Chris
-
హాలీవుడ్ సినిమా.. ధనుష్ అమెరికా ప్రయాణం
రెండు నెలల పాటు అమెరికాకి మకాం మార్చనున్నారు ధనుష్. హాలీవుడ్ సినిమా కోసమే ఈ అమెరికా ప్రయాణం. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ చిత్ర దర్శక ద్వయం రుస్సో బ్రదర్స్ దర్శకత్వంలో ‘ది గ్రే మ్యాన్’ అనే యాక్షన్ చిత్రం తెరకెక్కనుంది. ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఈవెన్స్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో ధనుష్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రీకరణలో పాల్గొనడానికి అమెరికా వెళ్తున్నారు ధనుష్. ఈ రెండు నెలల్లో తన భాగానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసుకొని తిరిగొస్తారట ఆయన. ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ తర్వాత ధనుష్ చేస్తున్న రెండో హాలీవుడ్ చిత్రమిది. -
మ్యాచ్ రిఫరీగా క్రిస్ బ్రాడ్ ‘ట్రిపుల్ సెంచరీ’...
భారత్–వెస్టిండీస్ మధ్య మూడో వన్డేతో రిఫరీ క్రిస్ బ్రాడ్ అరుదైన రికార్డు అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎలైట్ ప్యానెల్ రిఫరీ అయిన బ్రాడ్... 300 వన్డేలకు రిఫరీగా వ్యవహరించిన రెండో వ్యక్తిగా నిలిచారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు క్రిస్ బ్రాడ్‌కు భారత కెప్టెన్ కోహ్లి జ్ఞాపిక అందజేశాడు. ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ బ్రాడ్ 2004లో ఆక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌కు తొలిసారి రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన కంటే ముందు రంజన్ మధుగలె (శ్రీలంక–336 మ్యాచ్‌లు) అత్యధిక మ్యాచ్‌లకు రిఫరీగా ఉన్నారు. -
శాతకర్ణి కుమారుడి సినిమా కూడా తీస్తా!
‘‘వందో సినిమా ఏది చేస్తే బాగుంటుందని ఆకలి మీదున్న సింహానికి (బాలకృష్ణ) వేట (కథ) దొరికింది. అప్పుడా కథని ఎంత గొప్పగా తీయాలని ఆలోచించాను తప్ప, ఒత్తిడికి లోను కాలేదు. బాలకృష్ణగారి నూరవ చిత్రానికి దర్శకత్వం వహించడం ఓ గౌరవం’’ అన్నారు దర్శకుడు క్రిష్. బాలకృష్ణ హీరోగాఆయన దర్శకత్వంలో వై. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు నిర్మించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఈ 12న విడుదలవుతోంది. క్రిష్ చెప్పిన విశేషాలు... ► ‘యుద్ధం నుంచి మీ నాన్న ఎప్పుడొస్తారని ఎదురు చూస్తున్నావా?’ అని చిన్నప్పుడు శాతకర్ణిని తల్లి అడుగుతుంది. అప్పుడు ‘ప్రజలెందుకు కొట్టుకుంటున్నారమ్మా?’ అనడుగుతాడు. తల్లి గౌతమి ‘ప్రజలు కొట్టుకోవడం లేదు. అధికారం చలాయించడానికి పాలకులు కొట్టుకుంటున్నారు’ అని బదులిస్తుంది. ‘ఇన్ని రాజ్యాలు కాకుండా ఒకే రాజ్యంగా ఉంటే గొడవలు ఉండవు కదా’ అనే ఆలోచన శాతకర్ణిలో వస్తుంది. ‘గణ రాజ్యాలను ఒక్కటిగా చేసే వీరుడు పుట్టాలి కదరా’ అన్నప్పుడు ‘నేను పుట్టాను కదా’ అని శాతకర్ణి గర్జిస్తాడు. సినిమా ప్రారంభ సన్నివేశమిది. 