ciber crime
-
Online Fraud: ఒక్క క్లిక్‌తో రూ.1.68 లక్షలు మాయం
ముంబై: ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయి. సైబర్ నేరాలపై పోలీసులు ఎన్ని విధాల ప్రజలకు అవగాహన కల్పించినా ఫలితం లేకుండా పోతోంది. రోజుకో కొత్త రూపంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ లక్షలు కొల్లగొడుతున్నారు దుండగులు. అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగు చూసింది. విద్యుత్తు బిల్ గురించి వచ్చిన ఓ ఫేక్ మెసేజ్‌పై ఒక్క క్లిక్‌తో ఓ వ్యక్తి రూ.1.68 లక్షలు పోగొట్టుకున్నారని నాగ్‌పూర్ పోలీసులు శనివారం వెల్లడించారు. మహారాష్ట్ర ఆధ్వర్యంలోని ఓ బొగ్గు పరిశ్రమలో పని చేస్తున్న రాజేశ్ కుమార్ ఆవధియా(46)కు ఆగస్టు 29న మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. విద్యుత్తు బిల్ చెల్లించనందున మీ పవర్ సప్లయ్ నిలిపేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. బిల్ కట్టేందుకు కింది యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని అందులో సూచించారు నేరగాళ్లు. దాంతో ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ‘మెసేజ్‌లో సూచించిన లింక్‌పై క్లిక్ చేయగానే రెండు బ్యాంకు ఖాతాల్లోని రూ.1.68 లక్షలు మాయమయ్యాయి. ఐపీసీలోని చీటింగ్, ఐటీ యాక్ట్‌లు సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం.’ అని ఖపెర్ఖేడా పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: రూ.6 కోట్ల దోపిడీ కేసు.. రూ.100 పేటీఎం బదిలీతో దొరికిపోయారు! -
‘నీకు అతడి నుంచి రిక్వెస్ట్ వచ్చిందా..? యూ ఆర్ లక్కీ’.. ఎందుకంటే
సాక్షి హైదరాబాద్: యువతులు, బాలికలే టార్గెట్‌గా సోషల్‌మీడియా కేంద్రంగా అనేక మందిని వంచించిన పాలకుర్తి అజయ్ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతడి చేతిలో పదుల సంఖ్యలో బాధితులుగా మారి ఉంటారని భావిస్తున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇటీవల ఇతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన అజయ్‌ది నిరుపేద కుటుంబం. తమ కష్టాలు తీరుస్తాడనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తమ కష్టార్జితమైన రూ.4 లక్షలు చెల్లించి దిల్‌సుఖ్‌నగర్‌లోని మల్టీమీడియా సంస్థలో చేర్పించారు. విలాసాలు, జల్సాలకు అలవాటుపడిన ఇతగాడు పోర్నోగ్రఫీకి బానిసగా మారాడు. దీనికి తోడు సోషల్‌మీడియాలో ఎక్కువ సేపు కాలం గడుపుతున్నాడు. ఇతగాడు యువతీ, యువకుల పేర్లతో ఇన్‌స్ట్రాగామ్‌లో ఏడు, ఫేస్బుక్లో ఆరు నకిలీ ఖాతాలు తెరిచాడు. వీటిని వినియోగించి అనేక మంది యువ తులు, బాలికలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతూ యాక్సెప్ట్ చేసిన వారితో చాటింగ్ చేస్తున్నాడ యువతులను ట్రాప్ చేయడానికి అజయ్ ‘ద్విపాత్రాభినయం’ చేశాడు. టార్గెట్‌గా చేసుకున్న యువతి/బాలికకు తొలుత యువతిగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు. దీన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్లతో