రోడ్డు ప్రమాదంలో సీఐటీయూ నేత దుర్మరణం
చెన్నేకొత్తపల్లి : కార్మికుల సమస్యలపై అనంతపురంలో నిర్వహించిన ఆందోళనకు హాజరై తిరిగి స్వగ్రామానికి వెళుతున్న రొద్దం మండల సీఐటీయూ నేత రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఇదే ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సీఐటీయూ రొద్దం మండల కార్యదర్శి శ్రీరాములు (58) శుక్రవారం కలెక్టరేట్ వద్ద జరిగిన కార్మికుల ధర్నాకు వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత పెనుకొండ, రొద్దం ప్రాంత కార్మికులతో కలిసి ఆయన లారీలో తిరుగుపయనమయ్యారు. చెన్నేకొత్తపల్లి మండలం యర్రంపల్లి వద్దకు రాగానే గ్రాసం లోడుతో వెళుతున్న ట్రాక్టర్‌ను లారీ ఓవర్‌టేక్ చేయబోయింది.
ఇదే సమయంలో ట్రాక్టర్ కుడివైపు టైరు పగలడంతో అదుపు తప్పి పక్కనే వెళుతున్న లారీని ఢీకొంది. దీంతో లారీలో ప్రయాణిస్తున్న శ్రీరాములు, పెనుకొండకు చెందిన జబ్బార్, పెద్దన్న, వలి కిందపడ్డారు. శ్రీరాములుపై ట్రాక్టర్ టైరు వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మతి చెందాడు. తీవ్రంగా గాయపడిన జబ్బార్, పెద్దన్న, వలిని హైవే అంబులెన్స్‌లో ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐ మహమ్మద్ రఫీ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మతిచెందిన శ్రీరాములుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శ్రీరాములు మతితో ఆయన స్వగ్రామం బూచెర్లలో విషాదఛాయలు అలుముకున్నాయి.