OTT: ‘చట్నీ సాంబార్’ వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: ‘చట్నీ సాంబార్’ వెబ్ సిరీస్నటీనటులు: యోగిబాబు, వాణి భోజన్, చంద్రన్, నితిన్ సత్య, దీపా శంకర్, తదితరులుదర్శకత్వం: రాధామోహన్ఓటీటీ: హాట్ స్టార్వేడుకేదైనా, వేదికేదైనా, సందర్భం ఎక్కడైనా, సమయం ఎప్పుడైనా మనిషికి ఎప్పటికీ తృప్తినిచ్చేది రుచికరమైన వంటలు. లేచీ లేవగానే కాఫీ టీ ల దగ్గర నుండి రాత్రి పడుకోబోయేముందు డెజర్ట్ వరకు మనం తినే ప్రతి పదార్ధానికి అంత ప్రాముఖ్యత సంతరించుకుంది మరి. తినే పదార్థాల మార్కెట్ అన్ని రంగాలలో విరివిగా వుంది. ఆ కోవలేనే హాట్ స్టార్ వేదికగా ఇటీవల ఓ సిరీస్ విడుదలైంది. దాని పేరే చట్నీ సాంబార్. మనం రోజూ విరివిగా వాడే పదాలు ఇవి. చట్నీ సాంబార్ రుచిలో ఎంత బాగుంటాయో ఈ సిరీస్ కూడా అదే విధంగా ఉంటుంది.ప్రముఖ దర్శకులు రాధామోహన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో వర్ధమాన తమిళ హాస్య నటుడు యోగి బాబు ప్రధాన పాత్రలో నటించాడు. ఇక కధాంశానికొస్తే రత్నసామి అనే వ్యక్తి ఊటీలో అముదా కేఫ్‌ను నడుపుతుంటాడు , ఈ కేఫ్ లో సాంబార్ చాలా ఫేమస్. ఒకరోజు రత్నసామి తీవ్రఅనారోగ్యానికి గురవుతాడు. మరణశయ్యపై, అతను తన తల్లిని వివాహం చేసుకునే ముందు అముద అనే మహిళతో నివసించాడని మరియు ఆమె ద్వారా తనకు ఒక కొడుకు ఉన్నాడని తన కొడుకు కార్తీక్‌కు వెల్లడిస్తాడు. కార్తీక్ నుండి తన సవతి సోదరుడిని కలుస్తానని వాగ్దానం పొందిన తరువాత, రత్నసామి మరణిస్తాడు. కార్తీక్ సవతి సోదరుడు సచిన్. చెన్నై నగరంలో సచిన్ ఓ దోసెలబండి నడుపుతుంటాడు. అతని దగ్గర చట్నీ ఫేమస్. కార్తీక్ సచిన్ ను కనుగొని, అతనిని ఊటీకి రత్నసామి అంత్యక్రియలు జరపడానకి తీసుకువస్తాడు. ఇంట్లో ఉన్న ఎవరికీ సచిన్ నచ్చడు. మరి ఇంట్లో వారినందరినీ మెప్పించి సచిన్ వచ్చిన పని నెరవేర్చాడా? ఈ దశలో కార్తీక్ మరియు సచిన్ ఎటువంటి సవాళ్ళను ఎదుర్కున్నారన్న విషయం ఇడ్లీ లేదా దోశలు తింటూ ఈ చట్నీ సాంబార్ ను హాట్ స్టార్ లో చూశేయండి. మంచి కామెడీ ఎంటర్ టైనర్ ఈ చట్నీ సాంబార్.-ఇంటూరు హరికృష్ణ