నేడు ఆగిరిపల్లి ఎంపీపీ ఎన్నిక
నూజివీడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ టీడీపీ నాయకులు అసత్య ప్రచారం చేసిన చొప్పరమెట్ల ఎంపీటీసీ శ్రీనివాసరావు ఆకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. ఆయనను నూజివీడు పోలీసులు నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, శ్రీశైలం మొక్కు తీర్చుకునేందుకు వెళ్లానని, అయితే ఎంపీపీ ఎన్నికకు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉన్నందున హుటాహుటీన బయలుదేరి వచ్చినట్లు శ్రీనివాసరావు పోలీసులకు తెలిపారు. అనంతరం విచారణ నిమిత్తం అతడిని డీఎస్పీ కార్యాలయానికి తీసుకు వెళ్లారు. కాగా నిన్న నిలిచిపోయిన ఆగిరిపల్లి ఎంపీపీ ఎన్నిక నేడు జగరనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.