కొన్ని రోజులు చాటింగ్ చేసి నమ్మకం కలిగిస్తాడు. ఆపై ఓ యువకుడి పేరుతో అదే టార్గెట్‌కు మరో రిక్వెస్ట్ పంపిస్తాడు. యువతిగా చాటింగ్ చేస్తున్నప్పు డు ఇలా రిక్వెస్ట్ వచ్చిన విషయం యువతిగా చాటింగ్ చేస్తున్న తనతో చెప్పేలా అజయ్ వ్యవహరిస్తాడు. అలా ప్రస్తావన వచ్చిన తర్వాత ‘నీకు అతడి నుంచి రిక్వెస్ట్ వచ్చిందా..? యూ ఆర్ లక్కీ’ అంటూ మొదలెడతాడు. ఎందుకు లక్కీ అని ఎదుటి వాళ్లు ప్రశ్నిస్తే కొద్దిసేపు చెప్పకుండా వారిలో ఉత్సుకత పెరిగేలా వ్యవహరిస్తాడు. చివరకు.. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన వ్యక్తి చాలా మంచివాడని, సంపన్నుడు, తెలివిగల వాడంటూ చెప్తాడు. తనతో పాటు తన ఫ్రెండ్స్‌లో అనేక మంది అతడితో ఫ్రెండ్షిప్ కోసం పరితపిస్తున్నాడంటూ నమ్మిస్తాడు. అప్పటి వరకు తనతో చాటింగ్ చేస్తున్నది యువతిగా భావించే టార్గెట్స్ ఇవన్నీ నమ్మేస్తారు. యువకుడి పేరు, ఫొటోతో వచ్చిన రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసేస్తారు. అక్కడ నుంచి యువకుడిగా మారిపోయే అజయ్ ఆ పేరుతో టార్గెట్స్‌తో చాటింగ్ చేస్తాడు. గతంలో యువతిగా చాటింగ్ చేసినప్పుడే ఎదుటి వారి అభిరుచులు, ఆసక్తులు, ఆశలు, ఆశయాలు తెలుసుకుంటాడు. యువకుడిగా చాటింగ్ చేస్తున్నప్పుడు వాటికి తగ్గట్టు మాయమాటలు చెప్పి వారికి ఉచ్చులోకి దింపుతాడు. ఈ తరహాలో ఇతడు ఎన్ని నేరాలు చేశాడనే అంశాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇతడి నుంచి బెదిరింపులు ఎదురైన, డబ్బు చెల్లించిన బాధితులు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. -
రవిప్రకాశ్కి శల్యపరీక్ష!
-
నటుడు శివాజీ నివాసంలో సోదాలు..
-
టీవీ9 సీఈవోగా రవిప్రకాశ్ తొలగింపు
-
రవిప్రకాశ్ పాస్‌పోర్ట్ స్వాధీనం, శివాజీ ఇంట్లో సోదాలు
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీతో పాటు, నిధుల మళ్లింపుకు పాల్పడి టీవీ9 నుంచి ఉద్వాసనకు గురైన రవిప్రకాశ్ పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక గత రెండురోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. టీవీ చానల్ నిర్వహణ తన ఇష్టారాజ్యంగా జరగాలన్న పంతంతో కొత్త యాజమాన్యానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ, చివరికి ఓ కీలక ఉద్యోగి సంతకాన్ని కూడా ఫోర్జరీ రవిప్రకాశ్‌ను ఆ సంస్థ సీఈవో పదవి నుంచి టీవీ9 యాజమాన్యం తొలగించింది. అలంద మీడియా సంస్థ ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్‌పై సైబర్ క్రైమ్‌లో 406, 467, ఐటీ యాక్ట్ 56 సెక్షన్ల కింద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. చదవండి: టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై కేసు నమోదు నటుడు శివాజీ నివాసంలో సోదాలు.. అలాగే టీవీ9లో తనకు వాటా ఉందంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన నటుడు శివాజీ నివాసంలోనూ పోలీసులు సోదాలు జరుపుతున్నారు. నారాయణగూడ, హిమాయత్ నగర్‌లోని ఆయన నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. కాగా