‘రింగ్’కు కాంట్రాక్టర్ల మంతనాలు
కోల్‌సిటీ : రామగుండం కార్పొరేషన్లో రూ.10.48 కోట్లతో 89 అభివృద్ధి పనులను చేపట్టడానికి ఇటీవల అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్లను దక్కించుకునేందుకు కొంతమంది సివిల్ కాంట్రాక్టర్లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. 2015-16 సంవత్సరానికి 14వ ఆర్థిక సంఘం నిధులతో వివిధ పనులు నిర్వహించేందుకు రెండు విడతలుగా టెండర్లు ఆహ్వానించారు. షెడ్యూళ్లు దాఖలు చేయడానికి గడువు దగ్గర పడుతుండటంతో రింగ్ తిప్పడంతో ఆరితేరిన సీనియర్ కాంట్రాక్టర్లు రంగంలోకి దిగారు.
మంగళవారం మార్కండేయకాలనీలోని ఓ ప్రాంతంలో కాంట్రాక్ట ర్లు రహస్యంగా సమావేశమయ్యూరు. అభివృద్ధి పనుల ను ఎవరెవరికి కేటాయించాలనే దానిపై చర్చలు జరిపా రు. కాంట్రాక్టర్లు పోటీపడి టెండర్లు వేయకుండా ఉం డేందుకు మంతనాలు జరిపారు. ముఖ్యంగా సొసైటీల పేరుతో టెండర్లు వేస్తున్న కాంట్రాక్టర్లపై చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. కాంట్రాక్టర్లతో విడివిడిగా మాట్లాడి రింగ్‌కు సహకరించాలని నచ్చజెప్పుతున్నట్లు సమాచారం.
గతంలో ఓ కాంట్రాక్టర్ సొసైటీ పేరుతో టెండర్ వేస్తే అతనికి దక్కనీయకుండా కరీంనగర్‌కు చెందిన మరో వ్యక్తితో టెండర్ వేయించారని ప్రచారం జరుగుతోంది. కొంతమంది పెద్ద కాంట్రాక్టర్ల మధ్య గు త్తాధిపత్యం కొనసాగుతోంది. దీంతో వారు చెప్పినట్లు వినకుంటే కార్పొరేషన్లో ఒక్క టెండర్ కూడా దక్కనీ యకుండా చేస్తామనే ధోరణిలో చిన్న కాంట్రాక్టర్లను బె దిరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లకు ప్రజాప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులు వంతపాడుతుండటం వల్ల రామగుండం కార్పొరేషన్లో టెండ ర్లు అభాసుపాలవుతున్నాయనే అభిప్రాయూలున్నారుు.
రెండు విడతల్లో టెండర్లు..
* రూ.10.48 కోట్ల నిధులతో 89 అభివృద్ధి పనులకు ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెంటర్లు ఆహ్వానించారు. మొదటి విడతలో రూ.554.64 లక్షల అంచనా వ్యయంతో 22 పనులకు టెండర్లు పిలిచారు. వీటికి ఈనెల 10న టెండర్ షెడ్యూళ్లు డౌన్లోడ్ కు గడువు ఇచ్చారు. టెండర్ల స్వీకరణ, పరిశీలన కూడా ఇదే రోజున పూర్తి చేయనున్నారు.
* రెండవ విడతలో రూ.493.96 లక్షల అంచనాల వ్యయంతో 67 పనులకు టెండర్లు ఆహ్వానించారు. ఈనెల 11న డౌన్లోడ్ ముగింపు, అదేరోజున టెండర్ల స్వీకరణ, అనంతరం పరిశీలన ఉంటుందని అధికారులు వెల్లడించారు. రెండు మూడు రోజులు మాత్రమే టెండర్లకు గడువు ఉండడంతో కాంట్రాక్టర్లు వ్యూహాత్మకంగా పాలువులు కదుపుతున్నారని తెలిసింది.