అక్టోబర్ 14 నుంచి సీఐటీయూ మహాసభలు
సంగారెడ్డి మున్సిపాలిటీ: కార్మికుల పక్షన పోరాడుతున్న సీఐటీయూ రాష్ట్ర ద్వితీయ మహసభలను అక్టోబర్14 నుంచి 16 వరకు సంగారెడ్డిలో నిర్వహిస్తున్నామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం తెలిపారు. సోమవారం పట్టణంలోని కేవల్ కిషనఖఖ్ భవన్లో పోతిరెడ్డిపల్లి సర్పంచ్ సుమంగళి చంద్రశేఖర్ చేతుల మీదుగా మహసభల వాల్ పోస్టర్ను అవిష్కరించారు. కార్యక్రమంలో అంబేద్కర్ ఓకేషనల్ కాలేజీ యాజమాని ధారసింగ్, సీఐటీయు నాయకులు రాజయ్య, సాయిలు, సంతోష్ తధితరులు పాల్గొన్నారు.