సంస్థకు హాని కలిగించే దురుద్దేశంతో శివాజీతో దురుద్దేశ పూర్వకంగా కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా, సంస్థ యాజమాన్యానికి... కంపెనీ నిర్వాహణలో ఇబ్బందులు కల్పించేలా రవి ప్రకాశ్ ప్రయత్నిస్తున్నారని టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన విషయం తెలిసిందే. ఈ కుట్రలో భాగంగా కంపెనీకి చెందిన ముఖ్యమైన డాటాను తస్కరించడమే కాక, కంపెనీకి నష్టం చేసే దురుద్దేశంతో ఆ డేటాను బయటి వ్యక్తులకు చేరవేసినట్లు అనుమానాలు ఉన్నాయని కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. అలందా మీడియా ఫిర్యాదు ప్రకారం రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీతో కలిసి కుట్ర పూరితమైన చర్యలకు పాల్పడి ఏబీసీఎల్ యాజమాన్యానికి, కంపెనీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడ్డారు. ఈ వివరాల్లోకి వెళితే, సినీనటుడు శివాజీ ఏప్రిల్ 19, 2019న హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించారు. శివాజీ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం... ఏబీసీఎల్లో రవిప్రకాశ్‌కు 20 లక్షల షేర్లు అంటే 8 శాతం వాటా ఉంది. ఇందులోనుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు రవి ప్రకాశ్‌కు 20 లక్షల రూపాయలు చెల్లించి ఫిబ్రవరి 20, 2018న ఒప్పందం కుదుర్చుకున్నానని, ఈ ఒప్పందం జరిగిన ఏడాదిలోగా షేర్లను తన పేరు మీద బదిలీ చేసేందుకు రవిప్రకాశ్ అంగీకరించారని, తాను అతని మీద నమ్మకం ఉంచానని శివాజీ పేర్కొన్నారు. చదవండి: టీవీ9 నుంచి రవిప్రకాశ్‌కు ఉద్వాసన అయితే, ఏబీసీఎల్లో మార్పులకు సంబంధించి రవిప్రకాశ్ కొన్ని నిజాలను తనవద్ద దాచారని, మోసపూరితంగా వ్యవహరించారని శివాజీ ఆరోపించారు. షేర్ల బదిలీ గురించి తాను పలుమార్లు రవిప్రకాశ్‌కు గుర్తు చేసినా ఏదో ఒక సాకు చూపుతూ, షేర్లు బదిలీ చేయలేదని, దీంతో తాను విసిగిపోయి ఫిబ్రవరి 15, 2019న రవిప్రకాశ్‌కు స్వయంగా నోటీసు అందజేశానని శివాజీ ఎన్సీఎల్టీ వద్ద దాఖలు చేసిన తన అఫిడవిట్లో పేర్కొన్నారు. దానికి రవి ప్రకాశ్ ఫిబ్రవరి 17న స్పందిస్తూ షేర్ల బదిలీలో జాప్యానికి ఎన్సీఎల్టీ జారీ చేసిన ఒక మధ్యంతర ఉత్తర్వు కారణమని, ఈ వివాదం పరిష్కారం అయిన తర్వాత షేర్లు బదిలీ చేస్తానని సమాధానం ఇచ్చారు. రవిప్రకాశ్, శివాజీల మధ్య 2018 ఫిబ్రవరిలో జరిగినట్లుగా చెబుతున్న షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కేవలం తెల్ల కాగితాలపై ఉండడం గమనార్హం. ఎవరైనా వాటా కొనుగోలు చేస్తే తక్షణం షేర్ల బదిలీ కోరుకుంటారు, కానీ, శివాజీ ఇందుకు ఏడాది గడువు ఇచ్చాననడం అనుమానాలను కలిగిస్తోంది. ఈ అనుమానాల వల్లే, శివాజీ, రవిప్రకాశ్ మధ్య కుదిరనట్లు చెబుతున్నది ఫోర్జరీ ఒప్పందంగా టీవీ9 కొత్త యాజమాన్యం భావిస్తోంది. కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు కలిగించే ఉద్దేశ్యంతో రవిప్రకాశ్, శివాజీతో కలిసి కుమ్మక్కై ఈ నాటకానికి తెర తీశారని ఏబీసీఎల్ కొత్త యాజమాన్యం తన ఫిర్యాదులో పేర్కొంది. -
