Chittoor MP
-
చంద్రబాబు మళ్ళీ డ్రామాలాడుతున్నాడు
-
చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది!
సాక్షి, చిత్తూరు : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప హెచ్చరించారు. రామకుప్పం మండలంలోని బగళనత్తం, ఉన్సిగానిపల్లి గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు రాజకీయ జీవితం హత్యా రాజకీయాల నుంచి ప్రారంభమైందని, వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారన్నారు. అలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న ఆయన పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. పింగళి దశరథరామయ్య, వంగవీటి మోహనరంగా, మాధవ రెడ్డి, బాలయోగి తదితర రాజకీయ నాయకుల మరణాలకు గల కారణాలను చంద్రబాబు నాయుడు చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పినా ఇంకా బాబుకు బుద్ధిరాలేదన్నారు. టీడీపీ సమీక్షా సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు, మచ్చలేని మనిషి మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం భజన ఎందుకని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీకి చెందిన మంత్రులు, డెప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలపై టీడీపీ నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలు హర్షించరని హితవు పలికారు. జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం జోలికి వస్తే ప్రజల ఆగ్రహానికి గురికావల్సి వస్తుందని ఎంపీ హెచ్చరించారు. ఇక ఇసుక సమస్య పదిరోజుల్లో పరిష్కారమవుతుందన్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి కుమారుడు భరత్, మండల పార్టీ అధ్యక్షుడు విజలాపురం బాబు రెడ్డి, కో–కన్వీనర్ చంద్రారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణా రెడ్డి, మాజీ ఎంపీపీ జయప్ప, సిద్ధప్పపాల్గొన్నారు. -
టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
-
టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
చిత్తూరు: చంద్రబాబు ప్రభుత్వం ఎస్టీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అంబేద్కర్ జయంతి సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుడ్డారు. ‘ఏపీలో ఎస్సీ, ఎస్టీలు 25 శాతం మంది ఉన్నారు. ఈ లెక్కన ఐదు మంత్రి పదవులు రావాలి కానీ రెండు పదవులిచ్చి చేతులు దులుపుకున్నారు. కేంద్రంలో రాష్ట్రానికి రెండు మంత్రి పదవులు వస్తే రెండూ ఓసీలకే ఇచ్చారు. డిప్యూటీ సీఎం పదవులను బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలను అన్నిరకాలుగా మోసం చేస్తున్నారు. మేనిఫెస్టోలో చెప్పిన 90 శాతం హామీలు అమలు చేశామని చెబుతున్నారు. మిగిలిన ఆ పదిశాతం హామీలు మాల, మాదిగలవా? పరిశ్రమల పేరుతో డీకేటీ భూములను లాక్కుంటే పట్టించుకోరా? దళితులకు పరిహారం ఇవ్వరా? ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకుని ఓనర్లను శ్రామికులుగా మారుస్తున్నారు. ప్రభుత్వ భూములు కబ్జా అయినా పట్టించుకోరు. దళితులు అందులో ఉంటే ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తారు. దళితులకో న్యాయం, పైవర్గాల వారికి మరో న్యాయమా? పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్ లు కట్ చేశారు. దళితులు ఉన్నత చదవులు చదువుకోవద్దా? బ్యాక్ లాగ్ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబు అన్యాయం చేస్తున్నార’ని శివప్రసాద్ ధ్వజమెత్తారు.