్ సెంటర్లో శుక్రవారం రాజేష్‌కుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రాస్తారోకో చేశాయి. సోనియా, కేంద్ర మంత్రుల ఫ్లెక్సీలను దహనం చేశారు. రాజేష్‌కుమార్ మాట్లాడుతూ అసెంబ్లీలో సమైక్య రాష్ర్టం కోసం పోరాడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడమే కాక మార్షల్స్‌తో గెంటించి అనంతరం అరెస్టు చేయడం అమానుషమన్నారు. అరె స్ట్‌లకు భయపడేది లేదన్నారు. సమైక్య రాష్ట్ర సాధనకు వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు డి.నవీన్‌బాబు, మండల కన్వీనర్ తుమ్మూరి వెంకట్రామిరెడ్డి, సర్పంచ్ మారిశెట్టి జగన్, పట్టణ కన్వీనర్ గంధం చంటి, ఏఎంసీ మాజీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ ఎం.ఇమ్మానియేలు, నాయకులు ఎస్.కాంతారావు, గోలి చంద్రశేఖర్‌రెడ్డి, జగ్గవరపు శ్రీహరిరెడ్డి, వేమారెడ్డి, దాసరి వెంకన్న, చెంచమరాజు, భాస్కర్, ఏడుకొండలు, తాతారావు, మైసన్న, పండు పాల్గొన్నారు