ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిందం స్వామి(33) అనే వ్యక్తి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణ మని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.