తవ్వకాల్లో బయటపడ్డ 13వ శతాబ్దంనాటి కల్యాణ మండపం
బల్లికురవ: ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని కొణిదెన గ్రామంలో ఆలయ పనుల తవ్వకాల్లో 13వ శతాబ్దం నాటి చోళరాజుల కల్యాణ మండపం బయటపడింది. గ్రామ సమీపంలోని భవానీ సమేత శంకరస్వామి, వేణుగోపాలస్వామి ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాలు జీర్ణావస్థలో ఉండడంతో పురావస్తు శాఖ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో భాగంగా చేపట్టిన తవ్వకాల్లో వంటశాల మండపంతోపాటు కల్యాణ మండపం బయటపడ్డాయని, వీటిని కూడా అభివృద్ధి చేస్తామని పురావస్తు శాఖ డీఈ బంగారప్ప తెలిపారు.