టీవీ9 నుంచి రవిప్రకాశ్‌కు ఉద్వాసన
సాక్షి, హైదరాబాద్ : నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈవో రవిప్రకాశ్‌కు టీవీ9 ఉద్వాసన పలికింది. ఆయనను సీఈవో బాధ్యతల నుంచి యాజమాన్యం తప్పించింది. సంస్థ నిర్వహణలో వైఫల్యంతో పాటు, సంస్థలో కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఆరోపణల నేపథ్యంలో యాజమాన్యం గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అసోసియేట్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ (ఎబీసీఎల్) వ్యవస్థాపకుడు, సీఈవో రవిప్రకాశ్‌కు కేవలం ఎనిమిది శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ నూతన యాజమాన్యానికి సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తన నిర్ణయాలే చెల్లుబాటు అయ్యేలా ఒత్తిడి తేవడంతో పాటు, టీవీ9 తన ఆధ్వర్యంలోనే నడవాలని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా టీవీ9లో మెజారిటీ వాటా కలిగిన శ్రీనిరాజు తన వాటాలను అలంద మీడియాకు విక్రయించిన విషయం విదితమే. చదవండి:(టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై కేసు నమోదు) మరోవైపు టీవీ9 వ్యవహారంలో నటుడు శివాజీ నివాసంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. టీవీ9లో నటుడు శివాజీకి కూడా వాటా ఉన్నట్లు ... రవిప్రకాశ్ నుంచి ఆయన ఈ షేర్లు కొన్నట్లు తెలుస్తోంది. టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసుకున్న అనంతరం ఈ కొనుగోలు ప్రక్రియను సవాల్ చేస్తూ శివాజీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సవాల్ కూడా చేశాడు. అయితే రవిప్రకాశ్ ప్రోద్బలంతోనే శివాజీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ వార్తలకు ఊతమిస్తూ రవిప్రకాశ్, శివాజీ కలిసి ఉన్న ఓ ఫోటో గత ఏడాది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందుకే ఆరునెలలకు ఓసారి ఆపరేషన్ ’గరుడ’ అంటూ హడావుడి చేసే శివాజీకి టీవీ9 ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేసిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శివాజీని కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే...టీవీ9 పేరుతో తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ, ఇంగ్లీషు, హిందీ ఛానళ్లు నిర్వహిస్తున్న అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్)ను వ్యాపారవేత్త శ్రీనిరాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ , ఐల్యాబ్స్ వెంచర్ కేపిటల్ ఫండ్ కలిపి ప్రారంభించాయి. ఏబీసీఎల్ కంపెనీలో ఈ రెండు సంస్థలకు కలిపి 90 శాతానికి పైగా వాటా ఉండగా, ఆ సంస్థలో ఓ ఉద్యోగిగా చేరి సీఈవో, డైరెక్టర్‌గా హోదా పొందిన రవిప్రకాశ్, ఆయన అసోసియేట్స్‌కు సంస్థలో దాదాపు 8 శాతం వాటా ఉంది. ఏబీసీఎల్లో 90 శాతానిపైగా వాటా ఉన్న రెండు సంస్థల నుంచి ఆ వాటాను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ప్రైవేట్ లిమిటెడ్ ఆగస్టు 