choked to death
-
ప్రాణం తీసిన కేఎఫ్సీ చికెన్ పోటీ
ఫ్రీగా చికెన్ పెడతామంటే.. పోనీలే కదా అని వెళ్లాడు. ఎంచక్కా తినేయడమే కాదు, ప్రైజు కూడా తీసుకెళ్లిపోదామని అనుకున్నాడు. కానీ ప్రైజు మాట అటుంచితే.. ఏకంగా ప్రాణాలే పోయాయి. ఈ ఘటన ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగింది. ఫ్రైడ్ చికెన్ వింగ్స్ని వేగంగా ఎవరు తింటారంటూ కేఎఫ్సీ ఓ పోటీ నిర్వహించింది. ఈ పోటీకి కేవలం ముగ్గురు మాత్రమే ముందుకు వచ్చారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ చికెన్ వింగ్స్ ఎవరు తింటారన్నది పోటీ. ఈ పోటీలో పాల్గొన్న సదరు వ్యక్తి.. వేగంగా చికెన్ తింటుండగా, అది కాస్తా గొంతులో ఇరుక్కుంది. అతడు మంచినీళ్లు తాగాడు, డాక్టర్లు వచ్చి చూశారు గానీ.. అప్పటికే ప్రాణాలు పోయాయి. -
కుక్కతో ఆడుతూ బంతిని మింగి..
కోల్ కతా: కుక్కతో సరదాగా ఆడిన ఆట ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. బంతి నోట్లోకి ఇరుక్కుపోయి శ్వాస ఆడకపోవడంతో ఓ 27 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన దక్షిణ కోల్ కతాలోని లేక్ గార్డెన్ వద్ద చోటుచేసుకుంది. బీబీఏ గ్రాడ్యుయేట్ అయిన ఆర్నేశ్ సింఘానియా వాళ్లింట్లోని పెంపుడు జంతువు స్కూబీ అనే కుక్కతో కాలక్షేపం చేసుకుంటూ ఉన్నాడు. అందులో భాగంగా 1.5 అంగుళాల బంతిని తీసుకొని రెండు దంతాల మధ్యలో కరిచిపట్టి కుక్క నోటికి అందించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అది కాస్త స్లిప్ అయిపోయి నేరుగా నోట్లోకి దూరిపోయి గొంతులోకి జారింది. ఆవెంటనే శ్వాసనాళానికి అడ్డుపడటంతో అతడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.