పోలీసుల కార్డన్ సెర్చ్ ఆపరేషన్, 60 మంది అరెస్ట్
హైదరాబాద్: రాజేంద్రనగర్ చింతల్మెట్లో ఆదివారం తెల్లవారుజామునుంచి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 350 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు జరుపుతున్నారు.
చింతల్ ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. తనిఖీలలోభాగంగా అనుమానాస్పదంగా తిరుగతున్న 60 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 40 బైక్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. పట్టుబడిన వారిలో 10 మంది రౌడీషీటర్లు, నలుగురు పాత నేరస్థులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.