33 గణ రాజ్యాలుగా ఉన్న భారతాన్ని ఏకం చేసిన యుద్ధ పిపాస, గ్రీకులు, పర్షియన్లు తదితరులను ఎదిరించిన గొప్ప చక్రవర్తి కథే – ఈ సినిమా. ► ‘భైరవద్వీపం’, ‘ఆదిత్య 369’ చిత్రాల్లోని గెటప్స్‌లో బాలకృష్ణగారి హుందాతనం చూశాం. 99 సినిమాల అనుభవాన్ని రంగరించి బాలకృష్ణగారు చేసిన చిత్రమిది. కథ చెబుతున్నప్పుడే ఆయన హావభావాల్లో నేను శాతకర్ణిని చూశా. బాలయ్యlతప్ప ఈ పాత్రను ఎవరూ చేయలేరు. ఆయనలా ఎవరూ డైలాగులు చెప్పలేరు. అద్భుతంగా నటించారు. హేమమాలిని, శివ రాజ్‌కుమార్, శ్రియ, కబీర్‌బేడీ.. ప్రతి ఒక్కరూ బాగా చేశారు. ► ‘యుద్ధాన్ని గెలిచేది సైన్యం కాదు, వ్యూహం’ అని బాలయ్య డైలాగ్ చెబుతారు. మేమూ పక్కా వ్యూహంతో పని చేశాం. ఏదో తెలియని శక్తి మమ్మల్ని నడిపించింది. అమ్మ తోడు... ఈ మాట మా టీమ్‌తో వందసార్లు చెప్పా. ఈ చిత్ర ప్రకటన దగ్గర్నుంచీ ఇప్పటివరకూ మా తప్పులన్నీ ఒప్పులయ్యాయి. ► రాజమౌళి సృష్టించిన ఓ ఫ్యాంటసీ సినిమా ‘బాహుబలి’. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో చరిత్ర చెప్తున్నా. రెండిటికీ పోలిక పెట్టకూడదు. మొరాకోలో షూటింగ్‌కి వెళ్లడానికి ముందు రాజమౌళికి కథ చెప్పగానే.. ‘గ్రాఫిక్స్ తక్కువ ఉండేలా చూసుకో. గ్రాఫిక్స్ వర్క్ నీ చేతిలో ఉండదు. వీలైనంత లైవ్‌లో షూటింగ్ చెయ్’ అన్నారు. ట్రైలర్ రిలీజ్ కాగానే ఫోన్ చేసి ‘ఎలా తీసేశావ్?’ అనడిగారు. ‘నీ సలహా పాటిం చా’ అన్నాను. ‘గొప్ప సినిమా తీశావ్. టైమ్‌కి రిలీజ్ చేయాలంటే ఇప్పట్నుంచీ నువ్వు పడుకోవద్దు. ఎవ్వర్నీ పడుకోనివ్వకు’ అన్నారు. ఈ రెండు సలహాలూ నాకు ఎంతో సహాయపడ్డాయి. దేశమంతా చెప్పదగిన చారిత్రక కథను తెలుగు ప్రేక్షకుల కోసం కాస్త ప్రాంతీయ అభిమానంతో తీశా. దానికి తోడు హిందీలో ప్రమోట్ చేసే, తీసే టైమ్ లేదు. అందుకే బాలీవుడ్ మీద దృష్టి పెట్టలేదు. ►శాతకర్ణి కుమారుడు వాసిష్ఠీపుత్ర పులోమావి కథను సినిమాగా తీసే ఆలోచన ఉంది. అదెప్పుడో చెప్పలేను. ‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మధ్య యుద్ధమంటూ సోషల్ మీడియాలో అభిమానుల మధ్య నడుస్తున్న యుద్ధంపై క్రిష్ స్పందిస్తూ – ‘‘అభిమానం వేరు. మూర్ఖాభిమానం వేరు. ట్విట్టర్లో కొన్ని పోస్టులు ఎంత దారుణంగా ఉంటున్నాయో చెప్పలేను. పైగా, వాళ్లంతా చదువుకున్నవారు. పట్టుమని పాతికేళ్లు కూడా ఉండవు. చిన్న పిల్లలకు కులం ఎందుకు? అసలు చిరంజీవి, బాలకృష్ణగార్ల గురించి వాళ్లకు ఏం తెలుసు? మా సినిమా ప్రారంభానికి బాలకృష్ణగారు ఆప్యాయంగా చిరంజీవిగారిని ఆహ్వానించారు. అప్పుడు నేను అరగంట కథ చెప్పా. బాలయ్య భలే కథ చేస్తున్నాడని చిరు చెప్పారు. మెగాభిమానులు ఎవరైనా... తమ అభిమాన హీరో శుభాకాంక్షలు అబద్ధం అవ్వాలని కోరుకోకూడదు. నిజమైన బాలకృష్ణ అభిమానులు శుభాకాంక్షలు అందజేసిన చిరంజీవి సినిమా పట్ల అమర్యాదపూర్వకంగా ప్రవర్తించకూడదు. ఒకరు ఓడితే మరొకరు గెలవడానికి ఇవి ఎన్నికలు కావు. ఏ సినిమాను అయినా కళాత్మక దృష్టితో చూడాలి’’ అన్నారు. -
దేవిశ్రీ మోగించట్లేదు!
