సాక్షి హైదరాబాద్: యువతులు, బాలికలే టార్గెట్‌గా సోషల్‌మీడియా కేంద్రంగా అనేక మందిని వంచించిన పాలకుర్తి అజయ్ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతడి చేతిలో పదుల సంఖ్యలో బాధితులుగా మారి ఉంటారని భావిస్తున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇటీవల ఇతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే.
- వరంగల్ జిల్లా పరకాలకు చెందిన అజయ్‌ది నిరుపేద కుటుంబం. తమ కష్టాలు తీరుస్తాడనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తమ కష్టార్జితమైన రూ.4 లక్షలు చెల్లించి దిల్‌సుఖ్‌నగర్‌లోని మల్టీమీడియా సంస్థలో చేర్పించారు.
- విలాసాలు, జల్సాలకు అలవాటుపడిన ఇతగాడు పోర్నోగ్రఫీకి బానిసగా మారాడు. దీనికి తోడు సోషల్‌మీడియాలో ఎక్కువ సేపు కాలం గడుపుతున్నాడు.
- ఇతగాడు యువతీ, యువకుల పేర్లతో ఇన్‌స్ట్రాగామ్‌లో ఏడు, ఫేస్‌బుక్‌లో ఆరు నకిలీ ఖాతాలు తెరిచాడు. వీటిని వినియోగించి అనేక మంది యువ తులు, బాలికలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతూ యాక్సెప్ట్ చేసిన వారితో చాటింగ్ చేస్తున్నాడ
- యువతులను ట్రాప్ చేయడానికి అజయ్ ‘ద్విపాత్రాభినయం’ చేశాడు. టార్గెట్‌గా చేసుకున్న యువతి/బాలికకు తొలుత యువతిగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు. దీన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్లతో కొన్ని రోజులు చాటింగ్ చేసి నమ్మకం కలిగిస్తాడు.
- ఆపై ఓ యువకుడి పేరుతో అదే టార్గెట్‌కు మరో రిక్వెస్ట్ పంపిస్తాడు. యువతిగా చాటింగ్ చేస్తున్నప్పు డు ఇలా రిక్వెస్ట్ వచ్చిన విషయం యువతిగా చాటింగ్ చేస్తున్న తనతో చెప్పేలా అజయ్ వ్యవహరిస్తాడు.
- అలా ప్రస్తావన వచ్చిన తర్వాత ‘నీకు అతడి నుంచి రిక్వెస్ట్ వచ్చిందా..? యూ ఆర్ లక్కీ’ అంటూ మొదలెడతాడు. ఎందుకు లక్కీ అని ఎదుటి వాళ్లు ప్రశ్నిస్తే కొద్దిసేపు చెప్పకుండా వారిలో ఉత్సుకత పెరిగేలా వ్యవహరిస్తాడు.
- చివరకు.. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన వ్యక్తి చాలా మంచివాడని, సంపన్నుడు, తెలివిగల వాడంటూ చెప్తాడు. తనతో పాటు తన ఫ్రెండ్స్‌లో అనేక మంది అతడితో ఫ్రెండ్షిప్ కోసం పరితపిస్తున్నాడంటూ నమ్మిస్తాడు.
- అప్పటి వరకు తనతో చాటింగ్ చేస్తున్నది యువతిగా భావించే టార్గెట్స్ ఇవన్నీ నమ్మేస్తారు. యువకుడి పేరు, ఫొటోతో వచ్చిన రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసేస్తారు. అక్కడ నుంచి యువకుడిగా మారిపోయే అజయ్ ఆ పేరుతో టార్గెట్స్‌తో చాటింగ్ చేస్తాడు.
- గతంలో యువతిగా చాటింగ్ చేసినప్పుడే ఎదుటి వారి అభిరుచులు, ఆసక్తులు, ఆశలు, ఆశయాలు తెలుసుకుంటాడు. యువకుడిగా చాటింగ్ చేస్తున్నప్పుడు వాటికి తగ్గట్టు మాయమాటలు చెప్పి వారికి ఉచ్చులోకి దింపుతాడు.
- ఈ తరహాలో ఇతడు ఎన్ని నేరాలు చేశాడనే అంశాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇతడి నుంచి బెదిరింపులు ఎదురైన, డబ్బు చెల్లించిన బాధితులు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment