CISF security staff
-
ముంబై ఎయిర్‌పోర్టులో కరీనాకు చేదు అనుభవం
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కటుంబంతో కలిసి పర్యాటనకు వెళ్తున్న ఆమెను ముంబై ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు అడ్డుకుని వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతొంది. ఇటీవల బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్‌ను సైతం సీఐఎస్ఎఫ్ సెక్యూరిటి అధికారి అడ్డుకుని పాస్‌పోర్ట్ అడిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా బుధవారం కరీనా కటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో భర్త సైఫ్ అలీ ఖాన్, కుమారులు తైమూర్, జహంగీర్‌తో కలిసి ఆమె ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. చదవండి: అమ్మతో ఉన్న ఫొటో షేర్ చేసిన హృతిక్... తడి గోడను పట్టేసిన నెటిజన్ అక్కడ సైఫ్, తైమూర్లు ఎటువంటి ఇబ్బందీ లేకుండా నేరుగా విమానాశ్రయంలోకి వెళ్లిపోయారు. అయితే జహంగీర్ కేర్ టేకర్, కరీనాలు వారి వెనకాలే ఉన్నారు. అక్కడ ఉన్న సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఆఫిసర్లు కేర్ టేకర్‌ను అడ్డుకుని పాస్‌పార్ట్ అడిగారు. వారితో మాట్లాడేందుకు ముందుకు వచ్చిన కరీనాను సైతం వారు పాస్‌పోర్ట్ అడగడంతో ఆమె చూపించింది. వారు చెక్ చేస్తుండగా తన వెనకాలే ఉన్న వారి మేనేజర్‌కు పాస్‌పోర్ట్ ఇచ్చి ఆమె లోపలికి వెళ్లిపోయింది. ఈ సమయంలో అప్పటికే విమానాశ్రయంలోకి వెళ్లిన సైఫ్ వెనక్కు వచ్చి కరీనా కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. ఇది చూసి నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సెలబ్రెటీ అని కూడా చూడకుండా తమ బాధ్యతను నిర్వర్తించిన సదరు సెక్యూరిటీ ఆఫీసర్లపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చదవండి: ట్రోలింగ్‌పై కరీనా మండిపాటు View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
మద్యం మత్తులో మహిళ మెట్రో ఎక్కబోతే..
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలకు రక్షణ కరవైన క్రమంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. మద్యం మత్తులో ఉన్న మహిళని క్షేమంగా ఇంటికి చేరేలా చేశారు. దక్షిణ ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల ఓ మహిళ సోమవారం రాత్రి 10.45 గంటలకు సమయ్‌పూర్ బాడ్లీ మెట్రో స్టేషన్‌కి చేరుకుంది. అప్పటికే ఆమె అతిగా మద్యం సేవించి నడవలేని స్థితిలో ఉంది. ఆమె పరిస్థితిని అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది గమనించి లోపలికి అనుమతించలేదు. మద్యం మత్తులో ఆమె ఒంటరిగా ప్రయాణించడం సాధ్యం కాదని యువతిని క్షేమంగా గమ్యం చేర్చాలని నిర్ణయించుకున్నారు. ఆమె ఫోన్ నుంచి మహిళ భర్తకి కాల్ చేసిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆమెని తన భర్తకి అప్పగించి, క్షేమంగా ఇంటికి చేరడానికి సహకరించారు. దీనిపై సీఐఎస్ఎఫ్ అధికారులు స్పందిస్తూ.. మద్యం సేవించిన వారిని మెట్రో ప్రయాణానికి అనుమతిస్తే మిగతవారికి ఇబ్బందిగా ఉంటుదన్నారు. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న ఆ మహిళ మెట్రో స్టేషన్ మెట్లు ఎక్కలేని స్థితిలో ఉందన్నారు. అందుకే ఆమెని అడ్డుకున్నామని తెలిపారు. ప్రయాణికుల భద్రత ముఖ్యం కాబట్టి, ఆమెకి తోడుగా ఒక లేడి కానిస్టేబుల్, ఒక మేల్ కానిస్టేబుల్లని పంపి క్షేమంగా తన భర్తకి అప్పగించామన్నారు. -
షార్‌లోకి చొరబడ్డ తమిళనాడు వ్యక్తి.. అరెస్ట్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో శనివారం ఎలాంటి అనుమతి లేకుండా మూలస్థానేశ్వరస్వామి ఆలయం సమీపంలో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తచ్చాడుతూ భద్రతా సిబ్బందికి కనిపించాడు. తమిళనాడు సేలంకు చెందిన వెంకటేశన్ అనే వ్యక్తిని సీఐఎస్ఎప్ భద్రతా సిబ్బంది శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడకు ఎందుకొచ్చావ్ అని అతడ్ని భద్రతా సిబ్బంది, పోలీసులు ప్రశ్నించగా ఇక్కడ చేపల విక్రయాలు చేస్తుండడం చూశానని, తనకు చేపలు పట్టడం వచ్చినందున పులికాట్ జాలర్లతో తీరప్రాంతానికి చేరుకున్నాని తెలిపాడు. కొంతమంది జాలర్లతో కలసి పడవలో ఎక్కి బకింగ్ హాం కెనాల్ చేరుకున్నానని పేర్కొన్నాడు. అతను చెప్పిన కథనమంతా నమ్మశక్యంగా లేకపోవడంతో ఇన్చార్జి సీఐ అక్కేశ్వరరావు, శ్రీహరికోట ఎస్సై విజయ్‌కుమార్, షార్ భద్రతా సిబ్బంది, షార్ ఇంటిలిజెన్స్ సిబ్బంది కలిసి వెంకటేశన్‌ను తీసుకుని సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. షార్‌లోకి ఎలా చొరబడ్డాడు? అనే విషయంపై విచారణ చేస్తున్నారు. పట్టుబడిన వ్యక్తి హిందీ, తమిళం మాట్లాడటం, అన్ని తెలిసిన వ్యక్తిగా ఉండడంతో లోతుగా విచారణ చేస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారించాక తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.