బాలకృష్ణ వందో చిత్రానికి మ్యూజిక్ కంచె చారిత్రక చిత్రానికి చిరంతన సంగీతం! గత ఏడాది తన ‘కంచె’కు మ్యూజిక్ చేసి, అవార్డులూ రివార్డులూ పొందిన బొంబాయి మ్యూజిక్ డెరైక్టర్ చిరంతన్‌భట్ వైపు క్రిష్ చూపు ఉందని ‘సాక్షి’కి అందిన సమాచారం. ఇప్పటికే మూడు సిచ్యుయేషన్స్ ఆయనకు క్రిష్ చెప్పారట. అందులో ఒక దానికి ఇప్పటికే చిరంతన్ ట్యూన్ కట్టేశారనీ, ఆ ట్యూన్ బాగుందనీ వినికిడి. మొన్న ఆదివారమే పెళ్ళి చేసుకొని, ప్రస్తుతం విహారయాత్రలో ఉన్న క్రిష్ తిరిగి వచ్చే లోగా చిరంతన్ మరికొన్ని ట్యూన్లు సిద్ధం చేసే సూచనలున్నాయి. హనీమూన్ నుంచి రాగానే ఆ ట్యూన్లు విని, అధికారికంగా కొత్త మ్యూజిక్ డెరైక్టర్‌ను క్రిష్ ఎనౌన్స్ చేస్తారు. ఏమైనా, చాలారోజులకొస్తున్న ఓ చారిత్రకచిత్రానికి సంగీతమిచ్చే అరుదైన ఛాన్స్ దేవిశ్రీప్రసాద్ వదిలేసుకున్నట్లే! ఇవాళ తెలుగు సినీ రంగంలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డెరైక్టర్ అంటే - దేవిశ్రీ ప్రసాద్. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, చారిత్రక కథా చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ నుంచి దేవిశ్రీ తప్పుకోవడం! చేతి నిండా సినిమాలు, మరో విదేశీ పర్యటన కూడా ఉండడంతో, ఈ చారిత్రక కథాచిత్రానికి దేవిశ్రీ తగినంత టైమ్ కేటాయించలేకపోతున్నారట! ఆ ముగ్గురిలో... కొత్త మ్యూజిక్ డెరైక్టర్ ఎవరు? దర్శకుడు క్రిష్ ఇప్పుడు మరో సంగీత దర్శకుడి అన్వేషణలో పడ్డారు. గతంలో ‘శ్రీరామరాజ్యం’కి సంగీతం అందించిన ఇళయరాజా, భక్తిరస ప్రధానమైన ‘పాండు రంగడు’తో పాటు తాజా ఇండస్ట్రీ సెన్సేషన్ ‘బాహుబలి’కి బాణీలిస్తున్న కీరవాణి - ఇలా కొన్ని పేర్లు కృష్ణానగర్‌లో ప్రచారంలో ఉన్నాయి. ‘సాక్షి’ సేకరించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం క్రిష్ బృందం అసలు ఇళయరాజాను ఇంతదాకా సంప్రతించనే లేదట! ఇక, గతంలో క్రిష్ ‘వేదం’కు సంగీతం అందించిన కీరవాణి విషయానికి వస్తే ప్రస్తుతం చేస్తున్నవి ‘బాహుబలి 2’, ‘ఓం నమో వెంకటేశాయ’ - రెండే. పైగా పౌరాణికం, జానపదం, సాంఘికం - ఇలా అన్ని తరహా సినిమాలకూ బాణీలు కట్టిన అనుభవం ఆయనకుంది. కానీ, ‘వేదం’ తరువాత మళ్ళీ కీరవాణి కాంబినేషన్‌ను రిపీట్ చేయని క్రిష్ ఆయన వైపు మొగ్గుతారా అన్నది సందేహమే. అన్నట్లు, క్రిష్ పెళ్ళికి దర్శకుడు రాజమౌళి బృందం వచ్చినా కీరవాణి ఏ బిజీ వల్లో కానీ హాజరు కాలేదు. దేవిశ్రీతో తేడా ఎక్కడొచ్చినట్లు? అసలు