23, 2018న ఒప్పందం కుదుర్చుకుని ఆగస్టు (24) 25న నగదు కూడా చెల్లించింది. దీనికి అనుగుణంగానే ఆ షేర్లు మొత్తం కూడా అలందా మీడియా పేరు మీద ఆగస్టు 27వ తేదీన డి-మ్యాట్ రూపంలో బదిలీ కూడా జరిగింది. దీంతో ఏబీసీఎల్ యాజమాన్యం అలందా చేతికి మారినట్లయ్యింది. ఈ లావాదేవీని గుర్తిస్తూ, ఏబీసీఎల్ కంపెనీ తన రికార్డుల్లో నమోదు కూడా చేసుకుంది. సంబంధిత పత్రాలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో దాఖలు కూడా చేశారు. ఏబీసీఎల్ యాజమాన్యం చేతులు మారడంతో అలందా మీడియా సంస్థ తరపున నలుగురు డైరెక్టర్లను ఏబీసీఎల్ డైరెక్టర్ల బోర్డులో నియమించేందుకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అనుమతి కోరుతూ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు అధికారికంగా పంపించింది. ఈ తీర్మానాల మీద ఒకసారి రవిప్రకాశ్, మరోసారి ఎంకెవీఎన్ మూర్తి అనే మరో డైరెక్టర్ ఏబీసీఎల్ డైరెక్టర్ల హోదాలో సంతకాలు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మార్చి 29, 2019న అనుమతి మంజూరు చేస్తూ ఏబీసీఎల్కు సమాచారం పంపింది. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ, కొత్త డైరెక్టర్లతో బోర్డు మీటింగ్ నిర్వహించేందుకు రవిప్రకాశ్ శతవిధాలా అడ్డుపడుతూ వచ్చారు. దీంతో ఏబీసీఎల్లో 90 శాతానికి పైగా వాటా పొందిన అలందా మీడియాకు చెందిన నలుగురు డైరెక్టర్లు ఏప్రిల్ 23, 2019న సమావేశమై తమ నియామకానికి చెందిన పత్రాలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో దాఖలు చేయాల్సిందిగా ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న కంపెనీ సెక్రటరీని కోరారు. రవిప్రకాశ్, ఆయన సహచరులు కొందరు దీన్ని అడ్డుకునే దురుద్దేశంతో, ఆ కంపెనీ సెక్రటరీ రాజీనామా చేసినట్లు పాత తేదీతో ఫోర్జరీ డాక్యుమెంట్‌ను సృష్టించారు. ఇదే విషయాన్ని సదరు కంపెనీ సెక్రటరీ రాతపూర్వకంగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు ఫిర్యాదు చేయడమే కాక, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తాను రాజీనామా చేసినట్లు నకిలీ పత్రాన్ని సృష్టించారని వివరించారు. కంపెనీలో 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యానికి ఆ కంపెనీ నిర్వహణలో అడుగడుగునా అడ్డుపడుతూ, కంపెనీల చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కొత్త యాజమాన్యం ఆరోపించింది. మెజార్టీ వాటాదారుల హక్కులను అణగదొక్కే విధంగా కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారంటోంది అలందా మీడియా. సంస్థ నిర్వహణకు సంబంధించి రవిప్రకాశ్ పాల్పడిన అక్రమాలపై టీవీ9 యాజమాన్యం అతనిపై చీటింగ్ కేసు కూడా పెట్టింది. సంస్థకు హాని కలిగించే ఉద్దేశంతో కొందరు వ్యక్తులతో కుమ్మక్కై ఫోర్జరీ పత్రాలు సృష్టించడమే కాక, కంపెనీ నిర్వహణలో యాజమాన్యానికి ఇబ్బందులు కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. -
టీవీ9 కార్యాలయంలో పోలీసుల సోదాలు
-
నటుడు శివాజీతో కలిసి రవిప్రకాశ్ కుట్ర..
