న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలకు రక్షణ కరవైన క్రమంలో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. మద్యం మత్తులో ఉన్న మహిళని క్షేమంగా ఇంటికి చేరేలా చేశారు. దక్షిణ ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల ఓ మహిళ సోమవారం రాత్రి 10.45 గంటలకు సమయ్‌పూర్ బాడ్లీ మెట్రో స్టేషన్‌కి చేరుకుంది. అప్పటికే ఆమె అతిగా మద్యం సేవించి నడవలేని స్థితిలో ఉంది. ఆమె పరిస్థితిని అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది గమనించి లోపలికి అనుమతించలేదు. మద్యం మత్తులో ఆమె ఒంటరిగా ప్రయాణించడం సాధ్యం కాదని యువతిని క్షేమంగా గమ్యం చేర్చాలని నిర్ణయించుకున్నారు. ఆమె ఫోన్ నుంచి మహిళ భర్తకి కాల్ చేసిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఆమెని తన భర్తకి అప్పగించి, క్షేమంగా ఇంటికి చేరడానికి సహకరించారు.
దీనిపై సీఐఎస్‌ఎఫ్ అధికారులు స్పందిస్తూ.. మద్యం సేవించిన వారిని మెట్రో ప్రయాణానికి అనుమతిస్తే మిగతవారికి ఇబ్బందిగా ఉంటుదన్నారు. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న ఆ మహిళ మెట్రో స్టేషన్ మెట్లు ఎక్కలేని స్థితిలో ఉందన్నారు. అందుకే ఆమెని అడ్డుకున్నామని తెలిపారు. ప్రయాణికుల భద్రత ముఖ్యం కాబట్టి, ఆమెకి తోడుగా ఒక లేడి కానిస్టేబుల్, ఒక మేల్ కానిస్టేబుల్‌లని పంపి క్షేమంగా తన భర్తకి అప్పగించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment