ప్రాణం తీసిన కేఎఫ్‌సీ చికెన్ పోటీ
ఫ్రీగా చికెన్ పెడతామంటే.. పోనీలే కదా అని వెళ్లాడు. ఎంచక్కా తినేయడమే కాదు, ప్రైజు కూడా తీసుకెళ్లిపోదామని అనుకున్నాడు. కానీ ప్రైజు మాట అటుంచితే.. ఏకంగా ప్రాణాలే పోయాయి. ఈ ఘటన ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగింది. ఫ్రైడ్ చికెన్ వింగ్స్‌ని వేగంగా ఎవరు తింటారంటూ కేఎఫ్‌సీ ఓ పోటీ నిర్వహించింది.
ఈ పోటీకి కేవలం ముగ్గురు మాత్రమే ముందుకు వచ్చారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ చికెన్ వింగ్స్ ఎవరు తింటారన్నది పోటీ. ఈ పోటీలో పాల్గొన్న సదరు వ్యక్తి.. వేగంగా చికెన్ తింటుండగా, అది కాస్తా గొంతులో ఇరుక్కుంది. అతడు మంచినీళ్లు తాగాడు, డాక్టర్లు వచ్చి చూశారు గానీ.. అప్పటికే ప్రాణాలు పోయాయి.