CITU Leader
-
ఖబడ్డార్ చంద్రబాబు .. మేం ఓట్లు వేస్తే గెలిచావ్ గుర్తుపెట్టుకో..
-
సమస్యల పరిష్కారానికి సమ్మె
బిజినేపల్లిరూరల్: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల నుంచి చాలీచాలని కూలీతో వెట్టి చాకిరీ చేస్తున్నా గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఈ నెల 23నుంచి తెలంగాణవ్యాప్తంగా సమ్మె బాట పడుతున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీను తెలిపారు. శుక్రవారం బిజినేపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఆ యా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులతో కలిసి సమ్మె నోటీసును అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికు ల వలె గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని, జీఓనం. 212, 112లను సవరించి ఈ జీఓలు వర్తించే వారందరినీ పర్మినెంట్ చేయాలని, కర్ణాటక రాష్ట్ర తరహాలో గ్రామ పంచాయతీ ఉద్యోగస్తులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. పం చాయతీ కార్యదర్శుల పోస్టుల్లో ప్రస్తుతం పనిచేస్తున్న కారోబార్, బిల్ కలెక్టర్ వంటి ఉద్యోగాల్లో పంచాయతీ కార్మికులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. పలు రకాల ఒప్పందాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఈ డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ నెల 23 నుంచి తెలంగాణవ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో బీఎల్ఎఫ్ మండల చైర్మన్ హన్మంతు, టీమాస్ మండల చైర్మన్ రాంచందర్, బీఎల్ఎఫ్ కోకన్వీనర్ చంద్రశేఖర్, కార్మిక మండల అధ్యక్షులు సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా నాయకుడు శుభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓకు సమ్మె నోటీసు తెలకపల్లి: మండల కేంద్రమైన తెలకపల్లి మేజర్ గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓ లక్ష్మీకాంత్‌రెడ్డి, ఈఓ సాదిక్బాబాకు సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి గోపాస్ లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 23నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు. కార్మికులు రూ.3వేల జీతంతో ఎలా బతుకుతారని ప్రశ్నించారు. కార్యక్రమంలో కార్మికులు అంబయ్య, సుధాకర్, ఉస్సేన్, మశమ్మ, రాంచంద్రమ్మ, అనసూయ, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. -
కామ్రేడ్ శ్రీరాముల అంతిమ యాత్ర
రొద్దం : ప్రజా సమస్యలపై అలుపెరుగని ఉద్యమాలు చేస్తూ మండల ప్రజల మన్ననలు పొందిన సీఐటీయూ మండల క్యారదర్శి శ్రీరాముల అంతిమయాత్రలో జనం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి మండలంలోని పురవీధుల్లో శనివారం అంతిమ యాత్ర చేపట్టారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి రొద్దం నరసింహులు, మండల కన్వీనర్ బి.నారాయణరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మినారాయణరెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నరహరిప్రసాద్, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు, మాజీ ఎమ్మెల్యే గఫూర్, నర్సింగరావు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు రాంభూపాల్, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు హనుమంతరెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్, జిల్లా కార్యదర్శి వెంకటేశులు, పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు శ్రీరాములు మతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మతుడి కుటుంబాన్ని ఓదార్చి అండగా ఉంటామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సీఐటీయూ నేత దుర్మరణం
చెన్నేకొత్తపల్లి : కార్మికుల సమస్యలపై అనంతపురంలో నిర్వహించిన ఆందోళనకు హాజరై తిరిగి స్వగ్రామానికి వెళుతున్న రొద్దం మండల సీఐటీయూ నేత రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఇదే ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సీఐటీయూ రొద్దం మండల కార్యదర్శి శ్రీరాములు (58) శుక్రవారం కలెక్టరేట్ వద్ద జరిగిన కార్మికుల ధర్నాకు వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత పెనుకొండ, రొద్దం ప్రాంత కార్మికులతో కలిసి ఆయన లారీలో తిరుగుపయనమయ్యారు. చెన్నేకొత్తపల్లి మండలం యర్రంపల్లి వద్దకు రాగానే గ్రాసం లోడుతో వెళుతున్న ట్రాక్టర్‌ను లారీ ఓవర్టేక్ చేయబోయింది. ఇదే సమయంలో ట్రాక్టర్ కుడివైపు టైరు పగలడంతో అదుపు తప్పి పక్కనే వెళుతున్న లారీని ఢీకొంది. దీంతో లారీలో ప్రయాణిస్తున్న శ్రీరాములు, పెనుకొండకు చెందిన జబ్బార్, పెద్దన్న, వలి కిందపడ్డారు. శ్రీరాములుపై ట్రాక్టర్ టైరు వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మతి చెందాడు. తీవ్రంగా గాయపడిన జబ్బార్, పెద్దన్న, వలిని హైవే అంబులెన్స్‌లో ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. చెన్నేకొత్తపల్లి ఎస్ఐ మహమ్మద్ రఫీ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మతిచెందిన శ్రీరాములుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శ్రీరాములు మతితో ఆయన స్వగ్రామం బూచెర్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
'కుప్పం... చంద్రబాబు అబ్బసొత్తు కాదు'
చిత్తూరు : కుప్పంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని సీఐటీయూ నేత కందారపు మురళి శనివారం చిత్తూరులో ఆరోపించారు.వీధి రౌడీల్లా వ్యవహరించారని ఆయన టీడీపీ నేతలపై నిప్పులు చెరిగారు. కుప్పం... సీఎం చంద్రబాబు అబ్బసొత్తు కాదన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చనందుకు స్థానికులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్నికల హామీలపై శుక్రవారం సాయంత్రం సీఐటీయూ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న నాయకులు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ సీపీఎం నేతలపై టీడీపీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు దాడి చేస్తుంటే పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించిన సంగతి తెలిసిందే.