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీతోపాటు యాజమాన్యానికి తెలియకుండా నిధులు మళ్లించారంటూ ఆరోపణలతో టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై సైబర్ క్రైమ్‌లో ఐపీసీ 406, 420, 467, 469, 471, 120B, 90, 160..ఐటీ యాక్ట్ 66,72 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో ఆయన కోసం రెండు రోజుల నుంచి తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. నిధుల మళ్లింపు జరిగిందని ఆరోపిస్తూ అలంద మీడియా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ...సీఈవోపై ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తన సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలంద సంస్థ ఫిర్యాదుతో రవిప్రకాశ్ నివాసంతో పాటు టీవీ9 కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. చదవండి: రవిప్రకాశ్ పాస్‌పోర్ట్ స్వాధీనం, శివాజీ ఇంట్లో సోదాలు టీవీ9 నుంచి రవిప్రకాశ్‌కు ఉద్వాసన కాగా కొద్దిరోజుల కిందటే ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి 90శాతం షేర్లు కొనుగోలు చేసి టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసిన విషయం తెలిసిందే. యాజమాన్యం మారిన తర్వాత కొత్తగా నలుగురు డైరెక్టర్లను తీసుకోవాలని అలంద మీడియా ప్రతిపాదించింది. డైరెక్టర్ల నియామకానికి కేంద్ర సమచారశాఖ అనుమతి ఇచ్చినా... ఆ ప్రతిపాదనను రవిప్రకాశ్ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డైరెక్టర్ల నియామకాన్ని వ్యతిరేకిస్తూ బోర్డు మీటింగ్‌లో కొత్తవారిని తీసుకోవద్దంటూ ప్రతిపాదిస్తూ ఇప్పటికే ఉన్న ఓ డైరెక్టర్ సంతకంతో డాక్యుమెంట్ తయారు చేయించి, అక్రమాలకు పాల్పడ్డారని సమాచారం. అయితే ఆ సంతకం తాను చేయలేదని, డాక్యుమెంట్లో ఉన్న సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారని బాధిత డైరెక్టర్ ఆరోపించారు. దీంతో అలంద సంస్థ కార్యదర్శి పోలీసుల్ని ఆశ్రయించారు. ఇక కేవలం 9శాతం వాటా మాత్రమే కలిగి ఉన్న ఆయన యాజమాన్య మార్పును అడ్డుకునేందుకు కుటిలయత్నం చేసినట్లు భోగట్టా. టీవీ9 తన నియంత్రణలోనే ఉండాలంటూ షరతులు విధించిన రవిప్రకాశ్ కొత్త యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. మరోవైపు టీవీ9 కార్యాలయం నుంచి కొన్ని ఫైల్స్, ల్యాప్‌టాప్‌తో పాటు హార్డ్‌డిస్క్‌లు మాయం అయినట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్‌తో పాటు ఆయన అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సిటీ ల్యాబ్స్ సిద్ధం! .
ఇక కేసుల దర్యాపు వేగవంతం సైబర్, నేరాల విశ్లేషణ కోసం వినియోగం సైబర్ ఠాణా, హాకా భవన్లో ఏర్పాటు సాక్షి, సిటీబ్యూరో: నేర స్థలాల్లో లభించే, నేరాలకు సంబంధించిన ఆధారాలను విశ్లేషించేందుకు లాబొరేటరీలు ఏర్పాటు చేస్తున్నారు. నగర కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆలోచన మేరకు సిటీ ల్యాబ్స్ పేరుతో అందుబాటులోకి వస్తున్న వీటిని దర్యాప్తులు వేగవంతం చేయడం, ‘అనుమానాస్పదాలను’ గుర్తించడం కోసం వినియోగించనున్నారు. క్రైమ్ ల్యాబ్‌కు సంబంధించిన ఉపకరణాలు, సైబర్ ల్యాబ్‌కు అవసరమైన టూల్స్, సాఫ్ట్వేర్స్ ఖరీదు చేయడానికి టెండర్లు ఆహ్వానించారు. రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి ఇవి ప్రత్యామ్నాయం కావని అధికారులు స్పష్టం చేశారు. నకిలీ నోట్లు, బోగస్ ధ్రువీకరణలు, దొంగ సంతకాలు తదితరాలపై నిత్యం అనేక ఫిర్యాదులు వస్తుంటాయి. ఇతర విభాగాల కంటే సీసీఎస్‌కు వీటి తాకిడి ఎక్కువ. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా అనుమానాస్పద పత్రాలు (క్వశ్చన్డ్ డాక్యుమెంట్స్), సంతకాలను ఫోరెన్సిక్ లాబ్‌కు పంపి, వారి నివేదిక అందిన తరవాతే నిందితులపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటోంది. ఇది కాలయాపనతో కూడినది కావడంతో పాటు కొన్ని సందర్భాల్లో నిందితులు ‘ప్రత్యామ్నాయ మార్గాలు’ చూసుకోవడానికి, అజ్ఞాతంలోకి వెళ్లడానికీ అవకాశం ఏర్పడుతోంది. డ్రగ్ కేసుల్లో ‘వీగిపోయే’ ముప్పు... నగరంలో మాదకద్రవ్యాల వినియోగం గణనీయంగా పెరిగింది. ఇతర దేశాలు, రాష్ట్రాల వారితో పాటు స్థానికులూ వివిధ రకాలైన డ్రగ్స్‌తో పట్టుబడుతున్నారు. చెరస్, గంజాయి వంటి కొన్నింటిని తప్ప మిగతా వాటిని చూసి గుర్తించడం పోలీసులకు సాధ్యం కాదు. ఆ సందర్భంలో నిందితులు చెప్పిన దానిపై ఆధారపడాల్సి వస్తోంది. దీనికి పరిష్కారంగా గతంలో నగర పోలీసు విభాగం స్పాట్ టెస్టింగ్ కిట్స్ ఖరీదు చేసినా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు. కొన్ని రకాలైన మాదకద్రవ్యాలు ఏమిటో తెలుసుకోవడానికీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఫోరెన్సిక్ ల్యాబ్‌లపై ఆధారపడటంతో జాప్యం జరుగుతోంది. మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం ప్రకారం నమోదు చేసే ఈ కేసుల్లో ఎలాంటి పొరపాట్లకూ ఆస్కారం ఉండకూడదు. పట్టుబడినప్పు పోలీసులు రాసిన వివరాలు, ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో ఉన్న అంశాల మధ్య ఏమాత్రం వ్యత్యాసం కనిపించినా కోర్టుల్లో కేసులు వీగిపోయే ప్రమాదం ఉంది. ఆదమరిస్తే ‘సైబర్ క్రాష్’... ఇటీవల సిటీలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు దర్యాప్తు అధికారులకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. ఫిర్యాదు అందినప్పటి నుంచీ కేసు దర్యాప్తులో అడుగడుగునా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆన్లైన్, సోషల్ మీడియాలతో పాటు పెన్‌డ్రైవ్స్, హార్డ్‌డిస్క్‌లు తదితరాలనూ విశ్లేషిస్తారు. వీటిలో లభించిన ఆధారాలను బట్టే నిందితుల్ని గుర్తించడం, కేసు తీవ్రతను తెలుసుకోవడం సాధ్యమవుతాయి. కొన్ని సందర్భాల్లో పాక్షికంగా దెబ్బతిన్న సీడీలు, డీవీడీలతో పాటు ఇతరాల నుంచీ సమాచారం సంగ్రహించాల్సి ఉంటుంది. సెల్ఫోన్లు, ఈ-మెయిల్స్ నుంచి డిలీట్ చేసిన డేటాను సేకరించాలి. వీటిలో ఏమాత్రం పొరపాటు జరిగినా... సాంకేతిక ఆధారాలు నాశనమై దర్యాప్తుకే ఆటంకం కలుగుతుంది. రెండూ రెండు చోట్ల ఏర్పాటు... ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా సిటీ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సైబర్ ల్యాబ్‌ను సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో, క్రైమ్ ల్యాబ్‌ను సీసీఎస్ సమీపంలోని హాకా భవన్లో అద్దెకు తీసుకున్న ప్రాంతంలో రూపుదిద్దుకుంటున్నాయి. నగర అదనపు పోలీసు కమిషనర్ (నేరాలు) నేతృత్వంలో ఇవి పని చేస్తాయి. వీటిలో వినియోగించే పరికరాలు, సాఫ్ట్వేర్స్ ఖరీదు చేయడానికి టెండర్లు పిలిచారు. ఈ ల్యాబ్స్‌లో పని చేయడానికి నగర పోలీసు విభాగంలోని సిబ్బందినే ఎంపిక చేసి, అవసరమైన శిక్షణ ఇప్పించనున్నారు. ఈ ల్యాబ్స్ ఆధారాల స్వరూపం చెడిపోకుండా విశ్లేషించి, దర్యాప్తును వేగవంతం చేయడానికి ఉపకరించనున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలతో వీటికి సంబంధం లేదని, న్యాయస్థానంలో అవి కచ్చితమని అధికారులు తెలిపారు.