ఈ భారీ హిస్టారికల్ సినిమా అనుకోగానే ఇళయరాజా, కీర వాణి సహా పలువురి పేర్లు చర్చకు వచ్చాయట. క్రిష్ లేటెస్ట్ సెన్సేషన్ దేవిశ్రీ వైపే మొగ్గారు. దేవిశ్రీ కూడా మొదట్లో ఉత్సాహపడ్డారు. కానీ, ఆ తరువాత వరుసగా అంగీకరించిన అనేక ప్రాజెక్ట్స్ మధ్య రెగ్యులర్ చిత్రా లకు భిన్నమైన ఈప్రెస్టీజియస్ ఛాన్స్‌కు దేవిశ్రీ ఎందుకనో తగినంత సమయం కేటాయించట్లేదని వినికిడి. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న తొలిసారిగా ఈ చిత్రం డిజిటల్ మోషన్ పిక్చర్ రిలీజ్ చేశారు. దానికి కూడా దేవిశ్రీ తగినంత సమయం కేటాయించ లేదని వినికిడి. అప్పటికి ఓ డిజిటల్ ప్రచార మాధ్యమ సంస్థ చేసిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజి క్తోనే పోస్టర్ రిలీజ్ కానిచ్చేశారు. ఆ తరువాత దేవిశ్రీ కొట్టి(ం)చ్చిన నేపథ్య సంగీతం అంతంత మాత్రంగా ఉండడంతో, ఇప్పటి దాకా ఆ డిజిటల్ మోషన్ పోస్టర్‌ను చిత్రయూనిట్ అధికారికంగా రిలీజ్ చేయలేక పోయింది. ఒక పక్కన సినిమా షూటింగ్ శరవేగంతో జరిగిపోతున్నా, ఇప్పటి వరకు ఆయన రెండు పాటల కోసం 4 ట్యూన్లే చేశారట. అవి యూనిట్‌కు అంత తృప్తికరంగా అనిపించలేదు. కానీ, కొత్త ట్యూన్లకు కూర్చొనేందుకు దేవిశ్రీ సమయం ఇవ్వలేకపోతున్నారు. ఆ మధ్య దేవిశ్రీ తన తండ్రి సత్యమూర్తి జయంతి జరుపుతూ ఆయనతో పనిచేసిన హీరో లందరి నుంచి వీడియోలో అభిప్రాయం తీసుకున్నారట. కానీ, అప్పట్లో మొరాకోలో షూటింగ్లో ఉన్న బాలకృష్ణ గుర్రంపైనుంచిపడి ప్రమాదం పాలై, ఆస్పత్రి హడావిడిలో వీడియో బైట్ ఇవ్వలేకపోయారట. అది కూడా దేవిశ్రీలో అసంతృప్తి పెంచిందా అని కృష్ణానగర్‌లో ఒకటే చర్చ. -
సెన్సార్‌కే ఆరు నెలలు
ఓ యువజంట జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇదే చారుతో డేటింగ్’. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ చిత్రంలో క్రిష్, స్వప్న జంటగా నటించారు. ఎస్.నాగరాజు దర్శకుడు. తిరుచ్చి జి.చెల్లాదురై నిర్మాత. సి.జార్జ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. వినోదంతో పాటు సందేశం కూడా ఉన్న సినిమా ఇదని, సెన్సార్ పూర్తి కావడానికి ఆరు నెలలు పట్టిందని, ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని పూర్తి చేశామని, వచ్చే నెలలో మూడు భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రం యూనిట్ సభ్యులతో పాటు కీరవాణి తనయుడు భైరవ, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.