cituc
-
నేడు ఆటో, క్యాబ్‌ల బంద్
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. ఈ సమ్మెకు రాష్ట్ర కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. దీంతో గురువారం గ్రేటర్ హైదరాబాద్‌లో ఆటో, క్యాబ్‌ల బంద్ పాటించనున్నట్లు ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, సీఐటీయూ, తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ తదితర సంఘాలు ప్రకటించాయి. కాగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్క ర్స్ ఫెడరేషన్ తదితర సంఘాలు సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపారు. అయినా సిటీ బస్సులు మాత్రం యథావిధిగా నడవనున్నాయి. దక్షిణమధ్య రైల్వే మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ సంఘ్, తదితర కార్మిక సంఘాలు కూడా సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపాయి. అయితే సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే అన్ని ప్రత్యేక రైళ్లు యథావిధిగా నడుస్తాయి. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ఆ సంఘం నాయకులు అరుణ్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా సమ్మెలో పాల్గొననున్న దృష్ట్యా సరుకు రవాణాకు అంతరాయం ఏర్ప డే అవకాశం ఉంది. ఆటో, క్యాబ్ డ్రైవర్ల సం క్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని.. మోటార్ వెహికల్ యాక్ట్–2019ని రద్దు చేయాలని.. ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘాలు డిమాండ్ చే శాయి. సార్వత్రిక సమ్మెకు మద్దతు ప్రకటిస్తు న్నట్లు తెలంగాణ డ్రైవర్స్ యూనియన్ జేఏసీ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తూ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. సింగరేణి కార్మికులు, బ్యాంక్, బీమా ఉద్యోగులు సంపూర్ణంగా సమ్మె పాటిస్తున్నారు. సింగరేణిలో బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు సమ్మె దిగడంతో బొగ్గు గనులు బోసిపోయాయి. గనుల వద్ద కార్మికులు నిరసన ఈ ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను హరించడమే కాకుండా పనిగంటలు పెంచడం, ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం చట్టాలను తీసుకు వస్తుందని ఆరోపించారు. అటు ఎన్టీపీసీ కాంటాక్ట్ కార్మికులు విధులను బహిష్కరించి గేటు ముందు ధర్నా చేశారు. బ్యాంక్ ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో బ్యాంక్ సేవలు స్తంభించాయి. ఆర్టీసీ కార్మికులు సైతం సమ్మెకు సంఘీభావం తెలిపినప్పటికీ బస్సులు మాత్రం యధావిధిగా నడుస్తున్నాయి. కార్మికుల సార్వత్రిక సమ్మెకు రాష్ట్రంలో అధికార పార్టీ టిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ వామపక్షాలు సంఘీభావం తెలిపాయి. పలుచోట్ల నిరసనలు ర్యాలీలు చేపట్టారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు సమ్మెకు సంఘీభావం తెలిపి కార్మికులతో కలిసి నిరసన ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. -
కేసీఆర్ బెదిరింపులకు భయపడం
ఆసిఫాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఉ ద్యోగాలనుంచి తొలగిస్తామని బెదిరింపులకు పా ల్పడటం ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలన కు నిదర్శమని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బస్సు డి పోలో నిర్వహించిన గేటు ధర్నాకు ఆయన మద్ద తు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర చాలా క్రియాశీలకమన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆ ర్ 46 రోజులపాటు కార్మికులతో సమ్మె చేయిం చి.. ఇప్పుడు సమ్మె చేస్తే సంస్థను మూసి వేస్తామనడంలో ఆంత్యరం ఏమిటని ప్రశ్నించారు. ప్రభు త్వ విధానాల వల్లనే ఆర్టీసీ నష్టాలబాట పడుతుందని ఆరోపించారు. సంస్థలో పని చేసేది 52 వేల కార్మికుల కోసం కాదని.. నాలుగు కోట్ల ప్రజ ల కోసం పని చేయాలన్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు గురిచేసినా కార్మికుల తమ ఉద్యోగ భద్రత, హక్కుల సాధనకు సమ్మె నిర్వహించి తీరాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో కేసీఆర్‌ను గద్దె దింపేంది కార్మికులేనన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఆర్టీసీ ఇచ్చింది కేవలం రూ.508 కోట్లు మాత్రమేనని, సంస్థను వ్యాపార రంగంగా కాకుండా ప్రజల సంక్షేమ రంగంగా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేశ్, జేఏసీ నాయకులు ఐలయ్య, సత్యనారాయణ, ఎజాజ్, వసంత్, హన్మంతు, సుధాకర్ పాల్గొన్నారు. -
గార్బేజీ కార్మికుల సమస్యలపై రిలే దీక్షలు
అనంతపురం : గార్బేజీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూసీ సోమవారం అనంతపురం జల్లా కేంద్రంలో ధర్నాకు దిగింది. తొమ్మిది నెలలుగా చెల్లించని వేతనాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే 18 ఏళ్లుగా పనిచేస్తున్నవారిని కార్మికులుగా గుర్తించి పీఎఫ్, ఇఎస్‌ఐల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. -
మోదీ ఏడాది పాలనపై సీఐటీయూసీ నిరసన
శ్రీకాకుళం: నరేంద్ర మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టి ఏడాది గడిచినా సామాన్యుడికి ఎలాంటి మేలు జరగలేదని సీఐటీయూసీ నాయకులు మండిపడ్డార. జిల్లా సీఐటీయూసీ ఆధ్వర్యంలో ఏడురోడ్ల కూడలిలో రాస్తారాకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఆర్టీసీ సమ్మెకు సీఐటీయూసీ మద్దతు
మెదక్ : తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఆందోళనకు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. మెదక్ జిల్లా సంగారెడ్డిలో సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులకు సీఐటీయూసీ మెదక్ జిల్లా అధ్యక్షుడు మల్లేశం మద్దతు తెలిపారు. ఆయన శనివారం సంగారెడ్డి డిపో కార్మికులను కలసి వారి సమ్మెకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.